{"data":{"prismicReviewarticle":{"uid":"review-telusu-kada---emotional-entertainment","tags":["politics"],"first_publication_date":"2025-10-17T10:22:17+0000","last_publication_date":"2025-10-18T10:41:18+0000","data":{"title":{"text":"'తెలుసు కదా' రివ్యూ... ఎమోషనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌"},"rating":2.25,"datetime":"2025-10-17T09:30:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aPIUlZ5xUNkB2FbH_TK.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=clB21Xnu_SU","thumbnail_url":"https://i.ytimg.com/vi/clB21Xnu_SU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@PeopleMediaFactory","title":"Telusu Kada Trailer | Siddu Jonnalagadda | Srinidhi | Raashii | Neerraja | TG Vishwa Prasad | PMF"},"content":{"raw":[{"text":"డీజే టిల్లు సినిమా తర్వాత స్టార్‌ బాయ్‌గా ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టిల్లు స్క్వేర్‌ ఆకట్టుకుంది, కానీ ఇటీవల వచ్చిన జాక్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. దాంతో సిద్దు తదుపరి సినిమా విషయంలో ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెలుసు కదా రూపొందినట్లు టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషనల్‌ స్టఫ్‌ ను చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా ట్రైలర్‌ చూసిన తర్వాత కాస్త బోల్డ్‌ కంటెంట్‌ అనే అభిప్రాయం ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది? సిద్దుకి మరో విజయం దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":""},{"text":"కథ :"},{"text":"అనాథ అయిన వరుణ్‌ (సిద్దు జొన్నలగడ్డ) తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలని కలలు కంటూ ఉంటాడు. చాలా నిజాయితీగా ఉంటూ రాగ కుమార్‌(శ్రీనిధి శెట్టి)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఆమె బ్రేకప్‌ చేసి వెళ్లి పోవడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలి నిర్ణయించుకుంటాడు. మ్యాట్రిమోనీ ద్వారా అంజలి శర్మ(రాశి ఖన్నా) తో వరుణ్‌ కి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటారు."},{"text":""},{"text":"వరుణ్‌, అంజలి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా పెద్ద షాకింగ్‌ విషయం తెలుస్తుంది, ఆ వెంటనే బ్రేకప్‌ చెప్పి వెళ్లి పోయిన రాగ సైతం వరుణ్‌ జీవితంలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది."},{"text":""},{"text":"అప్పుడు వరుణ్‌ ఏం చేశాడు? ఇంతకు పెళ్లి తర్వాత వరుణ్‌, అంజలికి తెలిసిన షాకింగ్‌ విషయం ఏంటి? ఈ ట్రయాంగిల్‌ స్టోరీ చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోండి."},{"text":""},{"text":"నటీనటుల నటన :"},{"text":"ఎప్పటిలాగే సిద్దు జొన్నలగడ్డ మొత్తం బాధ్యత తన భుజాల మీద వేసుకుని సినిమాను మోసుకు వెళ్లాడు. ఆయన డైలాగ్‌ డెలివరి, ఎమోషనల్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతి ఒక్కదాంట్లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్‌తో ఆయన చేసిన సన్నివేశాల్లో హీరోయిన్స్‌ ను కంటే ఆయన్ను చూడాలి అనిపించే విధంగా ఉంది. మొత్తంగా సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా బాధ్యత మొత్తం తీసుకుని సక్సెస్‌ అయ్యాడు. ఆయన డైలాగ్‌ డెలివరీ గతంతో పోల్చితే కాస్త మాస్‌ ఎలిమెంట్స్ తగ్గిందని చెప్పాలి. అయినా కూడా బాగుంది. సిద్దు లుక్ పరంగానూ ఆకట్టుకున్నాడు."},{"text":""},{"text":"హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి లుక్స్‌ పరంగా ఆకట్టుకుంది. యాక్టింగ్‌తోనూ మెప్పించింది. లవ్‌ సీన్స్‌తో పాటు, కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో శ్రీనిధి ఆకట్టుకుంది. సిద్దుకు సరైన జోడీ అన్నట్లుగా నటించింది. రొమాంటిక్ సీన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించినా ఓవరాల్‌గా తన పాత్రకు న్యాయం చేసింది. హీరోయిన్‌ రాశి ఖన్నా సైతం తన పాత్రకు న్యాయం చేసింది. సిద్దు ను వివాహం చేసుకున్న తర్వాత కొన్ని షాకింగ్ సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆమె నటన బాగుంది. చాలా సహజంగా ఆ సీన్స్‌లో ఎమోషన్‌ పండించింది. ఓవరాల్‌గా రాశి ఖన్నా సైతం అంజలి పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించి మెప్పించింది. ఇక వైవా హర్ష కామెడీ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. తనకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్నాడు."},{"text":""},{"text":"టెక్నికల్‌ :"},{"text":"ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన తమన్‌ పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచాడు. రెండు పాటలు చాలా బాగున్నాయి. సినిమా విడుదలకు ముందే అవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సినిమాలో ఆ పాటలు చాలా బాగున్నాయి. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోనూ సినిమా స్థాయిని పెంచాడు. ఓవరాల్‌గా తమన్‌ అందించిన సంగీతం తెలుసు కదా కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు."},{"text":""},{"text":"సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను గ్రాండ్‌ గా చూపించడంలో సినిమాటోగ్రఫీ పని చేసింది. దర్శకురాలు నీరజ కోన స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త వినోదాన్ని జోడించి ఉంటే బాగుండేది. సినిమా సీరియస్ నోడ్‌ లో సాగినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది. ఆకట్టుకునే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమాలో ఉన్న ప్రతి నటీనటుడు ఔట్‌ ఫిట్‌ పాత్రకు తగ్గట్లుగా బాగున్నాయి."},{"text":""},{"text":"విశ్లేషణ :"},{"text":"స్టార్‌ బాయ్‌ సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన నటనతో మెప్పించాడు. కేవలం తాను మాత్రమే చేయగలను అన్నట్లుగా వరుణ్ పాత్రలో నటించి మెప్పించాడు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి చివరి వరకు పాత్ర నుంచి బయటకు రాకుండా ఆకట్టుకున్నాడు. ట్రైలర్‌ చూసిన సమయంలో వరుణ్‌ పాత్ర అంటే సిద్దు జొన్నలగడ్డను నెగటివ్‌ షేడ్స్‌ లో చూస్తామా అనిపించింది."},{"text":""},{"text":"కానీ సినిమాలో ఆయన పాత్ర ప్రతి కుర్రాడికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంది. మంచి ఎమోషనల్‌ సీన్స్ ఉన్నాయి, అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌, రెగ్యులర్‌ మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ సీన్స్ కోరుకున్న వారు మాత్రం కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. పక్కా కమర్షియల్‌ మూవీ అన్నట్లుగా లేదు. ఎమోషనల్‌ లవ్‌ కమ్‌ రొమాంటిక్ సీన్స్‌ లో సినిమా సాగింది. అందుకే సినిమా స్లోగా సాగింది అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా చూడదగ్గట్లుగా ఉంది."},{"text":""},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"సిద్దు జొన్నలగడ్డ,"},{"text":"తమన్ సంగీతం,"},{"text":"కొన్ని లవ్‌, రొమాంటిక్ సీన్స్‌"},{"text":""},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"సెకండ్‌ హాఫ్‌ లో స్లో కథనం,"},{"text":"రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేకపోవడం,"},{"text":"మెయిన్‌ లీడ్‌ కాకుండా ఇతర నటీనటులకు ప్రాధాన్యత లేదు"},{"text":""},{"text":"చివరగా.."},{"text":"ఈతరం యూత్‌ ఇష్టపడే రోమ్‌కామ్‌ మూవీ ఇది. జస్ట్‌ టైం పాస్‌కి చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్లవచ్చు."},{"text":""},{"text":"బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ"},{"text":""},{"text":"నిర్మాత : టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌"},{"text":""},{"text":"దర్శకత్వం : నీరజ కోన"},{"text":""},{"text":"సంగీతం : తమన్‌"},{"text":""},{"text":"తారాగణం : సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"149-indian-nationals-rescued-in-nepal-after-floods","data":{"third_party_url":null,"title":{"text":"149 Indian nationals rescued in Nepal after floods"},"img":{"url":"https://images.prismic.io/prad/g5C3QQcdGjpS2GX-_nepalfloods.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-08-30T13:32:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-telusu-kada---emotional-entertainment","tags":["politics"]}}