{"data":{"prismicReviewarticle":{"uid":"review-daaku-mahaaraaj","tags":["politics"],"first_publication_date":"2025-01-12T09:10:59+0000","last_publication_date":"2025-01-13T18:48:45+0000","data":{"title":{"text":"'డాకు మహారాజ్‌' రివ్యూ... బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండగ"},"rating":2.5,"datetime":"2025-01-12T19:21:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/Z4N7l5bqstJ99WS5_Daaku.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE","thumbnail_url":"https://i.ytimg.com/vi/V0ARlFc_ndE/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@SitharaEntertainments","title":"Daaku Maharaaj Release Trailer | NBK, Pragya, Shraddha, Bobby Deol | Thaman S | Bobby Kolli"},"content":{"raw":[{"text":"అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ దక్కించుకుని హ్యాట్రిక్‌ కొట్టిన బాలకృష్ణ నాల్గవ సినిమా డాకు మహారాజ్‌తో హిట్‌ కొట్టి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న బాలకృష్ణను బాబీ ఓ రేంజ్‌ ఎలివేషన్స్‌తో చూపించాడు అంటూ నిర్మాత నాగవంశీ పలు వేదికల మీద చెప్పుకొచ్చాడు. ఇక తమన్ ఈ సినిమాకు మరోసారి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ను అందించాడు. దాంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"హిల్‌ స్టేషన్‌లో నివాసం ఉండే కోటీశ్వరుడి టీ ఎస్టేట్‌ను లీజుకు తీసుకుని అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు లోకల్‌ ఎమ్మెల్యే(రవి కిషన్‌). అతడిపై ఫిర్యాదు చేయడంతో కోటీశ్వరుడి కుటుంబంలోని వారిని చంపేందుకు సిద్ధం అవుతాడు. ఆ కుటుంబంలోని పాపను రక్షించేందుకు జైలు నుంచి నానిజీ(బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. ఆ క్రమంలోనే భలవంత్‌సింగ్‌ ఠాకూర్‌(బాబీ డియోల్‌)తో ఢీ కొడతాడు. "},{"text":"ఇంతకు నానాజీ ఎవరు? ఆ పాపను ఎందుకు కాపాడుతూ ఉంటాడు? ఒక సామాన్య ఇంజనీర్‌ ఎందుకు డాకు మహారాజ్‌గా మారాల్సి వచ్చింది అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే."},{"text":"నటీనటుల నటన :"},{"text":"బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే విధంగా అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాల్లో అలరించాడు. ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు కొన్ని మాస్ డైలాగ్స్‌ చెప్పే సన్నివేశాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు. పాటల్లో డాన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ డాకు పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ముఖ్యంగా ఆయన లుక్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. ఆకట్టుకునే విధంగా బాలకృష్ణ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించారు. ప్రతి వేరియేషన్‌లోనూ నటనతో మెప్పించాడు. "},{"text":"హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటించి మెప్పించింది. ఆమెకు స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే అయినా పర్వాలేదు అనిపించింది. శ్రద్దా శ్రీనాథ్‌ కలెక్టర్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకు తగ్గట్లుగా లుక్‌లో ఆకట్టుకుంది. ఇక ఊర్వశి రౌతేలా గ్లామర్‌తో మెప్పించింది. బాబీ డియోల్‌ మరోసారి యానిమల్‌ స్థాయి నటనతో ఆకట్టుకుంది. సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్నారి పాత్ర బాగుంది, అంతే కాకుండా పాప నటన ఆకట్టుకుంది. "},{"text":"టెక్నికల్‌ :"},{"text":"తమన్‌ మరోసారి తన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో బాలకృష్ణ ఫ్యాన్స్ మతి పోగొట్టాడు. దర్శకుడు బాబీ ప్రతి సీన్‌లోనూ బాలకృష్ణకు ఇచ్చిన ఎలివేషన్‌కి తగ్గట్లుగా తమన్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరింది. ముఖ్యంగా డాకు సన్నివేశాల్లోని బీజీఎంకి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. పాటలు సైతం పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. మొత్తానికి పాటలతో పాటు ప్రతి ఒక్క సన్నివేశంలోనూ తమన్ వర్క్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా కావడం ఖాయం. "},{"text":"సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో కెమెరా పనితనం చాలా బాగుంది. దర్శకుడు బాబీ కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. బాలకృష్ణ పాత్రను హైలైట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. "},{"text":"విశ్లేషణ :"},{"text":"బాలకృష్ణ హ్యాట్రిక్‌ సక్సెస్‌ల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ ఈ సినిమాను రూపొందించాడు. కథ సాదా సీదాగా ఉన్నా స్క్రీన్‌ప్లేతో అదరగొట్టాడు. ముఖ్యంగా బాలకృష్ణ సన్నివేశాలను బాబీ ఎలివేట్‌ చేసిన తీరు సూపర్‌. నందమూరి ఫ్యాన్స్‌ ప్రతి ఒక్కరికీ గల్లా ఎగరేసుకునే స్థాయిలో బాలకృష్ణ ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి. "},{"text":"దర్శకుడు బాబీ తీసుకున్న కథ విషయంలో కాస్త నిరుత్సాహంగా ఉన్నా సన్నివేశాలను మలచిన తీరు చాలా బాగుంది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాల కారణంగా సినిమా స్థాయి పెరిగింది. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు, బాలకృష్ణ ఎలివేషన్‌ సన్నివేశాలు ఫ్యాన్స్‌కి పండుగ తెచ్చి పెట్టే విధంగా ఉన్నాయి. "},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"బాలకృష్ణ,"},{"text":"యాక్షన్‌ సన్నివేశాలు,"},{"text":"తమన్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌"},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"రొటీన్‌ కథ, "},{"text":"హీరోయిన్‌ పాత్రలకు ప్రాముఖ్యత లేదు,"},{"text":"ఇంటర్వెల్‌ సీన్‌."},{"text":"చివరగా..."},{"text":"బాలకృష్ణ ఫ్యాన్స్‌ కోరుకునే విధంగా డాకు మహారాజ్‌ ఉంది. "},{"text":"బ్యానర్‌ : సితార ఎంటర్‌టైన్మెంట్స్‌"},{"text":"నిర్మాత : నాగవంశీ"},{"text":"దర్శకత్వం : బాబీ"},{"text":"సంగీతం : తమన్‌"},{"text":"తారాగణం : బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, శ్రద్దా శ్రీనాథ్‌, సత్య, రవి కిషన్‌, చాందిని చౌదరి తదితరులు"}]}}},"relatedReviews":{"edges":[{"node":{"uid":"review-comrade-kalyan-","data":{"title":{"text":"Review: 'Comrade Kalyan' "},"img":{"url":"https://images.prismic.io/prad/bc2LuntcOi-ChERR_ck.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}},{"node":{"uid":"review-dont-trouble-the-trouble","data":{"title":{"text":"Review: ‘Don’t Trouble the Trouble’"},"img":{"url":"https://images.prismic.io/prad/bqNucWhmNWKKQiVy_DTTT.JPG?auto=format,compress"},"rating":1.75}}},{"node":{"uid":"review-the-paradise","data":{"title":{"text":"Review: 'The Paradise'"},"img":{"url":"https://images.prismic.io/prad/gykUOtmdxL0XVM2y_TheParadise.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.25}}},{"node":{"uid":"review-epic","data":{"title":{"text":"Review: 'Epic'"},"img":{"url":"https://images.prismic.io/prad/i5tpcCyZXxZGstkc_EPICreview.jpg?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}}]},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ysrcp-every-seat-must-see-a-fight","data":{"third_party_url":null,"title":{"text":"YSRCP: Every Seat Must See a Fight"},"img":{"url":"https://images.prismic.io/prad/Gk_IYoGJA83EfjZs_jagan.JPG?auto=format%2Ccompress&rect=0%2C22%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-14T14:47:00+0000"}}},{"node":{"uid":"ed-seizes-reliance-power-assets-worth-2032-cr","data":{"third_party_url":null,"title":{"text":"ED seizes Reliance Power assets worth 2,032 cr"},"img":{"url":"https://images.prismic.io/prad/aIz4r6Tt2nPbZrgR_anilambani.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T12:45:00+0000"}}},{"node":{"uid":"ed-attaches-129-cr-in-ttd-ghee-case","data":{"third_party_url":null,"title":{"text":"ED Attaches 129 Cr in TTD Ghee Case"},"img":{"url":"https://images.prismic.io/prad/ZuxhHbVsGrYSvmU3_tirumalaladdu.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T15:42:00+0000"}}},{"node":{"uid":"trump-promises-5k-if-gop-wins","data":{"third_party_url":null,"title":{"text":"Trump Promises $5K if GOP Wins"},"img":{"url":"https://images.prismic.io/prad%2F297f16fa-5103-4b35-813b-76f5f9ba4215_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C13%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-14T03:29:00+0000"}}},{"node":{"uid":"mp-avinash-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"MP Avinash Reddy appears before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/7c2a5caa-1f8e-40d0-b5ff-c3a80775b6a7_avinash+reddy.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T07:30:00+0000"}}},{"node":{"uid":"andhra-nda-haggles-over-local-poll-seats","data":{"third_party_url":null,"title":{"text":"Andhra NDA Haggles Over Local Poll Seats"},"img":{"url":"https://images.prismic.io/prad/Lx247yLX8ZRXWkFC_apndapartners.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:30:00+0000"}}},{"node":{"uid":"rahul-casts-for-protest-battle","data":{"third_party_url":null,"title":{"text":"Rahul Casts for Protest Battle!"},"img":{"url":"https://images.prismic.io/prad/zYKLUmbsWJagQskr_rahulprotest.JPG?auto=format%2Ccompress&rect=0%2C32%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:15:00+0000"}}},{"node":{"uid":"democratic-house-would-test-trumps-india-agenda","data":{"third_party_url":null,"title":{"text":"Democratic House would test Trump’s India agenda"},"img":{"url":"https://images.prismic.io/prad/15m8SwaCDnQQJ7yn_USwashington.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T05:55:00+0000"}}},{"node":{"uid":"tirupati-eyes-global-glory","data":{"third_party_url":null,"title":{"text":"Tirupati Eyes Global Glory"},"img":{"url":"https://images.prismic.io/prad%2F754a7b33-759c-4ae5-bc2b-ef7d792c592f_tirupati.jpg?auto=format%2Ccompress&rect=0%2C207%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-12T18:39:00+0000"}}},{"node":{"uid":"viveka-case-bhaskar-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"Viveka Case: Bhaskar Reddy Appears Before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/c8ea4321-db22-4d42-871c-556bf38ae249_YS+Bhaskar+Reddy.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-13T08:00:00+0000"}}},{"node":{"uid":"andhra-ias-officer-booked-for-pub-slap","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Booked for Pub Slap"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C116%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-13T07:15:00+0000"}}},{"node":{"uid":"4-burnt-alive-as-car-catches-fire-in-vijayawada","data":{"third_party_url":null,"title":{"text":"4 burnt alive as car catches fire in Vijayawada"},"img":{"url":"https://images.prismic.io/prad/aSQZ82GnmrmGqKTy_carcharred.JPG?auto=format,compress"},"datetime":"2026-10-12T15:49:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-daaku-mahaaraaj","tags":["politics"]}}