{"data":{"prismicReviewarticle":{"uid":"review-devara","tags":["politics"],"first_publication_date":"2024-09-27T05:15:19+0000","last_publication_date":"2024-09-29T11:32:14+0000","data":{"title":{"text":"రివ్యూ: దేవర"},"rating":2.75,"datetime":"2024-09-27T04:58:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZvY7SrVsGrYSwDu1_Devara.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=HNYA6bqL6bU","thumbnail_url":"https://i.ytimg.com/vi/HNYA6bqL6bU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@NTRARTSOFFICIAL","title":"Devara Release Trailer (Telugu) | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva | Anirudh | Sep 27"},"content":{"raw":[{"text":"జూ ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2018లో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత నాలుగేళ్లకు మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన యంగ్ టైగర్ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ‘దేవర’ సోలో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. RRR తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. హిందీ మార్కెట్లో కూడా జూనియర్ ఫ్యాన్ బేస్ పెరిగింది. "},{"text":"ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే స్టాండర్డ్స్ ఏ మాత్రం తగ్గకుండా అగ్రశేణి దర్శకుడు కొరటాల శివ సాలిడ్ కథతో తారక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. వాస్తవానికి కొరటాల శివ రాసుకున్న ‘దేవర’ కథ మొత్తం సినిమాగా తీయాలంటే 9 గంటల నిడివిగా వస్తుందట. దీన్ని ఒక్క సినిమాలో కుదించడం సాధ్యంకాక పోవడంతో రెండు పార్టులుగా తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే ఇపుడు విడుదలైన ‘దేవర-పార్ట్ 1’. ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి సమీక్షిద్దాం..."},{"text":"కథ: "},{"text":"ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులోని రత్నగిరి ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఉన్న కొండలపై ఉన్న నాలుగు గ్రామాల సమూహం ఎర్రసముద్రం. వీరి పూర్వీకులు ఒకప్పుడు కొండ అవతల ఉన్న రాజ్యాన్ని సముద్రం వైపు నుంచి జరిగే ఇతర రాజ్యాల దాడుల నుండి కాపాడే సైనికులుగా ఉండేవారు. రాజ్యాలు అంతరించి బ్రిటిష్ పాలనలోకి వెళ్లిన తర్వాత భారత దేశ సొత్తును దోచుకెళుతున్న ఆంగ్లేయుల నౌకలపై దాడి చేసి అందులోని సంపదను దోచుకుంటూ దొంగలుగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వారి వారసులు సముద్రం మీద ఆధారపడి నౌక దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామానికి నాయకుడు దేవర(ఎన్టీఆర్). మరో గ్రామానికి నాయకుడైన బైర (సైఫ్ అలీ ఖాన్) బలవంతుడే అయినప్పటికీ ఆయుధపూజ రోజు జరిగే పోటీలో దేవరను ఓడించడం అతడికి సాధ్యం కాదు. అందుకే ఎర్ర సముద్రంలో దేవర మాటే చెల్లుతుతుంది.  "},{"text":"ఎర్రసముద్రం వీరుల ధైర్య సాహసాలు, సముద్రానికి ఎదురెళ్లే వారి తెగువ ఉపయోగించుకుని మురుగన్ (మురళీశర్మ) లాంటి స్మగ్లర్స్ సముద్ర మార్గంలో నౌకల ద్వారా వచ్చే ఆయుధాలను కోస్ట్ గార్డ్ కంటపడకుండా తీరం దాటిస్తుంటారు. అయితే తాము చేస్తున్న పని తప్పు అని, దీని వల్ల సొంత ప్రజల చావుకు కారణం అవుతున్నామని, మన పూర్వీకులు చేసిన పనికి, మనం చేస్తున్న పనికి చాలా తేడా ఉందని గ్రహించిన దేవర... ఇలాంటి పనులు వదిలేసి చేపలు పట్టి జీవించాలని డిసైడ్ చేస్తాడు. అయితే భైర, ఇతర గ్రామాల నాయకులు ఇందుకు ఒప్పుకోరు. తన మాట కాదని ఎవరైన ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సముద్రం పైకి వెళ్లితే తనదైన స్టైల్ లో భయం అంటే ఏమిటో చూపిస్తూ వారిని కట్టడి చేస్తుంటాడు దేవర. "},{"text":"దీంతో దేవరను చంపాలని బైర, ఇతర గ్రామాల నాయకులు ఫిక్స్ అవుతారు... పెళ్లి వేడుకలో దేవరను చంపాలని ప్లాన్ చేస్తారు. అయితే దేవరను చంపడానికి వెళ్లిన వారంతా అతడి చేతిలో చనిపోతారు. ఈ సంఘటన తర్వాత దేవర కూడా అజ్ఞాతంలో ఉంటూ ఎవరూ తప్పుడు పనుల కోసం సముద్రం ఎక్కకుండా హెచ్చరిస్తూ భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సంవత్సరాలు గడిచినా దేవర తిరిగి రాడు....దేవర రాకకోసం ఎదురు చూస్తూ అతడి చంపడమే లక్ష్యంగా సైన్యాన్ని తయారు చేస్తాడు బైర. "},{"text":"అయితే దేవర కుమారుడు వర(ఎన్టీఆర్)... తండ్రి వ్యక్తిత్వానికి, వీరత్వానికి భిన్నంగా భయస్తుడిగా, పిరికివాడిగా ఉంటాడు. అజ్ఞాతంలో ఉన్న దేవరను చంపడానికి సముద్రంపైకి తన సైన్యాన్ని పంపిస్తాడు బైర... దేవర కొడుకు వరను కూడా అందులో భాగం చేస్తాడు? ఆ తర్వాత జరిగే  పరిణామాలు ఏమిటనేది తెరపై చూడాల్సిందే. "},{"text":"సినిమాఎలా ఉందంటే..."},{"text":"ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఎలాంటి సాలిడ్ సినిమా ఆశిస్తారో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ సినిమాను కొరటాల శివ దెరకెక్కించాడు. సింగప్ప(ప్రకాష్ రాజ్) ద్వారా ప్రేక్షకులకు దేవర కథను చెప్పించే విధానం ఆకట్టుకుంటుంది. "},{"text":"తొలి భాగం మొత్తం దేవర, బైర పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, నౌకల దొంగతనం, యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత.... దేవర కొడుకు వర(ఎన్టీఆర్) పాత్ర రంగ ప్రవేశం చేస్తుంది. వర, తంగ(జాన్వి కపూర్) మధ్య జరిగే రొమాంటిక్ సీక్వెన్స్... తర్వాత క్లైమాక్స్ లో బాహుబలి రేంజ్ ట్విస్ట్ ఇస్తూ.... మొదటి పార్ట్ ముగించాడు దర్శకుడు. మొదటి భాగం ఫర్వాలేదు కానీ, రెండో భాగంలో సాగదీత సన్నివేశాలు కొన్ని బోర్ కొట్టిస్తాయి. "},{"text":"ఎవరు ఎలా చేశారంటే..."},{"text":"ఎన్టీఆర్  మరోసారి తన అద్భుతమైన నటనతో, యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. అటు దేవర పాత్రలో, ఇటు వర పాత్రలో ఇమిడిపోయాడు. జాన్వి కపూర్ పాత్రకు పార్ట్ 1లో పెద్దగా ప్రాధాన్యం లేదు. "},{"text":"సైఫ్ అలీ ఖాన్ పాత్ర దేవర పాత్రకు సమవుజ్జీగా చూపించారు. దేవర పాత్రకు ధీటుగా బైర పాత్రను రూపొందించారు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. "},{"text":"దర్శకత్వం..."},{"text":"కొరటాల శివ దర్శకత్వంలో తనదైన ప్రత్యేకతను చూపించాడు. ముఖ్యంగా ఆయన రచయితగా కథను మలిచిన విధానం, తెరపై ఆవిష్కరించిన విధానం, డైలాగులు, భావోద్వేగాలు పండించిన తీరు మరోసారి ఆయన్ను టాప్ దర్శకుడిగా నిలబెట్టాయి. "},{"text":"కొరటాల సృష్టించిన ఎర్రసముద్రం ప్రాంతం, అందులోని పాత్రలు.... ప్రేక్షకులు కథలో లీనం అయ్యేలా చేస్తాయి. "},{"text":"ఇతర టెక్నికల్ అంశాలు..."},{"text":"రత్నవేలు సినిమాటోగ్రాఫీ సినిమాకు మరో రేంజిలో ప్రెజెంట్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ సినిమా స్థాయిని పెంచాయి. "},{"text":"అనిరుధ్ అందించిన సంగీతం బావుంది. యాక్షన్ సన్నివేశాలు చూపించిన తీరు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తాయి. "},{"text":"ప్లస్ పాయింట్స్:"},{"text":" -ఎన్టీఆర్ నటన"},{"text":"-సినిమాటోగ్రఫీ"},{"text":"-సంగీతం"},{"text":"-ఫస్టాఫ్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్"},{"text":"మైనస్ పాయింట్స్"},{"text":"-రెండో భాగంలో కొన్సి సాగదీత సన్నివేశాలు"},{"text":"చివరగా...."},{"text":"ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరిచే యాక్షన్ ఎంటర్టెనర్."},{"text":"డైరెక్టర్: కొరటాల శివ"},{"text":"నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్"},{"text":"సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్"},{"text":"సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు"},{"text":"నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు"}]}}},"relatedReviews":{"edges":[{"node":{"uid":"review-comrade-kalyan-","data":{"title":{"text":"Review: 'Comrade Kalyan' "},"img":{"url":"https://images.prismic.io/prad/bc2LuntcOi-ChERR_ck.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}},{"node":{"uid":"review-dont-trouble-the-trouble","data":{"title":{"text":"Review: ‘Don’t Trouble the Trouble’"},"img":{"url":"https://images.prismic.io/prad/bqNucWhmNWKKQiVy_DTTT.JPG?auto=format,compress"},"rating":1.75}}},{"node":{"uid":"review-the-paradise","data":{"title":{"text":"Review: 'The Paradise'"},"img":{"url":"https://images.prismic.io/prad/gykUOtmdxL0XVM2y_TheParadise.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.25}}},{"node":{"uid":"review-epic","data":{"title":{"text":"Review: 'Epic'"},"img":{"url":"https://images.prismic.io/prad/i5tpcCyZXxZGstkc_EPICreview.jpg?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}}]},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ysrcp-every-seat-must-see-a-fight","data":{"third_party_url":null,"title":{"text":"YSRCP: Every Seat Must See a Fight"},"img":{"url":"https://images.prismic.io/prad/Gk_IYoGJA83EfjZs_jagan.JPG?auto=format%2Ccompress&rect=0%2C22%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-14T14:47:00+0000"}}},{"node":{"uid":"ed-seizes-reliance-power-assets-worth-2032-cr","data":{"third_party_url":null,"title":{"text":"ED seizes Reliance Power assets worth 2,032 cr"},"img":{"url":"https://images.prismic.io/prad/aIz4r6Tt2nPbZrgR_anilambani.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T12:45:00+0000"}}},{"node":{"uid":"ed-attaches-129-cr-in-ttd-ghee-case","data":{"third_party_url":null,"title":{"text":"ED Attaches 129 Cr in TTD Ghee Case"},"img":{"url":"https://images.prismic.io/prad/ZuxhHbVsGrYSvmU3_tirumalaladdu.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T15:42:00+0000"}}},{"node":{"uid":"trump-promises-5k-if-gop-wins","data":{"third_party_url":null,"title":{"text":"Trump Promises $5K if GOP Wins"},"img":{"url":"https://images.prismic.io/prad%2F297f16fa-5103-4b35-813b-76f5f9ba4215_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C13%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-14T03:29:00+0000"}}},{"node":{"uid":"mp-avinash-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"MP Avinash Reddy appears before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/7c2a5caa-1f8e-40d0-b5ff-c3a80775b6a7_avinash+reddy.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T07:30:00+0000"}}},{"node":{"uid":"andhra-nda-haggles-over-local-poll-seats","data":{"third_party_url":null,"title":{"text":"Andhra NDA Haggles Over Local Poll Seats"},"img":{"url":"https://images.prismic.io/prad/Lx247yLX8ZRXWkFC_apndapartners.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:30:00+0000"}}},{"node":{"uid":"rahul-casts-for-protest-battle","data":{"third_party_url":null,"title":{"text":"Rahul Casts for Protest Battle!"},"img":{"url":"https://images.prismic.io/prad/zYKLUmbsWJagQskr_rahulprotest.JPG?auto=format%2Ccompress&rect=0%2C32%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:15:00+0000"}}},{"node":{"uid":"democratic-house-would-test-trumps-india-agenda","data":{"third_party_url":null,"title":{"text":"Democratic House would test Trump’s India agenda"},"img":{"url":"https://images.prismic.io/prad/15m8SwaCDnQQJ7yn_USwashington.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T05:55:00+0000"}}},{"node":{"uid":"tirupati-eyes-global-glory","data":{"third_party_url":null,"title":{"text":"Tirupati Eyes Global Glory"},"img":{"url":"https://images.prismic.io/prad%2F754a7b33-759c-4ae5-bc2b-ef7d792c592f_tirupati.jpg?auto=format%2Ccompress&rect=0%2C207%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-12T18:39:00+0000"}}},{"node":{"uid":"viveka-case-bhaskar-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"Viveka Case: Bhaskar Reddy Appears Before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/c8ea4321-db22-4d42-871c-556bf38ae249_YS+Bhaskar+Reddy.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-13T08:00:00+0000"}}},{"node":{"uid":"andhra-ias-officer-booked-for-pub-slap","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Booked for Pub Slap"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C116%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-13T07:15:00+0000"}}},{"node":{"uid":"4-burnt-alive-as-car-catches-fire-in-vijayawada","data":{"third_party_url":null,"title":{"text":"4 burnt alive as car catches fire in Vijayawada"},"img":{"url":"https://images.prismic.io/prad/aSQZ82GnmrmGqKTy_carcharred.JPG?auto=format,compress"},"datetime":"2026-10-12T15:49:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-devara","tags":["politics"]}}