{"data":{"prismicReviewarticle":{"uid":"review-hari-hara-veeramallu---no-avtion--no-vfx-","tags":["politics"],"first_publication_date":"2025-07-24T06:14:56+0000","last_publication_date":"2025-07-25T07:54:11+0000","data":{"title":{"text":"'హరి హర వీరమల్లు' రివ్యూ... ఆకట్టుకోని వీఎఫ్‌ఎక్స్‌, యాక్షన్‌"},"rating":2.25,"datetime":"2025-07-24T04:01:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aIHMSFGsbswqTMwa_HHVM.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=Qv-NEQJehVU","thumbnail_url":"https://i.ytimg.com/vi/Qv-NEQJehVU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@MegaSuryaProductions","title":"#HariHaraVeeraMallu - Trailer (Telugu) | PSPK | Nidhhi | MM Keeravaani | AM Rathnam | Jyothi Krisna"},"content":{"raw":[{"text":"పవన్‌ కళ్యాణ్‌, క్రిష్ కాంబోలో దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొంది. మొదట కరోనా, ఆ తర్వాత దర్శకుడు మారడం, పవన్ రాజకీయాలు ఇలా చాలా చాలా కారణాల వల్ల సినిమాల ఆలస్యం అవుతూ వచ్చింది. ఐదారు సార్లు విడుదల తేదీని మార్చారు. సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేశారు. "},{"text":"మొదటి నుంచి సినిమాపై అనుమానాలు ఉన్నాయి. విడుదల సమయంలో పవన్ కళ్యాణ్‌ హడావిడి చేయడం వల్ల భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. పవన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్‌కి హాజరు అయ్యాడు. మరి ఈ సినిమా ఆ స్థాయిలో ఉందా? పవన్‌ చెప్పిన రేంజ్‌లో సినిమా ఆకట్టుకుందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ : "},{"text":"మొగలుల పరిపాలన సాగుతున్న సమయంలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. హిందూ ధర్మం పాటించాలన్నా ప్రత్యేకమైన పన్ను వేసిన రోజుల్లో అత్యంత క్రూరుడు అయిన ఔరంగజేబుతో వజ్రాల దొంగగా పేరున్న వీరమల్లు ఎలా పోరాటం చేశాడు అనేది ఈ సినిమా కథ. ఒక వైపు భారతీయులను, హిందూ ధర్మంను కాపాడుకోవడంతో పాటు, కృష్ణ నది పరివాహక ప్రాంతంలో దొరికిన కోహినూర్‌ వజ్రంను ఔరంగజేబు నుంచి ఎలా వీరమల్లు దొంగిలించాడు అనేది సినిమాలో చూపించారు. "},{"text":"వీరమల్లు ఎవరు? అతడు దొంగగా ఎందుకు మారాడు? కోహినూర్‌ ఎక్కడ నుంచి ఎక్కడకు చేరింది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. మొత్తంగా కథ హిందుత్వం, కోహినూర్‌ వజ్రం చుట్టూ వీరమల్లును తిప్పుతూ సాగింది. "},{"text":"నటీనటుల నటన :"},{"text":"పవన్‌ కళ్యాణ్‌ యాక్టింగ్‌కి వంక పెట్టడానికి లేదు. అయితే యాక్షన్ సన్నివేశాలు ఇంకాస్త బెటర్‌గా ఉండి ఉంటే బాగుండేది. పవన్‌ కళ్యాణ్‌ పాటల్లోనూ ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది అనిపిస్తుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఉన్నంత ఉత్సాహంగా కనిపించలేదు. పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ పరంగా బాగుంది. సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌ను ఇష్టపడే వారికి నిరాశను మిగిల్చాడు. హీరోయిన్‌తో ఉండే సీన్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. మొత్తంగా పవన్ సర్‌ బిజీగా ఉండటం వల్ల ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోవడం వల్ల సన్నివేశాలను అలా అలా డొలిపినట్లుగా అనిపించింది. "},{"text":"హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ప్రమోషన్స్‌లో కనిపించినంతగా సినిమాలో కనిపించలేదు. ఉన్నంతలో కాస్త పర్వాలేదు. కానీ ఆమెకు ఇంకాస్త స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంటే బాగుండేది. ఔరంగజేబు పాత్రలో నటించిన బాబీ డియోల్‌ ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రకు కూడా స్క్రీన్‌ టైం తక్కువగానే ఉంది. ఆయన పాత్రను ఇంకాస్త బెటర్‌గా చూపించి ఉండవచ్చు. క్రూరమైన ఔరంగజేబు పాత్రకు ఖచ్చితంగా బాబీ డియోల్‌ న్యాయం చేశాడని చెప్పాలి. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో పర్వాలేదు అనిపించారు. "},{"text":"సాంకేతిక పరిజ్ఞానం :"},{"text":"సినిమాలో సాంకేతిక లోపం క్లీయర్‌గా కనిపిస్తుంది. ఒక్క సంగీతం విషయంలో తప్ప మరే విషయంలోనూ క్వాలిటీ కనిపించలేదు. పాటలు ఓకే అనిపించినా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. సీన్స్ లో మ్యాటర్‌ లేకున్నా కూడా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో కీరవాణి మెప్పించారు. ఆయన సంగీతంతో మరోసారి ఆకట్టుకున్నారు. అంతే కాకుండా ఆయన క్లైమాక్స్ సీన్స్ కి ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరి పోయింది. "},{"text":"సినిమాటోగ్రఫీ పూర్ గా ఉంది. దర్శకత్వం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్క్రీన్‌ ప్లే పరమ రొటీన్‌గా ఉంది. ఎడిటింగ్‌ లో జర్క్‌ లు చాలా ఉన్నాయి. చాలా సీన్స్ ప్లేస్‌మెంట్‌ సరిగా లేవు, కొన్ని సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు. వీఎఫ్‌ఎక్స్ గురించి మాట్లాడుకోవడం కంటే ఊరికే ఉండటం ఉత్తమం. "},{"text":"విశ్లేషణ : "},{"text":"పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ లేనిది ఈ సినిమా ప్రమోషన్‌ కి మీడియా ముందుకు రావడంతో హైప్‌ విపరీతంగా పెరిగింది. సినిమా చాలా బాగుంటుంది అంటూ పదే పదే ఆయన చెప్పడంతో ఓపెనింగ్స్‌ అద్భుతంగా నమోదు అయ్యాయి. అంతే కాకుండా సినిమా కోసం అంత కష్ట పడ్డాం, ఇంత కష్టపడ్డాం అంటూ చెబుతూ ఉంటే ఆసక్తి పెరిగింది. కానీ సమయం తీసుకుని ఈ సినిమాను చేయలేదు, సమయం ఉన్నప్పుడు సినిమాను తీశారు. దాంతో ఔట్ పుట్‌ అలాగే వచ్చింది. "},{"text":"సినిమా అనేది సమయం తీసుకుని చేయాలి కానీ, సమయం ఉన్నప్పుడు చేస్తే సరిగా రాదు. ఆ విషయం ఈ వీరమల్లును చూస్తే అర్థం అవుతుంది. రోజుకు రెండు మూడు గంటల పాటు పవన్‌ కి కుదిరిన సమయంలో తీశాము అన్నారు. ఎక్కువగా గ్రీన్‌ మ్యాట్‌ పై తీసినట్లుగా ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ లో కనీసం ఆ గ్రీన్ మ్యాట్‌ను అయినా సరిగ్గా తీయలేదు. ఇక వీఎఫ్‌ఎక్స్ గురించి ఏం మాట్లాడుకుంటాం. మంచి కథ అయినా దాన్ని చూపించే తీరు బాగుండాలి. "},{"text":"పవన్‌ ఈ సినిమాకు ఇంకాస్త ఎక్కువ సమయం ఇచ్చి, మంచి వీఎఫ్‌ఎక్స్ పడి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేది. ఇక ఈ సినిమాని కీరవాణి మరీ పాతాలానికి పడిపోకుండా కాపాడింది. పవన్ కళ్యాణ్ ఇలా హడావిడిగా సినిమాలు తీయడం కంటే మానేయడం మంచిది. "},{"text":"ప్లస్‌ పాయింట్స్ : "},{"text":"పవన్ కళ్యాణ్‌, "},{"text":"కీరవాణి సంగీతం."},{"text":"మైనస్ పాయింట్స్ : "},{"text":"వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌,"},{"text":"స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం,"},{"text":"నటీనటులకు ప్రాధాన్యత లేదు,"},{"text":"సెకండ్‌ హాఫ్‌."},{"text":"చివరగా.."},{"text":"వీరమల్లును చెడగొట్టిన వీఎఫ్‌ఎక్స్‌, నిలబెట్టలేక పోయిన కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌."},{"text":"బ్యానర్ : మెగా సూర్య ప్రొడక్షన్స్"},{"text":"నిర్మాత : ఎఎం రత్నం"},{"text":"దర్శకత్వం : క్రిష్‌, జ్యోతికృష్ణ"},{"text":"సంగీతం : కీరవాణి"},{"text":"తారాగణం : పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌, రఘుబాబు, సునీల్‌, నాజర్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-hari-hara-veeramallu---no-avtion--no-vfx-","tags":["politics"]}}