{"data":{"prismicReviewarticle":{"uid":"review-kalki-2898-ad-","tags":["politics"],"first_publication_date":"2024-06-27T06:07:57+0000","last_publication_date":"2024-06-28T12:35:29+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘కల్కి 2898 AD’"},"rating":3.5,"datetime":"2024-06-27T05:15:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/Znz7NZbWFbowe7kR_kalki.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C2028%2C1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=-rTzyZZGJ84","thumbnail_url":"https://i.ytimg.com/vi/-rTzyZZGJ84/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@VyjayanthiNetwork","title":"Kalki 2898 AD Release Trailer - Telugu | Prabhas | Amitabh | Kamal Haasan | Deepika | Nag Ashwin"},"content":{"raw":[{"text":"ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు... పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. ఈ చిత్ర కథ ఇప్పటి వరకు భారత దేశ సినీ చరిత్రలో వచ్చిన సినిమాలన్నింటి కంటే భిన్నమైన కథ. హిందూ పురాణాలు, సైన్స్ ఫిక్సన్ అంశాలు కలగలిపి దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుత కథ వస్తువు మాత్రమే కాదు... హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విజువల్ వండర్ గా ఈ చిత్రం ఉంటుందని చెబుతూ వస్తున్న ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ: "},{"text":"శంబాలా, కాశీ, కాంప్లెక్స్ అనే మూడు భిన్నమైన ప్రపంచాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ భూమి మీద ఉన్న నగరాలు అన్నీ నాశనమైన తర్వాత మిగిలిన చివరి నగరం కాశీ. ఇక్కడి మనుషులంతా స్వచ్ఛమైన గాలితో పాటు నీరు, ఆహారం సమృద్ధిగా దొరికే కాంప్లెక్స్ కు వెళ్లాలని ఆశ పడుతుంటారు. అయితే ఇక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. 1 మిలియన్ యూనిట్లు చెల్లిస్తే అక్కడికి వెళ్లడానికి వీలవుతుంది. దీన్ని సంపాదించడానికి బౌంటీ హంటర్స్ కాంప్లెక్స్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలాగైన 1 మిలియన్ సంపాదించి కాంప్లెక్స్ లోకి అడుగు పెట్టాలనే ఆశ పడే బౌంటి హంటర్లలో ఒకడే భైరవ(ప్రభాస్). భైరవ అందరి కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ఓటమి ఎరుగని కార్డు అతడిది. "},{"text":"నేనే దేవుడిని అని చెప్పుకునే సుప్రీం యాక్షిన్(కమల్ హాసన్) కనుసన్నలో కాంప్లెక్స్ అనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్  భూమిపై మిగిలిన అన్ని వనరులను తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్ది సుప్రీం యాక్షిన్ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తిరిగి శక్తి పొంది, యవ్వన వంతుడు కావడానికి ఒక శక్తివంతమైన సీరం అవసరం. ఇందుకోసం మహిళలకు ఆర్టిఫిషియల్ గా గర్భవతులను చేసి తనకు కావాల్సిన సీరం తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అతడి ప్రయత్నాలు ఫలించాలంటే సుప్రీం యాక్షిన్ రూపొందించిన ఫార్ములా 150 రోజులు గర్భంలో మోయగలిగే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది."},{"text":"ఎస్ యూ ఎం 8 టి అనే కోడ్ కలిగిన అమ్మాయి (దీపిక పదుకోన్) గర్భం లో సుప్రీం యాక్షిన్ కు కావాల్సిన సీరం ఉంటుంది. ఆమె నుంచి సీరం తీసే లోపు ఆమెను శంబాలాకు చెందిన వ్యక్తులు అక్కడి నుంచి తప్పిస్తారు. ఆమెను పట్టుకుంటే 5 మిలియన్ యూనిట్ల బౌంటి ప్రకటిస్తుంది కాంప్లెక్స్. దీంతో భైరవ రంగంలోకి దిగుతాడు. ఆమెను పట్టుకుని కాంపెక్స్ లో అడుగు పెట్టాలని బయల్దేరుతాడు. "},{"text":"అయితే దీపిక పదుకోన్ కడుపులో ఉన్న బిడ్డను కాపాడే బాధ్యత అశ్వథామ(అమితాబ్ బచ్చన్) మీద ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి శాపం కారణంగా ఆ శిశువు జననం కోసం దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వథామ. అసలు ద్వారప యుగానికి, ఈ కథకు సంబంధం ఏమిటి? అసలు భైవర ఎవరు? బైరవ నుంచి దీపికను కాపడటానికి అశ్వథామ ఏం చేశాడు? శంబాలా ప్రపంచం వెనక ఉన్న కథ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే. "},{"text":"ఎవరు ఎలా చేశారంటే.."},{"text":"భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడు. ప్రభాస్ లుక్ కానీ, అతడి పాత్రను డిజైన్ చేసిన విధానం ప్రేక్షుకులను మెప్పిస్తుంది. పార్ట్ 1 గా వచ్చిన ఈ సినిమాకు హైలెట్ అంటే అశ్వథామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. దీపిక పదుకొనే పాత్ర కీలకం అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ లేని పాత్ర. అయితే ఆమె స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్. శంబాలా ప్రపంచానికి చెందిన మరియమ్మ పాత్రలో నటి భోశన పాత్ర ఆకట్టుకునే విధంగం ఉంది. విలన్ పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించే అవకాశం పార్ట్ 1లో లేదు. కేవలం ఆదేశాలు ఇచ్చే వరకే పరిమితం అయ్యాడు. తర్వాతి పార్టులో కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించబోతున్నాడని సినిమా చివర్లో హింట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇతర పాత్రలు వారి పరిధి మేరకు ఓకే అనిపించాయి. "},{"text":"విశ్లేషణ...."},{"text":"ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసి పోని విజువల్ వండర్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్టు ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో రాలేదు. భారత పురణాల్లోని మహాభారతాన్ని లింక్ చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ రాసిన ఈ కథ అత్భుతంగా చెప్పుకోవచ్చు. తన కథకు తగిన విధంగా విజువల్ ఎఫెక్ట్స్ రాబట్టు కోవడంలో, ఇండియన్ మైథాలజీ కథతో హాలీవుడ్ సినిమా చూసిన అనుభవం ప్రేక్షకులకు కల్పించడంలో నాగ్ అశ్వన్ సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు తర్వాత పార్టుపై అంచనాలు మరింత పెంచింది. మధ్యలో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవర కొండ లాంటి సినిమా స్టార్లు అతిథి పాత్రల్లో మెరిసి వెళ్లిపోతుండటం ప్రేక్షకుల్లో జోష్ పెంచుతుంది."},{"text":"టెక్నికల్ అంశాలు...."},{"text":"సినిమాలో చెప్పుకోదగ్గ అంశంగా విజువల్ ఎఫెక్ట్స్ ను చెప్పుకోవచ్చు.  సినిమాలోని నేపథ్య సంగీతం... కథను నడిపించిన తీరు, స్క్రీన్ ప్లే ఇలా  ప్రతి విషయంలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్.... ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి తర్వాత తీసిన మూడో చిత్రం. ఈసినిమా చూస్తే నాగ్ అశ్విన్ టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా ప్రమోషన్లలో అమితాబ్ బచ్చన్ చెప్పినట్లు నాగ్ అశ్విన్ కథ రాసేటపుడు ఏం తింటాడో అనే మాటలో అతిశయోక్తి లేదు అనిపిస్తుంది. "},{"text":"బలాలు: "},{"text":"నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కథ"},{"text":"ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాత్రలు డిజైన్ చేసిన విధానం"},{"text":"ద్వాపర యుగానికి లింక్ చేస్తూ నడిపించిన స్క్రీన్ ప్లే"},{"text":"హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్"},{"text":"మైనస్ పాయింట్స్: "},{"text":"ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు"},{"text":"ఫైనల్ గా....."},{"text":"‘కల్కి 2898 AD’  మన సినిమా కెపాసిటీ ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పే ఇండియన్ మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్."},{"text":"దర్శకుడు: నాగ్ అశ్విన్"},{"text":"నిర్మాతలు: అశ్వనీ దత్"},{"text":"సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్"},{"text":"సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్"},{"text":"నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నా బెన్ తదితరులు"}]}}},"relatedReviews":{"edges":[{"node":{"uid":"review-comrade-kalyan-","data":{"title":{"text":"Review: 'Comrade Kalyan' "},"img":{"url":"https://images.prismic.io/prad/bc2LuntcOi-ChERR_ck.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}},{"node":{"uid":"review-dont-trouble-the-trouble","data":{"title":{"text":"Review: ‘Don’t Trouble the Trouble’"},"img":{"url":"https://images.prismic.io/prad/bqNucWhmNWKKQiVy_DTTT.JPG?auto=format,compress"},"rating":1.75}}},{"node":{"uid":"review-the-paradise","data":{"title":{"text":"Review: 'The Paradise'"},"img":{"url":"https://images.prismic.io/prad/gykUOtmdxL0XVM2y_TheParadise.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.25}}},{"node":{"uid":"review-epic","data":{"title":{"text":"Review: 'Epic'"},"img":{"url":"https://images.prismic.io/prad/i5tpcCyZXxZGstkc_EPICreview.jpg?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}}]},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ysrcp-every-seat-must-see-a-fight","data":{"third_party_url":null,"title":{"text":"YSRCP: Every Seat Must See a Fight"},"img":{"url":"https://images.prismic.io/prad/Gk_IYoGJA83EfjZs_jagan.JPG?auto=format%2Ccompress&rect=0%2C22%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-14T14:47:00+0000"}}},{"node":{"uid":"ed-seizes-reliance-power-assets-worth-2032-cr","data":{"third_party_url":null,"title":{"text":"ED seizes Reliance Power assets worth 2,032 cr"},"img":{"url":"https://images.prismic.io/prad/aIz4r6Tt2nPbZrgR_anilambani.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T12:45:00+0000"}}},{"node":{"uid":"ed-attaches-129-cr-in-ttd-ghee-case","data":{"third_party_url":null,"title":{"text":"ED Attaches 129 Cr in TTD Ghee Case"},"img":{"url":"https://images.prismic.io/prad/ZuxhHbVsGrYSvmU3_tirumalaladdu.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T15:42:00+0000"}}},{"node":{"uid":"trump-promises-5k-if-gop-wins","data":{"third_party_url":null,"title":{"text":"Trump Promises $5K if GOP Wins"},"img":{"url":"https://images.prismic.io/prad%2F297f16fa-5103-4b35-813b-76f5f9ba4215_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C13%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-14T03:29:00+0000"}}},{"node":{"uid":"mp-avinash-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"MP Avinash Reddy appears before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/7c2a5caa-1f8e-40d0-b5ff-c3a80775b6a7_avinash+reddy.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T07:30:00+0000"}}},{"node":{"uid":"andhra-nda-haggles-over-local-poll-seats","data":{"third_party_url":null,"title":{"text":"Andhra NDA Haggles Over Local Poll Seats"},"img":{"url":"https://images.prismic.io/prad/Lx247yLX8ZRXWkFC_apndapartners.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:30:00+0000"}}},{"node":{"uid":"rahul-casts-for-protest-battle","data":{"third_party_url":null,"title":{"text":"Rahul Casts for Protest Battle!"},"img":{"url":"https://images.prismic.io/prad/zYKLUmbsWJagQskr_rahulprotest.JPG?auto=format%2Ccompress&rect=0%2C32%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:15:00+0000"}}},{"node":{"uid":"democratic-house-would-test-trumps-india-agenda","data":{"third_party_url":null,"title":{"text":"Democratic House would test Trump’s India agenda"},"img":{"url":"https://images.prismic.io/prad/15m8SwaCDnQQJ7yn_USwashington.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T05:55:00+0000"}}},{"node":{"uid":"tirupati-eyes-global-glory","data":{"third_party_url":null,"title":{"text":"Tirupati Eyes Global Glory"},"img":{"url":"https://images.prismic.io/prad%2F754a7b33-759c-4ae5-bc2b-ef7d792c592f_tirupati.jpg?auto=format%2Ccompress&rect=0%2C207%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-12T18:39:00+0000"}}},{"node":{"uid":"viveka-case-bhaskar-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"Viveka Case: Bhaskar Reddy Appears Before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/c8ea4321-db22-4d42-871c-556bf38ae249_YS+Bhaskar+Reddy.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-13T08:00:00+0000"}}},{"node":{"uid":"andhra-ias-officer-booked-for-pub-slap","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Booked for Pub Slap"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C116%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-13T07:15:00+0000"}}},{"node":{"uid":"4-burnt-alive-as-car-catches-fire-in-vijayawada","data":{"third_party_url":null,"title":{"text":"4 burnt alive as car catches fire in Vijayawada"},"img":{"url":"https://images.prismic.io/prad/aSQZ82GnmrmGqKTy_carcharred.JPG?auto=format,compress"},"datetime":"2026-10-12T15:49:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-kalki-2898-ad-","tags":["politics"]}}