{"data":{"prismicReviewarticle":{"uid":"game-changer-review...routine-politicle-drama","tags":["politics"],"first_publication_date":"2025-01-10T04:04:18+0000","last_publication_date":"2025-01-12T08:23:34+0000","data":{"title":{"text":"'గేమ్‌ ఛేంజర్‌' రివ్యూ... రొటీన్ పొలిటికల్‌ డ్రామా"},"rating":2,"datetime":"2025-01-11T03:23:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/Zy-b3K8jQArT0qCn_GAMECHANGER.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=zHiKFSBO_JE","thumbnail_url":"https://i.ytimg.com/vi/zHiKFSBO_JE/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@dilraju","title":"Game Changer Trailer (Telugu) | Ram Charan | Kiara Advani | Shankar | Thaman S | Dil Raju | Shirish"},"content":{"raw":[{"text":"రామ్‌ చరణ్‌ సోలో హీరోగా వచ్చి దాదాపు నాలుగు ఏళ్లు అవుతోంది. దాంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగాయి. అయితే శంకర్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో మొదట్లో కాస్త అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నిర్మాత దిల్ రాజు తనదైన ప్రమోషనల్ స్టంట్స్‌తో సినిమాకు హైప్ క్రియేట్‌ చేయడంలో సక్సెస్ అయ్యారు. విడుదలకు రెండు మూడు వారాల ముందు చేసిన ప్రచారంతో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అంతే కాకుండా సినిమా టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉందా అనేది రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"ఐఏఎస్‌ రామ్ నందన్‌ (రామ్‌ చరణ్‌) మొదటి పోస్టింగ్‌తోనే విశాఖకి కలెక్టర్‌గా నియమించబడుతాడు. ఆ సమయంలోనే మంత్రి మోపిదేవి(ఎస్‌ జే సూర్య) అక్రమాలకు అడ్డు పడతాడు. ఇద్దరి మధ్య గొడవ ముదురుతుంది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి(శ్రీకాంత్‌) మృతి చెందుతాడు. దాంతో తానే ముఖ్యమంత్రిని అంటూ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న మోపిదేవికి షాక్‌ ఇస్తూ చనిపోయిన ముఖ్యమంత్రి వీడియో చివరి కోరిక వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియోలో రామ్ నందన్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు మోపిదేవి ఏం చేస్తాడు? ఇంతకు రామ్ నందన్‌ని సీఎంగా ఎందుకు చేయాలని చనిపోయిన ముఖ్యమంత్రి అనుకుంటాడు? రామ్‌ నందన్‌కి అప్పన్నతో సంబందం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే."},{"text":"నటీనటుల నటన : "},{"text":"రామ్ చరణ్ రెండు పాత్రల్లోనూ మంచి నటనతో మెప్పించాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ లుక్‌తో పాటు యాక్టింగ్ ఆకట్టుకుంది. నత్తి వాడిగా చరణ్‌ చక్కగా నటించాడు. అప్పన్న పాత్ర పరిధి ఇంకాస్త ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక రామ్‌ నందన్ పాత్రలోనూ చరణ్ ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్‌ ఆఫీసర్‌గా రామ్‌ చరణ్ లుక్‌ పరంగానూ మెప్పించాడు. డాన్స్‌లతో మరోసారి రామ్ చరణ్‌ తనదైన శైలిలో మెప్పించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో సత్తా చాటాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో చరణ్‌ నటన హైలైట్‌గా నిలిచింది. "},{"text":"అంజలి నటన ఆకట్టుకుంది. ఓల్డ్‌ ఏజ్ గెటప్‌తో పాటు యంగ్‌ ఏజ్ పాత్రలో ఆమె నటనతో వావ్ అనిపించింది. సినిమాలో అత్యంత కీలక మలుపులు అంజలి పాత్రపైనే ఉంటాయి. అందుకే ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాంటి పాత్రలో అంజలి చక్కని నటనతో మెప్పించింది. హీరోయిన్‌ కియారా అద్వానీకి పెద్దగా స్కోప్‌ లేదు. పాటలకే పరిమితం అయ్యింది. ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన పెద్దగా ఫలితం కనిపించలేదు. విలన్‌గా నటించిన ఎస్‌ జే సూర్య ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఆయన మ్యానరిజంతో విలనిజంను పండించి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. "},{"text":"సునీల్‌ కామెడీ అంతంత మాత్రంగానే అనిపించింది, బ్రహ్మానందం ఒక్క సన్నివేశంలో కనిపించి వెళ్లి పోయారు. ఆయన నవ్వించలేక పోయారు. సముద్ర ఖని పాత్రకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఆయన ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించారు. కానీ ఏ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు శంకర్‌ మరోసారి పేలవమైన స్క్రీన్‌ ప్లేతో నిరాశ పరిచారు. కార్తీక్‌ సుబ్బరాజ్ మంచి స్టోరీ లైన్‌ను అందించినా దాన్ని పూర్తి స్థాయి పవర్‌ మూవీగా మల్చడంలో దర్శకుడు శంకర్ సక్సెస్‌ కాలేక పోయారు అనిపించింది. ఆయన పరమ రొటీన్ మేకింగ్‌ మెప్పించలేక పోయింది. ప్రతి సన్నివేశం ముందే ఊహించే విధంగా ఉంది. కథలోని ట్విస్ట్‌లను ఆయన ఇంకాస్త ఆసక్తికరంగా చూపించి ఉండాల్సింది. సంగీత దర్శకుడు తమన్‌ పర్వాలేదు అనిపించాడు. పాటలు ఒకటి రెండు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ బాగుంది. కొన్ని చోట్ల సన్నివేశాలను మరింత హైలైట్ చేసే విధంగా బీజీఎం పని చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. సినిమా అతుకుల బొంత మాదిరిగా ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి."},{"text":"విశ్లేషణ : "},{"text":"శంకర్‌ నుంచి ఆయన వింటేజ్ సినిమాలు ఆశించిన వారికి నిరాశ తప్పదు. కథ ఎక్కడో మొదలు అయ్యి ఎక్కడికో వెళ్తుంది. ప్రియురాలి కోసం ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌గా మారిన రామ్ నందన్ ను దర్శకుడు శంకర్ తీసుకు వెళ్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. కేవలం ప్రేమ కోసం హీరో ఐఏఎస్‌ అయ్యాడని చూపించాడు. కథలో పట్టు లేదు. పలు సన్నివేశాలు పరమ రొటీన్‌గా ఉన్నాయి. పవర్ కోసం ప్రాకులాడే పొలిటీషన్‌, అధికారం చూపించే హీరోల కథలు ఎన్నో చూశాం. ఇందులో కొత్తగా దర్శకుడు చూపించింది ఏమీ లేదు. చాలా సినిమాల్లోని సన్నివేశాలు, స్క్రీన్‌ ప్లేను తీసుకు వచ్చి గేమ్‌ ఛేంజర్‌ను రూపొందించినట్లు అనిపించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయగలదా అంటే డౌటే. ప్రేక్షకులు ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌ని ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటారా అనేది చూడాలి. "},{"text":"ప్లస్ పాయింట్స్ : "},{"text":"రామ్‌ చరణ్ నటన,"},{"text":"పాటలు, "},{"text":"ఎస్‌జే సూర్య."},{"text":"మైనస్ పాయింట్స్ : "},{"text":"కథ, స్క్రీన్‌ ప్లే,"},{"text":"ఎడిటింగ్‌,"},{"text":"క్లైమాక్స్‌,"},{"text":"కామెడీ"},{"text":"చివరగా..."},{"text":"గేమ్‌ ఛేంజర్‌ రొటీన్ పొలిటికల్‌ డ్రామా. దర్శక దిగ్గజం గేమ్‌ ఓవర్‌."},{"text":"బ్యానర్ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌"},{"text":"నిర్మాత : దిల్‌ రాజు"},{"text":"దర్శకత్వం : శంకర్‌"},{"text":"సంగీతం : తమన్‌"},{"text":"తారాగణం : రామ్‌ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, సముద్రఖని, సునీల్‌, బ్రహ్మానందం, నవీన్‌చంద్ర, నరేష్‌"}]}}},"relatedReviews":{"edges":[{"node":{"uid":"review-jailer-2","data":{"title":{"text":"Review: 'Jailer 2'"},"img":{"url":"https://images.prismic.io/prad/0n9tOk56ONaoGrW-_jailer2.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.5}}},{"node":{"uid":"review-comrade-kalyan-","data":{"title":{"text":"Review: 'Comrade Kalyan' "},"img":{"url":"https://images.prismic.io/prad/bc2LuntcOi-ChERR_ck.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}},{"node":{"uid":"review-dont-trouble-the-trouble","data":{"title":{"text":"Review: ‘Don’t Trouble the Trouble’"},"img":{"url":"https://images.prismic.io/prad/bqNucWhmNWKKQiVy_DTTT.JPG?auto=format,compress"},"rating":1.75}}},{"node":{"uid":"review-the-paradise","data":{"title":{"text":"Review: 'The Paradise'"},"img":{"url":"https://images.prismic.io/prad/gykUOtmdxL0XVM2y_TheParadise.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.25}}}]},"relatedArticles":{"edges":[{"node":{"uid":"andhra-ias-officer-shunted-after-pub-brawl","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Shunted After Pub Brawl"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C102%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-15T05:18:00+0000"}}},{"node":{"uid":"ed-seizes-reliance-power-assets-worth-2032-cr","data":{"third_party_url":null,"title":{"text":"ED seizes Reliance Power assets worth 2,032 cr"},"img":{"url":"https://images.prismic.io/prad/aIz4r6Tt2nPbZrgR_anilambani.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T12:45:00+0000"}}},{"node":{"uid":"ysrcp-every-seat-must-see-a-fight","data":{"third_party_url":null,"title":{"text":"YSRCP: Every Seat Must See a Fight"},"img":{"url":"https://images.prismic.io/prad/Gk_IYoGJA83EfjZs_jagan.JPG?auto=format%2Ccompress&rect=0%2C22%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-14T14:47:00+0000"}}},{"node":{"uid":"ed-attaches-129-cr-in-ttd-ghee-case","data":{"third_party_url":null,"title":{"text":"ED Attaches 129 Cr in TTD Ghee Case"},"img":{"url":"https://images.prismic.io/prad/ZuxhHbVsGrYSvmU3_tirumalaladdu.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T15:42:00+0000"}}},{"node":{"uid":"mp-avinash-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"MP Avinash Reddy appears before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/7c2a5caa-1f8e-40d0-b5ff-c3a80775b6a7_avinash+reddy.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T07:30:00+0000"}}},{"node":{"uid":"trump-promises-5k-if-gop-wins","data":{"third_party_url":null,"title":{"text":"Trump Promises $5K if GOP Wins"},"img":{"url":"https://images.prismic.io/prad%2F297f16fa-5103-4b35-813b-76f5f9ba4215_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C13%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-14T03:29:00+0000"}}},{"node":{"uid":"rahul-casts-for-protest-battle","data":{"third_party_url":null,"title":{"text":"Rahul Casts for Protest Battle!"},"img":{"url":"https://images.prismic.io/prad/zYKLUmbsWJagQskr_rahulprotest.JPG?auto=format%2Ccompress&rect=0%2C32%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:15:00+0000"}}},{"node":{"uid":"andhra-nda-haggles-over-local-poll-seats","data":{"third_party_url":null,"title":{"text":"Andhra NDA Haggles Over Local Poll Seats"},"img":{"url":"https://images.prismic.io/prad/Lx247yLX8ZRXWkFC_apndapartners.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:30:00+0000"}}},{"node":{"uid":"democratic-house-would-test-trumps-india-agenda","data":{"third_party_url":null,"title":{"text":"Democratic House would test Trump’s India agenda"},"img":{"url":"https://images.prismic.io/prad/15m8SwaCDnQQJ7yn_USwashington.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T05:55:00+0000"}}},{"node":{"uid":"tirupati-eyes-global-glory","data":{"third_party_url":null,"title":{"text":"Tirupati Eyes Global Glory"},"img":{"url":"https://images.prismic.io/prad%2F754a7b33-759c-4ae5-bc2b-ef7d792c592f_tirupati.jpg?auto=format%2Ccompress&rect=0%2C207%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-12T18:39:00+0000"}}},{"node":{"uid":"viveka-case-bhaskar-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"Viveka Case: Bhaskar Reddy Appears Before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/c8ea4321-db22-4d42-871c-556bf38ae249_YS+Bhaskar+Reddy.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-13T08:00:00+0000"}}},{"node":{"uid":"andhra-ias-officer-booked-for-pub-slap","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Booked for Pub Slap"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C116%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-13T07:15:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"game-changer-review...routine-politicle-drama","tags":["politics"]}}