{"data":{"prismicReviewarticle":{"uid":"war-2-revew---routine-spy-thriller","tags":["politics"],"first_publication_date":"2025-08-14T11:01:45+0000","last_publication_date":"2025-08-15T10:23:03+0000","data":{"title":{"text":"'వార్‌ 2' రివ్యూ... రొటీన్‌ స్పై థ్రిల్లర్‌ "},"rating":2.25,"datetime":"2025-08-14T09:49:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aJ2_HqTt2nPbaUQs_war2.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=d1wsPSV_lQs","thumbnail_url":"https://i.ytimg.com/vi/d1wsPSV_lQs/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@yrftelugu","title":"WAR 2 Official Trailer | Telugu | Hrithik Roshan, NTR, Kiara Advani, Ayan Mukerji | YRF Spy Universe"},"content":{"raw":[{"text":"ఎన్టీఆర్‌ మొదటి బాలీవుడ్‌ సినిమా కావడంతో వార్‌ 2 పై తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందించాడు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించగా ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ హిందీ ఎంట్రీ పై రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. ఎన్టీఆర్‌ కి మరో హీరో సినిమాలో నటించాల్సిన అవసరం ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అయినా కూడా పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో మేకర్స్‌ హిట్‌ అయ్యారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"రా ఏజెంట్‌ కబీర్‌(హృతిక్‌ రోషన్‌) కొన్ని కారణాల వల్ల రా నుంచి తప్పుకుంటాడు. కబీర్‌ ఒక కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా మారి ఎన్నో హత్యలు చేస్తూ ఉంటాడు. అతడు దేశ ద్రోహంకు సైతం వెనకాడడు అని అంతా భావిస్తూ ఉంటారు. అదే సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని దేశాలు కలిసి 'కలి' పేరిట ఒక ఆపరేషన్ చేయాలని సిద్ధం అవుతారు. భారత్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభం అయిన ఆ కలి ఆపరేషన్‌ బాధ్యతలను కబీర్‌ కి అప్పగించాలని భావిస్తారు. "},{"text":"ఇంతకు ఆ కలి ఆపరేషన్‌ ఏంటి? దానికి కబీర్‌ ఒప్పుకున్నాడా? ఈ ఆపరేషన్‌కు విక్రమ్‌ చలపతి(ఎన్టీఆర్‌) కి సంబంధం ఏంటి అనేది కథ. ఈ స్పై థ్రిల్లర్‌ కథ రొటీన్‌గా సాగింది. "},{"text":"నటీనటుల నటన : "},{"text":"హృతిక్ రోషన్‌ ఎప్పటిలాగే యాక్షన్‌ సీన్స్‌లో మెప్పించాడు. ముఖ్యంగా అతడు చేసిన యాక్షన్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. హృతిక్‌ రోషన్‌ను ప్రేక్షకులు వెండి తెరపై ఎలా చూస్తే విజిల్స్ వేస్తారో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అలాగే చూపించాడు. కానీ కథలో పట్టు లేకపోవడం, స్క్రీన్‌ ప్లే విషయంలో డొల్లతనం వల్ల హృతిక్‌ నటన బయటకు వచ్చే పరిస్థితి లేదు. హృతిక్ డాన్స్‌తో మెప్పించాడు. రొమాంటిక్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హృతిక్‌ రోషన్‌ యొక్క గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో యాక్టింగ్‌ ఇంకాస్త బెటర్‌ అనడంలో సందేహం లేదు. "},{"text":"ఎన్టీఆర్‌ ఈ సినిమాలో లుక్‌ పరంగా బాగున్నాడు. యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని సీన్స్ లో వీఎఫ్‌ఎక్స్‌ వినియోగించి ఎన్టీఆర్‌ లుక్‌ను మార్చినట్లుగా అనిపించింది. కానీ ఆయన ఒరిజినల్‌ లుక్‌లోనే బాగుంటాడు. కొన్ని సెక్స్‌ వచ్చి పోయే షాట్స్‌ ను ఆపి చేస్తే ఖచ్చితంగా ఎబెట్టుగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మాత్రం ఎన్టీఆర్‌ లుక్‌, యాక్టింగ్‌ బాగుంది. హృతిక్‌ తో చేసిన ఫైటింగ్‌, డాన్స్‌ పోటా పోటీగా ఉండి ఆకట్టుకుంది. మొత్తంగా ఎన్టీఆర్‌ వార్‌ 2 లో ఆకట్టుకున్నాడు. "},{"text":"కియారా అద్వానీ బికినీ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పాటలో బికినీ అలా వచ్చి ఇలా వెళ్లి పోయినట్లు అనిపించింది. వెండి తెరపై నిజంగానే కియారా అద్వానీ అందాల దేవత అన్నట్లుగా ఉంది. ఇక ఆమె పాత్రలో యాక్టింగ్‌తోనూ మెప్పించింది. ఓవరాల్‌గా కియారా అద్వానీకి ఇది పాజిటివ్‌ సినిమా అని చెప్పాలి. "},{"text":"టెక్నికల్‌ : "},{"text":"దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కథ ఎంపిక విషయంలో ఏమాత్రం శ్రద్ద కనబర్చినట్లుగా లేదు. గతంలో వచ్చిన స్పై థ్రిల్లర్‌లను మిక్సీలో వేసి రుబ్బి ఒక కథ ను రెడీ చేసినట్లుగా ఉంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నంత మాత్రాన ఆకట్టుకుంటుందని ఆయన భావించాడేమో. కథనంలో ఏమాత్రం బలం లేదు. ప్రతి సీన్‌ తర్వాత వచ్చే సీన్‌ ను ముందే ఊహించేయవచ్చు. నాసిరకం సంగీతం సినిమాకు పెద్ద మైనస్‌. పాటలు, బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. "},{"text":"సినిమాటోగ్రఫీ విషయంలో కాస్త పర్వాలేదు. యాక్షన్‌ సీన్స్‌ను నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే నాసిరకం వీఎఫ్‌ఎక్స్ కారణంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు చిరాకు కలుగుతుంది. పాత కాలంలో ఇంతకంటే మంచి వీఎఫ్ఎక్స్‌ వినియోగించారు అనిపిస్తుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి, ఎడిటింగ్‌లో చాలా జర్క్‌లు ఉన్నాయి. "},{"text":"విశ్లేషణ :"},{"text":"యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో ఇది ఒకటి. అయితే అన్నింటితో పోల్చితే ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆ స్పై థ్రిల్లర్స్‌ తెలుగులో ఆడలేదు. కానీ ఈ సినిమా ఎన్టీఆర్‌ ఉన్న కారణంగా ఆడుతుందని అనుకున్నారు. కానీ అంతగా ఈ సినిమా మెప్పించలేదు. "},{"text":"ఎన్టీఆర్‌ ఉన్నందుకు తెలుగు ప్రేక్షకులు ఒకసారి చూసే అవకాశం ఉంది. కానీ ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో మినిమం అనుభవంను ప్రదర్శించలేదు. నాసిరకం వీఎఫ్‌ఎక్స్ కారణంగా సినిమా చూస్తున్న సమయంలో అసహజంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ కాలేక పోవచ్చు. మొత్తానికి వార్‌ ను మించి వార్‌ 2 ఉంటుందంటే నిరాశ పరిచిందనే చెప్పాలి. "},{"text":"ప్లస్‌ పాయింట్స్ :"},{"text":"హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌,"},{"text":"కొన్ని యాక్షన్ సీన్స్‌, "},{"text":"కియారా అద్వానీ"},{"text":"మైనస్ : "},{"text":"వీఎఫ్‌ఎక్స్‌,"},{"text":"సంగీతం,"},{"text":"ఓవర్‌ స్టంట్స్‌"},{"text":"చివరగా.."},{"text":"ఎన్టీఆర్‌, హృతిక్‌ ఫ్యాన్స్‌కి పర్వాలేదు, కానీ ఓవరాల్‌గా అసంతృప్తి"},{"text":"బ్యానర్ : యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌"},{"text":"నిర్మాత : ఆదిత్య చోప్రా"},{"text":"దర్శకత్వం : అయాన్ ముఖర్జీ"},{"text":"సంగీతం : ప్రీతమ్‌, సంచిత్ బల్హర, అంకిత్ బల్హార"},{"text":"తారాగణం : హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌, కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్‌, బాబీ డియోల్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-student-wing-stages-protest-over-mp-suryas-remarks","data":{"third_party_url":null,"title":{"text":"BRS student wing stages protest over MP Surya’s remarks"},"img":{"url":"https://images.prismic.io/prad/aeIG9Z1ZCF7ETSSI_BRSStudentwing.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-17T08:10:00+0000"}}},{"node":{"uid":"gautam-adani-becomes-asias-richest-person","data":{"third_party_url":null,"title":{"text":"Gautam Adani becomes Asia’s richest"},"img":{"url":"https://images.prismic.io/prad/Z02IxpbqstJ978If_adani.JPG?auto=format,compress"},"datetime":"2026-04-17T05:51:00+0000"}}},{"node":{"uid":"amit-shahs-firm-stance-no-religious-reservations-for-muslims-mo2pi22d","data":{"third_party_url":null,"title":{"text":"Amit Shah: No Religious Reservations for Muslims"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9a998da1-ed74-4d1d-bf5c-3ce42a2986be_amit+shah.jpg?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-04-16T19:29:00+0000"}}},{"node":{"uid":"bengaluru-businessmans-honeytrap-nightmare-blackmailed-after-instagram-encounter-mo2pi7w3","data":{"third_party_url":null,"title":{"text":"Businessman’s Honeytrap Nightmare"},"img":{"url":"https://images.prismic.io/prad/c8335006-73f0-4db2-9b9f-f9d6f0421a05_love+is+blind.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T18:30:00+0000"}}},{"node":{"uid":"ysr-congress-leader-released-on-bail","data":{"third_party_url":null,"title":{"text":"YSR Congress leader released on bail"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7216aea1-016a-4612-8cd4-886237641335_ysrcp.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:39:00+0000"}}},{"node":{"uid":"tvk-manifesto-welfare-ai-1.5t-goal","data":{"third_party_url":null,"title":{"text":"TVK Manifesto: Welfare, AI, $1.5T Goal"},"img":{"url":"https://images.prismic.io/prad/aeEUw51ZCF7ETQr3_vijaytvk.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:15:00+0000"}}},{"node":{"uid":"from-now-onwards-nari-shakti-will-not-be-just-a-slogan","data":{"third_party_url":null,"title":{"text":"From now onwards, Nari Shakti will not be just a slogan"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T07:30:00+0000"}}},{"node":{"uid":"infosys-denies-pune-harassment-claims","data":{"third_party_url":null,"title":{"text":"Infosys Denies Pune Harassment Claims"},"img":{"url":"https://images.prismic.io/prad/7766529c-412f-4d9a-a068-c32a77895fee_infosys.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T06:06:00+0000"}}},{"node":{"uid":"case-filed-against-vijay","data":{"third_party_url":null,"title":{"text":"Case filed against Vijay"},"img":{"url":"https://images.prismic.io/prad/aPPHEJ5xUNkB2HoK_vijay.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T05:30:00+0000"}}},{"node":{"uid":"pichai-ranbir-in-times-100-most-influential-people-of-2026","data":{"third_party_url":null,"title":{"text":"Pichai, Ranbir in TIME's '100 Most Influential'"},"img":{"url":"https://images.prismic.io/prad/aeC5qZ1ZCF7ETPhc_pichairanbir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T05:28:00+0000"}}},{"node":{"uid":"madras-hc-orders-i-t-probe-on-udhayanidhi-assets","data":{"third_party_url":null,"title":{"text":"Court Orders Probe on Udhayanidhi Assets"},"img":{"url":"https://images.prismic.io/prad/5eb52f79-f1fb-4224-8660-30b6f9452808_udhanidhi+stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-04-15T08:13:00+0000"}}},{"node":{"uid":"lokesh-elevated-as-national-wp-of-tdp","data":{"third_party_url":null,"title":{"text":"Lokesh elevated as national WP of TDP"},"img":{"url":"https://images.prismic.io/prad/Z4vnQ5bqstJ99mOE_lokesh.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-15T07:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"war-2-revew---routine-spy-thriller","tags":["politics"]}}