{"data":{"prismicReviewarticle":{"uid":"review-matka---an-outdated-story","tags":["politics"],"first_publication_date":"2024-11-14T10:37:31+0000","last_publication_date":"2024-11-15T10:44:41+0000","data":{"title":{"text":"రివ్యూ : 'మట్కా' - అవుట్ డేటెడ్ స్టోరీ"},"rating":2.25,"datetime":"2024-11-14T08:48:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZzXHb68jQArT03N7_MATKA.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo","thumbnail_url":"https://i.ytimg.com/vi/FKtnAhHnfUo/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@adityamusic","title":"Matka Trailer | Varun Tej | Karuna Kumar | Meenakshi Choudhary | Nora Fatehi | GV Prakash Kumar"},"content":{"raw":[{"text":"వరుణ్‌ తేజ్ కమర్షియల్‌ సక్సెస్ దక్కించుకుని చాలా కాలం అయింది. ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాటిని వివాహం చేసుకున్న వరుణ్‌ తేజ్‌కి 'మట్కా' సినిమాతో హిట్‌ దక్కేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కరుణ కుమార్‌ ఈ సినిమాను రూపొందించిన నేపథ్యంలో మొదటి నుంచి ఆసక్తి పెరిగింది. పైగా ట్రైలర్‌ లో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్ చూసి అంచనాలు మరింతగా పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"వాసు(వరుణ్‌ తేజ్‌) చిన్నతనంలోనే నేరం చేయడం వల్ల జైలుకు వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత వైజాగ్ పూర్ణ మార్కెట్‌లో కొబ్బరికాయల కొట్టులో పనికి చేరతాడు. అక్కడ జరిగిన కొన్ని పరిణామాల వల్ల వాసు మెల్లగా రౌడీగా మారతాడు. జైలు జీవితం కారణంగా రఫ్‌గా తయారు అయిన వాసు బయటి పరిస్థితులతో మరింతగా రౌడీయిజంకు సిద్ధం అవుతాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా మట్కాను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే మట్కా కింగ్‌గా అవతరిస్తాడు. ఆ సమయంలోనే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సుజాత(మీనాక్షి చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమె వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వాసు మట్కా వాసుగా మారే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సుజాత అతడి జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అనేది సినిమా కథాంశం. "},{"text":"నటీనటుల నటన :"},{"text":"వరుణ్ తేజ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. సినిమాలో ఏదైనా హోప్‌ ఉంది అంటే అది వాసు పాత్ర మాత్రమే అనడంలో సందేహం లేదు. వరుణ్ తేజ్ తన నటనతో, లుక్‌ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 1950 నుంచి 1980 వరకు ఒక పాత్రలోని వేరియేషన్స్‌ను వరుణ్‌ తేజ్ చూపించిన తీరు నిజంగా అద్భుతం. ప్రతి సన్నివేశంలోనూ వరుణ్‌ తేజ్‌ మాత్రమే కనిపించే విధంగా నటించాడు. దర్శకుడు హీరో పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం కారణంగా వరుణ్ తేజ్‌ హైలైట్‌ గా నిలిచాడు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, ముసలి మట్కా వాసు గెటప్‌లోనూ వరుణ్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తాడు. "},{"text":"హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి ఇటీవలే 'లక్కీ భాస్కర్‌' సినిమాతో సక్సెస్ దక్కింది. ఆ సినిమాలో నటిగా మంచి ప్రతిభ కనబర్చిన కారణంగా మట్కాలోనూ మీనాక్షికి మంచి అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ మట్కా వాసులో మీనాక్షి చౌదరికి తన ప్రతిభ చూపించే స్థాయిలో ఛాన్స్ రాలేదు. అయితే వచ్చినంతలో ఆమె పర్వాలేదు అనిపించింది. పీరియాడిక్‌ మూవీ కావడంతో మీనాక్షి వింటేజ్ లుక్‌లో కనిపించింది. దాంతో ఆమె అందాలు చూసే అవకాశం దక్కలేదు. ఇక ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించి పర్వాలేదు అనిపించారు. "},{"text":"టెక్నికల్‌ : "},{"text":"దర్శకుడు కరుణ కుమార్‌ రొటీన్‌ కథను ఎంపిక చేసుకున్నాడు. సరే కథ ఎలా ఉన్నా కథనం బాగుంటే ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా విభిన్నంగా సాగి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది. కానీ కథనం సైతం చాలా స్లోగా, బోరింగ్‌గా సాగింది. వరుణ్‌ తేజ్ ను చూపించే విషయంలోనే ఎక్కువగా శ్రద్ద పెట్టాడా అనిపించింది. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. "},{"text":"సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అయితే నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పీరియాడిక్‌ మూవీ కావడంతో సన్నివేశాలను నేచురల్‌గా చూపించడం అంత ఈజీ కాదు. కానీ వరుణ్‌ తేజ్ తో పాటు, లొకేషన్స్‌ ను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. "},{"text":"నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ లో లోపాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు స్పీడ్‌గా ఉన్నాయి... కొన్ని సాగతీసినట్లుగా ఉన్నాయి. "},{"text":"విశ్లేషణ :"},{"text":"వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డా కథల ఎంపిక విషయంలో తెలివి వస్తున్నట్లుగా అనిపించడం లేదు. తన ఫ్యామిలీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నా వారి సలహాలు తీసుకుంటున్నాడా లేదా అనిపిస్తుంది. ఈ కథను చిరంజీవి లేదా నాగబాబు విని ఉంటే ఓకే చెప్పేవారు కాదేమో అనిపిస్తుంది. వారికి కథలు వినిపించాలని  వరుణ్ అనుకోవడం లేదేమో అనిపిస్తుంది. "},{"text":"కథ ఎంపిక విషయంలోనే డ్యామేజీ జరిగితే సినిమాను లేపడం అంత ఈజీ కాదు. కథ బాగాలేనప్పుడు ఎంత కష్టపడితే ఏం లాభం అన్నట్లుగా మట్కా పరిస్థితి ఉంది. వరుణ్‌ తేజ్ ఈ సినిమా కోసం దాదాపు ఏడాది కాలం కష్టపడ్డాడు. కానీ ఆ కష్టానికి తగ్గట్లుగా దర్శకుడు కరుణ కుమార్‌ సినిమాను తీయడంలో సఫలం కాలేక పోయారు. మట్కా వాసు పాత్రను ఇంకాస్త ఆసక్తికరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా యంగ్‌ ఏజ్‌ సన్నివేశాలు మరిన్ని ఉండి ఉంటే బాగుండేది. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్ అత్యంత కీలకం.. అలాంటి ఎలిమెంట్స్‌ను దర్శకుడు లైట్‌ తీసుకున్నాడా అనిపించింది. కథ ఎంపిక విషయంలో దర్శకుడి ఛాయిస్ రాంగ్‌ అనడంలో సందేహం లేదు. "},{"text":"ప్లస్ పాయింట్స్ : "},{"text":"వరుణ్ తేజ్‌ నటన, "},{"text":"కొన్ని గ్యాంబ్లింగ్‌ సీన్స్‌"},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"స్లో కథనం, "},{"text":"కథ, స్క్రీన్‌ప్లే,"},{"text":"పలు పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్తాయి, "},{"text":"కమర్షియల్‌ ఎలిమెంట్స్ లోపించడం"},{"text":"చివరగా..."},{"text":"వరుణ్ తేజ్ మట్కా పీరియాడిక్‌ డ్రామా మాత్రమే కాదు అవుట్ డేటెడ్ కాన్సెప్ట్‌"},{"text":"బ్యానర్‌ : SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్"},{"text":"నిర్మాత : రజని తాళ్లూరి"},{"text":"దర్శకత్వం : కరుణ కుమార్"},{"text":"సంగీత దర్శకుడు : జివి ప్రకాష్ కుమార్‌"},{"text":"తారాగణం : వరుణ్ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, అశ్వని, సత్యం రాజేష్‌, నవీన్ చంద్ర, అజయ్‌ ఘోష్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"149-indian-nationals-rescued-in-nepal-after-floods","data":{"third_party_url":null,"title":{"text":"149 Indian nationals rescued in Nepal after floods"},"img":{"url":"https://images.prismic.io/prad/g5C3QQcdGjpS2GX-_nepalfloods.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-08-30T13:32:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-matka---an-outdated-story","tags":["politics"]}}