{"componentChunkName":"component---src-templates-article-js","path":"/can-pappu-also-dictate-the-narrative-mate","result":{"data":{"prismicArticle":{"uid":"can-pappu-also-dictate-the-narrative-mate","tags":["politics"],"first_publication_date":"2026-11-09T16:45:46+0000","last_publication_date":"2026-11-09T16:45:46+0000","data":{"third_party_url":null,"title":{"text":"పప్పూ కూడా నరేటివ్‌ని శాసించగలడా, సాలా?"},"rating":null,"datetime":"2026-11-09T13:23:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/516bb22f-899a-45bf-b5ba-1ba60d77dc99_RaGa.JPG?auto=format,compress"},"embed":{"embed_url":null,"thumbnail_url":null,"author_url":null,"title":null},"content":{"raw":[{"text":"\"ఏదైనా ఒక సత్యం మూడు దశల గుండా వెళ్తుంది. మొదటి దశలో అది హేళనకు గురవుతుంది. రెండో దశలో తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది. మూడో దశలో దానంతట అదే నిఖార్సైన నిజంగా అందరిచేతా అంగీకరించబడుతుంది”"},{"text":"19వ శతాబ్దపు జర్మన్ తత్వవేత్త ఆర్థర్ షోపెన్‌హౌర్ చెప్పిన ఈ లోతైన రాజకీయ సూత్రం, ఒక తిరుగులేని సవాల్ వ్యవస్థాపిత అధికార నిర్మాణాలను ఎలా వణికించగలదో స్పష్టం చేస్తుంది. "},{"text":"ఒక బలమైన రాజకీయ యంత్రాంగం ఏళ్ల తరబడి కేవలం అవతలి పక్షాన్ని హేళన చేయడమే తన ఏకైక వ్యూహంగా మార్చుకుని, మొదటి దశలోనే సుఖంగా ఉండిపోతే... అకస్మాత్తుగా ఎదురయ్యే రెండో దశలోని తీవ్ర ప్రతిఘటనను తట్టుకోలేక చేతులెత్తేస్తుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం రాజకీయ మనుగడ కోసం పాకులాడాల్సి వస్తుంది. ప్రస్తుత భారత రాజకీయ యవనికపై సరిగ్గా ఇదే జరుగుతోంది. నిన్నటివరకు హేళనకు గురైన ఒక నాయకుడు అకస్మాత్తుగా కథను అడ్డం తిప్పితే, పాలకుల కంఫర్ట్ జోన్ ఎలా చెదిరిపోతుందో, మనుగడ కోసం వారు ఎంతలా ఆరాటపడాల్సి వస్తుందో ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి."},{"text":"చాలా ఏళ్లుగా అధికార పక్షమైన కాషాయ యోధులు ఒకే రకమైన మూస ధోరణిలో సాగిపోయారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఏమీ తెలియని \"పప్పూ\" అంటూ కొట్టిపారేయడం వారికి అలవాటుగా మారింది. షోపెన్‌హౌర్ సిద్ధాంతం ప్రకారం ఇది సరిగ్గా మొదటి దశ—అంటే సుఖవంతమైన హేళన. అధికార పక్షానికి ఇదొక పొలిటికల్ సెక్యూరిటీ బ్లాంకెట్ లాగా పనిచేసింది. "},{"text":"కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! తాము జోకర్ అని భావించిన వ్యక్తి, భారత రాజకీయాల్లోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా ఒకే వేదికపైకి వచ్చి లైవ్‌గా, బహిరంగంగా చర్చకు కూర్చోవాలంటూ సవాల్ విసిరాడు. అంతటితో ఆగకుండా, \"మోదీ జీ, డర్నా మత్ (భయపడకండి)!\" అంటూ ఒక సోషల్ మీడియా సంచలనాన్ని సృష్టించాడు."},{"text":"దీనికి కౌంటర్ ఎలా వచ్చింది? ఊహించని భయం, గందరగోళం! షోపెన్‌హౌర్ చెప్పిన మొదటి దశ ముక్కలై, రెండో దశ ప్రారంభమైందనడానికి ఇదే స్పష్టమైన నిదర్శనం."},{"text":"నిన్నటివరకు సాగిన వెటకారపు నవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అధికార పక్షపు వాట్సాప్ గ్రూపుల్లో డిఫెన్సివ్ కౌంటర్-ప్రొపగండా మొదలైంది. సోషల్ మీడియాలో \"తీవ్ర ప్రతిఘటన\" ఏ రూపంలో ఉంటుందో చూపిస్తూ ఒక మీమ్ వైరల్ అయింది. అందులోని సారాంశం ఏంటంటే: “టామ్ అండ్ జెర్రీ కార్టూన్‌లో జెర్రీని టామ్ ఎప్పటికీ చంపదు. ఒకవేళ చంపితే ఆ షో అక్కడితో ముగిసిపోతుంది. అలాగే, బీజేపీ కూడా రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానాన్ని ముగించదు, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ పొలిటికల్ షో ముగిసిపోతుంది.”"},{"text":"ఎంతటి విచిత్రమైన పరిస్థితి! నిన్నటివరకు ప్రతి హెడ్‌లైన్‌ను తామే శాసించిన ఒక భారీ రాజకీయ యంత్రాంగం, ఇప్పుడు రెండో దశ మనుగడ పోరాటంలో పడిపోయింది. తాము జెర్రీ మౌస్ లాంటి వ్యక్తి వెనుక పరిగెడుతున్నామని ఒప్పుకోలేక, అసలు తామే కావాలని ఈ పొలిటికల్ \"షో\"ని నడిపిస్తున్నామంటూ తమ కార్యకర్తలను సమాధానపరుచుకునే ప్రయత్నంలో పడ్డారు."},{"text":"ఈ ఆరాటం కేవలం ఆన్‌లైన్ మీమ్స్‌కే పరిమితం కాలేదు. హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఒక బహిరంగ సభ మైక్ ముందుకు వచ్చి తీవ్రంగా స్పందించారు. రాహుల్ నరేటివ్‌ను అడ్డుకునేందుకు, బహిరంగంగా కాకుండా కేవలం పార్లమెంట్ లోపల మాత్రమే చర్చకు రావాలని, అవసరమైతే పాలసీలపై చర్చించడానికి ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పెట్టారు."},{"text":"అయితే, ఈ గందరగోళాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న రాహుల్ గాంధీ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. రూల్స్, ప్రోటోకాల్స్ వెనుక దాక్కోవాలని చూస్తున్న పాలకుల తీరును ఎండగడుతూ: “అమిత్ షా జీ, మోదీ గారిని కన్ఫ్యూజ్ చేయకండి. నాతో ఓపెన్ డిబేట్‌కు వచ్చేలా ఆయన్ను ఒప్పించండి. వేదిక ఏదైనా, సమయం ఏదైనా సరే... భయపడకండి,” అని ట్వీట్ చేశారు. ఈ సవాల్ తాకిడి ఎంతలా ఉందంటే, నిన్నటివరకు ఎవరినైతే \"పప్పూ\" అని హేళన చేశారో, ఆయన నుంచే దేశాన్ని కాపాడాలంటూ అధికార పక్షం అంతా ఏకంగా వీధుల్లోకి వచ్చి పాదయాత్రలు చేస్తూ \"ప్రజాస్వామ్యాన్ని కాపాడండి\" అని ప్రజలను కోరడం ఒక పెద్ద ఐరనీ."},{"text":"నిన్నటి \"పప్పూ\" నేడు అధికార పక్షాన్ని రెండో దశలోకి లాగి, నరేటివ్‌ను శాసించే ముఖ్య సూత్రధారిగా మారాడు. గేమ్ ప్లాన్‌ను ఆయనే నిర్దేశిస్తుంటే, బీజేపీ పెద్దలంతా డిఫెన్స్‌లో పడి రోడ్లపైకి రాక తప్పడం లేదు. ప్రభుత్వం తమకు నచ్చిన అంశాలపై మాట్లాడుకుంటూ సాిగిపోయే రోజులకు చెక్ పెడుతూ, పక్కా పాలసీలపై రాహుల్ నేరుగా సమాధానాలు డిమాండ్ చేస్తున్నాడు. వివాదాస్పదమైన ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను టార్గెట్ చేస్తూ, ఓటర్ లిస్టులను రాజకీయంగా వాడుకుంటున్నారా అని నిలదీస్తున్నాడు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల లోగుట్లు, కార్పొరేట్ గవర్నెన్స్, ఫారిన్ ట్రేడ్ క్లెయిమ్స్‌పై బహిరంగంగా తేల్చుకుందాం రమ్మంటున్నాడు."},{"text":"తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని నిరూపించడానికి, రాహుల్ ప్రధానికి పూర్తి హోమ్-టర్ఫ్ అడ్వాంటేజ్ (అనుకూలమైన వేదిక) ఇచ్చాడు. వేదిక ఏదైనా, మీడియా ఏదైనా మోదీగారే ఎంచుకోవచ్చని, అంపైర్లుగా లేదా జడ్జీలుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌నో లేక గౌతమ్ అదానీనో పెట్టుకుందామంటూ వ్యంగ్యంగా ఆఫర్ ఇచ్చాడు."},{"text":"నిజం చెప్పాలంటే, ఒకప్పుడు పప్పూ అనిపించుకున్న వ్యక్తి, ఇప్పుడు తనలోని అసలైన మాస్ \"బాలయ్య\" (నందమూరి బాలకృష్ణ) యాటిట్యూడ్‌ను బయటకు తీసి, అధికార పక్ష హెడ్‌క్వార్టర్స్ వైపు చూస్తూ తొడగొట్టి చెబుతున్నాడు:“నీ ఊరొచ్చా... నీ ఇంటికొచ్చా... నీ నట్టింటికొచ్చా! పోనీ అడ్రస్ ఇవ్వు, నీ ఇంటికి వచ్చి డిబేట్ చేస్తా!”"},{"text":"కానీ, సుప్రీమ్ లీడర్‌షిప్ వైపు నుంచి ఎలాంటి శబ్దమూ లేదు, నిశ్శబ్దం మాత్రమే రాజ్యమేలుతోంది. ఎగతాళి ఫలించనప్పుడు, ప్రతిఘటన కాస్తా పలాయనంగా మారినప్పుడు... నిఖార్సైన పాలసీలపై, అన్‌స్క్రిప్టెడ్ లైవ్ చర్చను ఎదుర్కొనే ధైర్యం ఎవరికి ఉంటుంది? దానికంటే బ్యూరోక్రాటిక్ రూల్స్ వెనుక, వాట్సాప్ మీమ్స్ వెనుక దాక్కోవడమే సురక్షితం కదా!"},{"text":"చివరగా చెప్పేదేంటంటే... ఈ కార్టూన్ షో ఇంకా ముగిసిపోలేదు. కానీ పాత్రలు మాత్రం పూర్తిగా అడ్డం తిరిగాయి. అధికార పక్షం ఇప్పుడు నరేటివ్‌ను నడిపించే స్థితిలో లేదు—వారు కేవలం హోమ్-టర్ఫ్ ఛాలెంజ్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక మీమ్స్ వేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఎందుకంటే, త్వరలోనే మూడో దశ రాబోతోందని, అక్కడ ఈ కొత్త సవాల్ ఒక తిరుగులేని నిజంగా అందరి ముందు ఆవిష్కృతం కాబోతోందని వారికి అర్థమైంది. అదే వారిని ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది!"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-ex-mla-held-on-way-to-kodangal","data":{"third_party_url":null,"title":{"text":"BRS Ex MLA Held on Way to Kodangal"},"img":{"url":"https://images.prismic.io/prad/RxxLJKMSTTh3cz7m_patnammahendar.JPG?auto=format%2Ccompress&rect=0%2C27%2C421%2C208&w=2028&h=1000"},"datetime":"2026-11-09T11:25:00+0000"}}},{"node":{"uid":"cbn-renews-war-on-500-notes","data":{"third_party_url":null,"title":{"text":"CBN Renews War on ₹500 Notes"},"img":{"url":"https://images.prismic.io/prad%2F436424f2-dbad-4f7d-ab9a-3f4e62e2b605_cbn.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-11-09T14:40:00+0000"}}},{"node":{"uid":"hyd-records-70-diwali-eye-injuries","data":{"third_party_url":null,"title":{"text":"Hyd Records 70 Diwali Eye Injuries"},"img":{"url":"https://images.prismic.io/prad/ZyS5ha8jQArT0HWy_eyeinjury.JPG?auto=format,compress"},"datetime":"2026-11-09T07:58:00+0000"}}},{"node":{"uid":"spy-allegations-rock-nvidia","data":{"third_party_url":null,"title":{"text":"Spy Allegations Rock Nvidia"},"img":{"url":"https://images.prismic.io/prad/k2Qi0vN3DLnY6dl6_nivediaceo.JPG?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-11-09T09:52:00+0000"}}},{"node":{"uid":"coalition-dominates-ap-civic-polls","data":{"third_party_url":null,"title":{"text":"Coalition Dominates AP Civic Polls"},"img":{"url":"https://images.prismic.io/prad/ZjvNQUMTzAJOCpHN_modipkcbnroadshow.JPG?auto=format,compress"},"datetime":"2026-11-08T16:05:00+0000"}}},{"node":{"uid":"rr-celebrates-birthday-with-family","data":{"third_party_url":null,"title":{"text":"RR celebrates birthday with family"},"img":{"url":"https://images.prismic.io/prad/pOSMAlYM_tjHmd7h_RRBirthday.JPG?auto=format%2Ccompress&rect=0%2C25%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-11-08T12:15:00+0000"}}},{"node":{"uid":"whisky-that-sounds-good-enough-to-eat","data":{"third_party_url":null,"title":{"text":"Whisky That Sounds Good Enough to Eat"},"img":{"url":"https://images.prismic.io/prad/2fe5c06b-a0a3-4a34-8854-a974c7a2175b_whiskyday.JPG?auto=format,compress"},"datetime":"2026-11-08T03:31:00+0000"}}},{"node":{"uid":"l-k-advani-turns-100","data":{"third_party_url":null,"title":{"text":"L K Advani turns 100"},"img":{"url":"https://images.prismic.io/prad/cF_oV1jCjoktsnAk_adcani.JPG?auto=format%2Ccompress&rect=0%2C15%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-11-08T03:45:00+0000"}}},{"node":{"uid":"a-mothers-defence-a-sons-failures","data":{"third_party_url":null,"title":{"text":"A Mother's Defence, A Son's Failures"},"img":{"url":"https://images.prismic.io/prad/2ox54D5-hOrzaf6x_motherson.JPG?auto=format%2Ccompress&rect=0%2C11%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-11-08T07:15:00+0000"}}},{"node":{"uid":"triple-suicide-shocks-hyd","data":{"third_party_url":null,"title":{"text":"Triple Suicide Shocks Hyd"},"img":{"url":"https://images.prismic.io/prad/4ed34f94-80b9-4eb4-954d-40971aa9e4bb_hang.JPG?auto=format,compress"},"datetime":"2026-11-08T07:00:00+0000"}}},{"node":{"uid":"bishnoi-gangs-hari-boxer-held-in-us","data":{"third_party_url":null,"title":{"text":"Bishnoi Gang's Hari Boxer Held in US"},"img":{"url":"https://images.prismic.io/prad/Y9k5vuLQtla5q72t_bishnoigangmember.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C640%2C316&w=2028&h=1000"},"datetime":"2026-11-07T11:22:00+0000"}}},{"node":{"uid":"sonias-life-as-a-gandhi-takes-centre-stage","data":{"third_party_url":null,"title":{"text":"Sonia's Life as a Gandhi Takes Centre Stage"},"img":{"url":"https://images.prismic.io/prad/4AgzvzEIZgjNmlT9_sonia.JPG?auto=format%2Ccompress&rect=0%2C25%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-11-07T14:05:00+0000"}}},{"node":{"uid":"shami-retires-from-test-cricket","data":{"third_party_url":null,"title":{"text":"Shami retires from Test cricket"},"img":{"url":"https://images.prismic.io/prad/35fa277e-736b-409a-8972-057aabeb6817_shami.JPG?auto=format,compress"},"datetime":"2026-11-06T18:32:00+0000"}}},{"node":{"uid":"man-wanted-to-kill-trump-claims-voices","data":{"third_party_url":null,"title":{"text":"Man Wanted to Kill Trump, Claims Voices"},"img":{"url":"https://images.prismic.io/prad%2Feff86a8b-901c-44b3-a1fe-d359b959cc91_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1920%2C947&w=2028&h=1000"},"datetime":"2026-11-07T04:27:00+0000"}}},{"node":{"uid":"india-edge-nz-by-4-runs-in-dls-thriller","data":{"third_party_url":null,"title":{"text":"India Edge NZ by 4 Runs in DLS Thriller"},"img":{"url":"https://images.prismic.io/prad/0HmJYX7tHCozACUW_indnz.JPG?auto=format%2Ccompress&rect=0%2C48%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-11-07T10:32:00+0000"}}},{"node":{"uid":"the-dictators-nightmare-a-flawed-screenplay","data":{"third_party_url":null,"title":{"text":"సర్వాధికారి పీడకల: పట్టుతప్పిన స్క్రీన్ ప్లే?"},"img":{"url":"https://images.prismic.io/prad/fd89ac41-4965-4176-9c6e-a86eee9a124f_modishah.JPG?auto=format,compress"},"datetime":"2026-11-06T12:25:00+0000"}}},{"node":{"uid":"ballot-box-row-ycp-mlc-behind-bars","data":{"third_party_url":null,"title":{"text":"Ballot Box Row: YCP MLC Behind Bars"},"img":{"url":"https://images.prismic.io/prad/d9rgZJndNbTqqzDk_YCPMLAArrested.JPG?auto=format%2Ccompress&rect=0%2C61%2C404%2C199&w=2028&h=1000"},"datetime":"2026-11-06T06:45:00+0000"}}},{"node":{"uid":"metro-tgrtc-pass-half-price-surprise","data":{"third_party_url":null,"title":{"text":"Metro-TGRTC Pass: Half-Price Surprise!"},"img":{"url":"https://images.prismic.io/prad/f4xzleHKWk9xoi_-_hydmetropass.JPG?auto=format%2Ccompress&rect=0%2C40%2C428%2C211&w=2028&h=1000"},"datetime":"2026-11-06T06:00:00+0000"}}},{"node":{"uid":"hc-defers-key-hearing-on-cbn-cases","data":{"third_party_url":null,"title":{"text":"HC Defers Key Hearing on CBN Cases"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7277b0da-8baa-40b4-a4b7-6aefd2055454_cbn.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-11-05T14:45:00+0000"}}},{"node":{"uid":"athiya-is-rahuls-greatest-blessing","data":{"third_party_url":null,"title":{"text":"Athiya Is Rahul’s Greatest Blessing"},"img":{"url":"https://images.prismic.io/prad/62aa432a-898b-437b-b8ac-dc0b87eb39d0_Athiya+Shetty_+KL+Rahul.JPG?auto=format,compress"},"datetime":"2026-11-05T05:33:00+0000"}}},{"node":{"uid":"once-a-king-always-a-king","data":{"third_party_url":null,"title":{"text":"'Once a King, Always a King'"},"img":{"url":"https://images.prismic.io/prad%2Fcc68920a-768a-4617-b32b-5af8027c7ee3_kohli.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-11-05T09:45:00+0000"}}}]}},"pageContext":{"uid":"can-pappu-also-dictate-the-narrative-mate","tags":["politics"]}},"staticQueryHashes":["3710696600"]}