{"data":{"prismicReviewarticle":{"uid":"review-mr-bachchan","tags":["politics"],"first_publication_date":"2024-08-15T08:49:58+0000","last_publication_date":"2024-08-17T13:01:52+0000","data":{"title":{"text":"రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌' "},"rating":2,"datetime":"2024-08-15T08:10:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZnCMIJm069VX10YK_MrBachchan.JPG?auto=format%2Ccompress&rect=0%2C936%2C8192%2C4039&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=cGZiZTUY4po","thumbnail_url":"https://i.ytimg.com/vi/cGZiZTUY4po/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@TseriesTelugu","title":"Mr.Bachchan Trailer | Ravi Teja | Bhagyashri | Harish Shankar | TG Vishwa Prasad | T-Series"},"content":{"raw":[{"text":"రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ సూపర్‌ హిట్‌ మూవీ 'రైడ్' కి అధికారిక రీమేక్‌. భారతదేశ చరిత్రలో నిలిచి పోయే అతి పెద్ద ఐటీ రైడ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి కమర్షియల్‌ హంగులు అద్ది దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూ లో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"బచ్చన్‌(రవితేజ) నిజాయితీపరుడైన ఇన్‌కమ్‌ ట్యాక్స్ ఆఫీసర్‌. ఒక బడా వ్యాపారవేత్త ఇంట్లో రైడ్‌ చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు సీజ్‌ చేసిన బచ్చన్‌ ను ఉన్నతాధికారులు కొన్ని కారణాలు చూపించి సస్పెండ్ చేస్తారు. "},{"text":"ఆ తదుపరి పరిణామాల కారణంగా బచ్చన్‌ తన సొంత ఊరు వెళ్లి పోతాడు. అక్కడ స్నేహితులతో కలిసి కాలం గడుపుతూ ఉండగా జిక్కీ(భాగ్య శ్రీ) పరిచయం అవుతుంది. ఆమె తో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుంది. "},{"text":"ఆ సమయంలోనే తిరిగి ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ లో మళ్లీ చేరమంటూ బచ్చన్ కి పిలుపు వస్తుంది. అతి పెద్ద అవినీతి తిమింగళం అయిన జగ్గయ్య(జగపతిబాబు) ఇంట ఐటీ రైడ్‌ కి బచ్చన్‌ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకు జగ్గయ్య ఎవరు? ఆయన కోసమే బచ్చన్ ను తిరిగి ఎందుకు తీసుకు వచ్చారు? అనేది కథాంశం. "},{"text":"నటీనటుల నటన :"},{"text":"రవితేజ ఎప్పటిలాగే తన మాస్‌ నటనతో మెప్పించాడు. కామెడీ టైమింగ్ విషయంలో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అయితే ఆయన మొహం పై వయసు మీద పడ్డ లక్షణాలు క్లీయర్ గా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆయన హీరోయిన్ తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా అంతగా పండలేదు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మరియు రైడ్‌ సన్నివేశాల్లో రవితేజ నటన ఆకట్టుకుంది. "},{"text":"హీరోయిన్ భాగ్యశ్రీ గురించి మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతా ఆశించినట్లుగా, ఊహించినట్లుగా ఆమె అందంతో పాటు అభినయంతో మెప్పించింది. ఇంకాస్త ఎక్కువగా ఆమెకు స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. జగపతిబాబు తనదైన శైలిలో విలనిజం పండించడం లో సక్సెస్ అయ్యాడు. ఇతర నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించి పర్వాలేదు అనిపించారు. "},{"text":"టెక్నికల్‌ :"},{"text":"మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన పాటల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవి అన్ని కూడా బాబోయ్‌ ఇవేం పాటలు అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా పర్వాలేదు అన్నట్లుగానే ఉంది. కొన్ని రైడ్ సన్నివేశాల్లో బీజీఎం అద్భుతంగా చూపించే అవకాశం ఉంది. కానీ ఆయన అందులో విఫలం అయ్యాడు. "},{"text":"సినిమాటోగ్రఫీ కూడా సో సోగానే ఉంది. రవితేజ మరియు హీరోయిన్ ను పలు యాంగిల్స్ లో చూపించడం కే సినిమాటోగ్రపీ పని చేసినట్లుగా ఉంది. "},{"text":"దర్శకుడు హరీష్ శంకర్‌ స్క్రీన్‌ ప్లే విషయమై ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. "},{"text":"విశ్లేషణ : "},{"text":"హిందీ సూపర్‌ హిట్ మూవీ రైడ్ కి ఈ సినిమా అధికారిక రీమేక్ అంటూ గతంలోనే మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేస్తున్నాం అనే పేరుతో కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నాడు. అంతే తప్ప కథ మరియు కథనంలో మార్పులు మరియు చేర్పులు పెద్దగా ఏమీ లేవు. చేసిన మార్పుల వల్ల కూడా ఫలితం లేకుండా పోయింది. కొన్ని కామెడీ సన్నివేశాలు కథ కు సంబంధం లేకుండా ఉన్నాయి. నవ్వించడం కోసం మాత్రమే అన్నట్లుగా ఆ సన్నివేశాలు ఉన్నాయి. "},{"text":"హీరోగా రవితేజ గొప్ప నటుడు అంటూ ఎన్నో సార్లు అనిపించుకుంది. అయినా కూడా ఆయన్ను దర్శకుడు సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఎప్పటిలాగే మూస పద్దతిలో సినిమాలో ఆమెను చూపించడం జరిగింది. హడావుడిగా తీసిన ఈ సినిమా అదే స్థాయిలో ఉంది. కథ మరియు కథనం విషయంలో కాస్త శ్రద్ద వహించాల్సింది. రవితేజ ఇప్పటికే చాలా సినిమాలతో ఎలా అయితే తనలోని నటుడిని చూపించాడో అదే విధంగా ఈ సినిమాలో కూడా చూపించాడు. అంతే తప్ప కొత్తదనం లేదు. "},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"కొన్ని రైడ్‌ సీన్స్‌,"},{"text":"ఫస్ట్‌ హాఫ్‌"},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"సెకండ్‌ హాఫ్‌,"},{"text":"కథలో సీరియస్‌నెస్ లేదు,"},{"text":"పలు పాత్రలకు ప్రాముఖ్యత లేదు"},{"text":"చివరగా..."},{"text":"మిస్టర్ బచ్చన్‌ రైడ్‌ లో దొరికేది తక్కువే.."},{"text":"దర్శకుడు: హరీష్ శంకర్"},{"text":"నిర్మాత: టిజి విశ్వప్రసాద్"},{"text":"సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్"},{"text":"నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్స్, జగపతి బాబు , తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, చమ్మక్ చంద్ర , ప్రభాస్ శ్రీను తదితరులు "}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-mr-bachchan","tags":["politics"]}}