{"data":{"prismicReviewarticle":{"uid":"review-tilly-square","tags":["politics"],"first_publication_date":"2024-03-29T08:16:56+0000","last_publication_date":"2024-03-30T10:19:29+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘టిల్లు స్క్వేర్’"},"rating":3,"datetime":"2024-03-29T07:19:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZgZrYct2UUcvBRMz_TeilluSquare.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C2028%2C1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=YNVU8fjJj4U","thumbnail_url":"https://i.ytimg.com/vi/YNVU8fjJj4U/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@adityamusic","title":"Tillu Square - Theatrical Trailer | Siddu, Anupama Parameswaran | Mallik Ram | Ram Miriyala"},"content":{"raw":[{"text":"కథ:"},{"text":"‘డిజె టిల్లు’ మూవీ కథ ఎక్కడైతే ఎండ్ అవుతుందో... అక్కడి నుంచి ‘టిల్లు స్క్వేర్’ కథ మొదలవుతుంది. తనకు దక్కిన భారీ మొత్తం డబ్బుతో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఈవెంట్ ఆర్గనైజర్ అవతారం ఎత్తుతాడు. "},{"text":"ఫస్ట్ పార్టులో టిల్లు యాటిట్యూడ్ ఎలా ఉంటుందో... అదే యాటిట్యూడ్ తో ఇందులోనూ కనిపిస్తాడు. ఈ క్రమంలో టిల్లు లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)తో తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. "},{"text":"ఈ క్రమంలో ఓ పెద్ద చిక్కులో ఇరుక్కుంటాడు. ఆ చిక్కు నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు అనేది తర్వాతి కథ. "},{"text":"సినిమా ఎలా ఉందంటే..."},{"text":"‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ హీరో క్యారెక్టరైజేషన్‌ బేస్ చేసుకుని నడిచే కథలు. టిల్లు పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన పాత్ర. మళ్లీ అదే పాత్రతో, అదే క్యారెక్టరైజేషన్ తో... సరికొత్తగా ప్రేక్షకులను నవ్వించడం అంటే అంత ఈజీ కాదు. ఈ విషయంలో చిత్ర బృందం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మొదటి భాగం ముగిసిన చోటనే సీక్వెల్ ప్రారంభమవుతుంది. సినిమాను మొదలు పెట్టిన పాయింట్ బావుంది కానీ... అయితే ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్, హీరో హీరోయిన్ ను పడేయడం లాంటి సన్నివేశాలతో కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. "},{"text":"అయితే వినోదాత్మక కథనంతో సెకండాఫ్ ఆకట్టుకునే విధంగా ఉంది. వన్-లైనర్స్ మరియు ట్రెండీ డైలాగ్స్ ద్వారా టిల్లు మీక మంచి వినోదాన్ని అందిస్తాడు. అయితే సినిమాలో బలమైన కథ లేదు. కేవలం ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ తోనే సాగి పోతుంది. టిల్లు పంచే వినోదం, ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా రాసుకున్నస్కీన్ ప్లే కథలోని లోపాల్ని కప్పేస్తుంది. సినిమాలోని కొన్ని సీన్లు డీల్ చేసిన విధానం సిల్లీగా కనిపిస్తోంది. ఓవరాల్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెలిసిన కథనే వినోదాత్మకంగా నేరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు."},{"text":"ఎవరు ఎలా చేశారు? "},{"text":"సిద్ధూ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. తన డైలాగ్ డెలివరీ తారు, బాడీ లాంగ్వేజ్, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను నవ్విస్తాడు. "},{"text":"అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. "},{"text":"మురళీధర్ గౌడ్, ప్రిన్స్, మురళి శర్మ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. "},{"text":"సాంకేతిక అంశాలు:"},{"text":"రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలు కంపోజ్ చేసిన విధానం, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనంతో బాగా మిక్స్ అవ్వడంతో ప్రేక్షకులను మంచి మూడ్‌ లోకి తీసుకెళుతుంది. "},{"text":"నవీన్ నూలి ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి."},{"text":"ప్లస్ పాయింట్లు:"},{"text":"టిల్లు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్"},{"text":"అనుపమ బోల్డ్ పెర్ఫార్మెన్స్"},{"text":"వినోదాత్మకంగా సాగే స్క్రీన్ ప్లే"},{"text":"మైనస్ పాయింట్స్: "},{"text":"బలమైన కథ లేక పోవడం"},{"text":"ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం"},{"text":"చివరగా..."},{"text":"‘డీజే టిల్లు’కి ఏమాత్రం తగ్గని ఎంటర్టెన్మెంట్ ‘టిల్లు స్కేర్’."},{"text":"నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ"},{"text":"దర్శకుడు: మల్లిక్ రామ్"},{"text":"నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య"},{"text":"సంగీత దర్శకులు: రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-student-wing-stages-protest-over-mp-suryas-remarks","data":{"third_party_url":null,"title":{"text":"BRS student wing stages protest over MP Surya’s remarks"},"img":{"url":"https://images.prismic.io/prad/aeIG9Z1ZCF7ETSSI_BRSStudentwing.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-17T08:10:00+0000"}}},{"node":{"uid":"gautam-adani-becomes-asias-richest-person","data":{"third_party_url":null,"title":{"text":"Gautam Adani becomes Asia’s richest"},"img":{"url":"https://images.prismic.io/prad/Z02IxpbqstJ978If_adani.JPG?auto=format,compress"},"datetime":"2026-04-17T05:51:00+0000"}}},{"node":{"uid":"amit-shahs-firm-stance-no-religious-reservations-for-muslims-mo2pi22d","data":{"third_party_url":null,"title":{"text":"Amit Shah: No Religious Reservations for Muslims"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9a998da1-ed74-4d1d-bf5c-3ce42a2986be_amit+shah.jpg?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-04-16T19:29:00+0000"}}},{"node":{"uid":"bengaluru-businessmans-honeytrap-nightmare-blackmailed-after-instagram-encounter-mo2pi7w3","data":{"third_party_url":null,"title":{"text":"Businessman’s Honeytrap Nightmare"},"img":{"url":"https://images.prismic.io/prad/c8335006-73f0-4db2-9b9f-f9d6f0421a05_love+is+blind.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T18:30:00+0000"}}},{"node":{"uid":"ysr-congress-leader-released-on-bail","data":{"third_party_url":null,"title":{"text":"YSR Congress leader released on bail"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7216aea1-016a-4612-8cd4-886237641335_ysrcp.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:39:00+0000"}}},{"node":{"uid":"tvk-manifesto-welfare-ai-1.5t-goal","data":{"third_party_url":null,"title":{"text":"TVK Manifesto: Welfare, AI, $1.5T Goal"},"img":{"url":"https://images.prismic.io/prad/aeEUw51ZCF7ETQr3_vijaytvk.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:15:00+0000"}}},{"node":{"uid":"from-now-onwards-nari-shakti-will-not-be-just-a-slogan","data":{"third_party_url":null,"title":{"text":"From now onwards, Nari Shakti will not be just a slogan"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T07:30:00+0000"}}},{"node":{"uid":"infosys-denies-pune-harassment-claims","data":{"third_party_url":null,"title":{"text":"Infosys Denies Pune Harassment Claims"},"img":{"url":"https://images.prismic.io/prad/7766529c-412f-4d9a-a068-c32a77895fee_infosys.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T06:06:00+0000"}}},{"node":{"uid":"case-filed-against-vijay","data":{"third_party_url":null,"title":{"text":"Case filed against Vijay"},"img":{"url":"https://images.prismic.io/prad/aPPHEJ5xUNkB2HoK_vijay.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T05:30:00+0000"}}},{"node":{"uid":"pichai-ranbir-in-times-100-most-influential-people-of-2026","data":{"third_party_url":null,"title":{"text":"Pichai, Ranbir in TIME's '100 Most Influential'"},"img":{"url":"https://images.prismic.io/prad/aeC5qZ1ZCF7ETPhc_pichairanbir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T05:28:00+0000"}}},{"node":{"uid":"madras-hc-orders-i-t-probe-on-udhayanidhi-assets","data":{"third_party_url":null,"title":{"text":"Court Orders Probe on Udhayanidhi Assets"},"img":{"url":"https://images.prismic.io/prad/5eb52f79-f1fb-4224-8660-30b6f9452808_udhanidhi+stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-04-15T08:13:00+0000"}}},{"node":{"uid":"lokesh-elevated-as-national-wp-of-tdp","data":{"third_party_url":null,"title":{"text":"Lokesh elevated as national WP of TDP"},"img":{"url":"https://images.prismic.io/prad/Z4vnQ5bqstJ99mOE_lokesh.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-15T07:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-tilly-square","tags":["politics"]}}