{"data":{"prismicReviewarticle":{"uid":"review-thammudu---sentiment-less-action-high","tags":["politics"],"first_publication_date":"2025-07-04T10:31:17+0000","last_publication_date":"2025-07-06T13:37:56+0000","data":{"title":{"text":"'తమ్ముడు' రివ్యూ... సెంటిమెంట్‌ తక్కువ, యాక్షన్‌ ఎక్కువ"},"rating":1.75,"datetime":"2025-07-04T08:47:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aGejY3fc4bHWjDEq_thammudu.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=qcX7R9x5PqI","thumbnail_url":"https://i.ytimg.com/vi/qcX7R9x5PqI/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@TseriesTelugu","title":"Thammudu Release Trailer | Nithiin | Sriram Venu | Raju - Shirish | #ThammuduOnJuly4"},"content":{"raw":[{"text":"వకీల్‌ సాబ్‌ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న వేణు శ్రీరామ్‌ అనుకోని కారణాల వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నితిన్‌తో వేణు శ్రీరామ్‌ రూపొందించిన ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్‌ను పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ తమ్ముడు అనే విషయం తెల్సిందే. అందుకే తమ్ముడు గా నితిన్‌ అలరిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఇక లయ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ :"},{"text":"ఆర్చరీలో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తీసుకు రావడమే జీవిత ఆశయంగా బతుకుతున్న జై(నితిన్‌) ప్రాక్టీస్‌లో లక్ష్యాలను ఛేదించడంలో విఫలం అవుతూ ఉంటాడు. చిన్నతనంలో తన అక్క ఝాన్సీ(లయ) తో జరిగిన ఒక సంఘటన కారణంగా జై గురి తప్పుతూ ఉన్నాడని చిత్ర(వర్ష బొల్లమ్మ) గుర్తిస్తుంది. దాంతో ఝాన్సీ వద్దకు జై వెళ్లేందుకు రెడీ అవుతాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఝాన్సీ పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఝాన్సీని చంపేందుకు పెద్ద ముఠా రంగంలోకి దిగుతుంది. ఆ ప్రమాదం ఏంటి? ఝాన్సీని తమ్ముడు జై ఎలా కాపాడుతాడు? అనేది సినిమా కథ."},{"text":"నటీనటుల నటన :"},{"text":"నితిన్ నటన మెప్పించే విధంగా ఉంది. పెద్దగా ఎమోషన్‌ సీన్స్ లేవు. ఉన్న సీన్స్‌లోనూ పెద్దగా ఆయన పర్వాలేదు అనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో నితిన్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్‌ షాట్స్‌ లో గతంలో మాదిరిగా కాకుండా ఇంకాస్త బెటర్‌గా కనిపించాడు. యాక్టింగ్‌లో నితిన్‌ కి మంచి మార్కులు పడతాయి. అయితే ఆయన పాత్రకు గొప్ప స్థాయిలో స్కోప్‌ లేదు. ఆయన తనకు అప్పగించిన పనిని సాధ్యం అయినంత వరకు పూర్తి చేశాడు."},{"text":"కన్నడ బ్యూటీ సప్తమి గౌడ తెలుగులో మొదటి సినిమాగా ఈ సినిమాతో వచ్చింది. ఆమెకు నటిగా ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది. డీ గ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. వర్ష బొల్లమ్మ పాత్ర పరిమితంగా ఉంది. ఆమె కథలో పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించలేదు. "},{"text":"లయ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను లయ అందుకునే విధంగా ఝాన్సీ పాత్ర లేదు. ఆ పాత్ర ను మరింత పవర్‌ ఫుల్‌గా చూపించి ఉండాల్సింది. కానీ దర్శకుడు విఫలం అయ్యాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో పర్వాలేదు అనిపించారు."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఎంపిక చేసుకున్న కథ పాత చింతకాయ పచ్చడిలా ఉంది. సరే కథ పాత చింతకాయ అయినప్పటికీ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉందా అంటే అది కూడా లేదు. మూస దోరణిలోనే స్క్రీన్‌ ప్లే సాగింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు. "},{"text":"సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకటి రెండు సీన్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ కాస్త పర్వాలేదు అన్నట్లు ఉంది. నైట్‌ ఎఫెక్ట్‌ సీన్స్ ఇంట్రస్టింగ్‌గా సాగడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. "},{"text":"ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. పాటల ప్లేస్మెంట్‌ సరిగ్గా లేదు, అలాగే సినిమాలోని పలు సీన్స్ జర్క్‌ ఇచ్చినట్లుగా ఉన్నాయి."},{"text":"విశ్లేషణ :"},{"text":"ఎంసీఎ వంటి సూపర్‌ హిట్‌ సినిమాను రూపొందించిన దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆ తర్వాత వకీల్‌ సాబ్‌ వంటి రీమేక్ తో రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రీమేక్ ఎలా చేస్తాడో అనుకున్నారు, చాలా మార్పులు చేసి, అచ్చు తెలుగు సినిమా మాదిరిగా మార్చడంలో సక్సెస్‌ అయ్యాడు. దాంతో ఆయన వెంటనే అల్లు అర్జున్‌తో ఐకాన్‌ అనే సినిమా తేసేందుకు రెడీ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ నుంచి గ్రీన్‌ సిగ్నల్ రాకపోవడంతో నితిన్‌ తో తమ్ముడు సినిమాను తీశాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమాను తీశాడు. "},{"text":"దిల్‌ రాజుకు ఈ సినిమా గుదిబండగా మారింది. ఆయన ఈ సినిమా నిర్మాణంకు భారీగా ఖర్చు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో నితిన్‌, వేణు శ్రీరామ్‌లు పారితోషికం వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. అయినా బడ్జెట్‌ భారీగానే పెరిగింది. ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేయడం ద్వారా సినిమాకు పబ్లిసిటీ అయితే దక్కింది. కానీ సినిమా కంటెంట్‌ చాలా పూర్ గా ఉంది. ఫస్ట్‌ హాఫ్ మొత్తం రొటీన్‌ కథ, స్క్రీన్‌ప్లేతో సాగింది. అసలు కథ మొదలు అయినట్లు లేదు. సెకండ్‌ హాఫ్‌ లో కొన్ని సీన్స్ పర్వాలేదు. "},{"text":"ఇక టైటిల్‌కి న్యాయం చేసినట్లుగా మాత్రం అనిపించలేదు. అక్క, తమ్ముడు మధ్య రిలేషన్‌ను చక్కగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. లయను తీసుకు వచ్చినా పెద్దగా ఫలితం దక్కలేదు. మొత్తంగా తమ్ముడు యాక్షన్ ఎక్కువ, ఎమోషన్స్‌ తక్కువ అన్నట్లు సాగింది. అక్క- తమ్ముడు మధ్య ఎమోషన్స్‌ను చూపించడంలో విఫలం అయ్యారు."},{"text":"ప్లస్‌ పాయింట్స్ :"},{"text":"నితిన్‌, వర్ష కాంబో సీన్స్,"},{"text":"కొన్ని యాక్షన్‌ సీన్స్‌."},{"text":"మైనస్ :"},{"text":"ఎమోషన్స్ లేకపోవడం,"},{"text":"సంగీతం,"},{"text":"కథ, స్క్రీన్‌ప్లే,"},{"text":"ఎడిటింగ్‌."},{"text":"చివరగా..."},{"text":"తమ్ముడు టైటిల్‌కి న్యాయం చేయలేక పోయారు."},{"text":"బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌"},{"text":"నిర్మాత : దిల్‌ రాజు"},{"text":"దర్శకత్వం : వేణు శ్రీరామ్‌"},{"text":"సంగీతం : అజనీష్ లోకనాథ్‌"},{"text":"తారాగణం : నితిన్‌, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-thammudu---sentiment-less-action-high","tags":["politics"]}}