రివ్యూ : 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'- ఎమోషనల్‌ జర్నీ

Movie Review
రివ్యూ : 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'- ఎమోషనల్‌ జర్నీ

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti | Pradeep C | Ajaneesh Loknath

Our Rating

2
out of 5

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నప్పటికీ ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఆసక్తిని పెంచుతూనే ఉన్నాయి. తాజాగా విజయశాంతి ముఖ్య పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ

వైజయంతి(విజయశాంతి) పవర్ ఫుల్‌ సిన్సియర్‌ ఐపీఎస్ ఆఫీసర్‌. ఆమె తనయుడు అర్జున్‌(నందమూరి కళ్యాణ్‌ రామ్‌) సైతం తల్లి దారిలో ఐపీఎస్ కావాలి అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రౌడీగా మారుతాడు. దాంతో తల్లికే వ్యతిరేకంగా మారుతాడు. దాంతో వైజయంతి తన కొడుకు అర్జున్‌పై న్యాయ పోరాటంకు సిద్ధం అవుతుంది.

ఇంతకు తల్లి కొడుకుల మధ్య విభేదాలు ఏంటి? ఎందుకు అర్జున్‌ రౌడీ అవుతాడు అనేది కథ.

నటీనటుల నటన

నందమూరి కళ్యాణ్ రామ్‌ నటన ఆకట్టుకుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. కొన్ని సాంగ్స్‌లో తేలిపోయినా మొత్తంగా సినిమాలో ఆయన నటన బాగుంది. నటన పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు, యాక్షన్‌ పరంగా సినిమాతో మెప్పించాడు. గతంలో మాదిరిగానే నందమూరి కళ్యాణ్ రామ్‌ మరో సారి తన పవర్‌ ఫుల్‌ నటనతో మెప్పించాడు.

విజయశాంతి వయసు పెరిగినా కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపించారు. అంతే కాకుండా ఆమె పవర్‌ ఫుల్‌, ఎమోషన్‌ సీన్స్‌లో మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారుర.

టెక్నికల్‌

దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ కొన్ని సీన్స్‌ తో మెప్పించలేక పోయాడు. ముఖ్యంగా తల్లి కొడుకుల మద్య వచ్చే సన్నివేశాలను ఇంకాస్త బెటర్‌గా చూపించే అవకాశం ఉంది. కానీ ఆయన బెటర్‌గా చేయడంలో విఫలం అయ్యాడు.

సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిర్మాణాత్మక విలువలు యావరేజ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి.

విశ్లేషణ

దర్శకుడు ప్రదీప్‌ ఎంపిక చేసుకున్న కథను స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అలరించలేక పోయాడు. కానీ సినిమాలో అతడు నటీనటులతో ఆకట్టుకునే విధంగా నటింపజేశాడు. కానీ స్క్రీన్‌ప్లే మీద మరింత పట్టు సాధించి ఉంటే బాగుండేది.

తల్లి కొడుకుల మధ్య సన్నివేశాలను మరింత స్ట్రాంగ్‌గా చూపించవచ్చు. విజయశాంతిని పవర్‌ ఫుల్‌గా చూపించాడు. హీరో పాత్రను హైలైట్‌ చేశాడు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త వర్కౌట్‌ చేయాల్సి ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌

కళ్యాణ్ రామ్‌, విజయశాంతి,

యాక్షన్‌ సన్నివేశాలు,

మైనస్‌ పాయింట్స్

కథ, స్క్రీన్‌ప్లే,

ఎడిటింగ్‌

కొన్ని పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం.

చివరగా..

తల్లి కొడుకుల ఎమోషనల్ డ్రామా ఒక మోస్తరు ఎంటర్టైన్మెంట్

బ్యానర్‌ : ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌

నిర్మాత : కళ్యాణ్ రామ్‌

దర్శకత్వం : ప్రదీప్‌ చిలుకూరి

సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్‌

తారాగణం : కళ్యాణ్ రామ్‌, విజయశాంతి, సోహైల్‌ ఖాన్‌, సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ తదితరులు

Related Reviews

Related News