{"data":{"prismicReviewarticle":{"uid":"review-mad-square","tags":["politics"],"first_publication_date":"2025-03-28T16:39:26+0000","last_publication_date":"2025-03-29T10:26:50+0000","data":{"title":{"text":"'మ్యాడ్‌ స్క్వేర్‌' రివ్యూ... మరోసారి ఎంటర్‌టైన్మెంట్ జర్నీ"},"rating":2.25,"datetime":"2025-03-28T11:16:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/Z-bLWXdAxsiBwEX-_mad2.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=x9jlQ0_K5Zc","thumbnail_url":"https://i.ytimg.com/vi/x9jlQ0_K5Zc/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@SitharaEntertainments","title":"MAD Square - Official Trailer | Narne Nithiin, Sangeeth Shobhan, Ram Nitin | Kalyan Shankar"},"content":{"raw":[{"text":"చిన్న సినిమాగా వచ్చిన 'మ్యాడ్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మ్యూజికల్‌గా సూపర్ హిట్‌ కావడంతో పాటు, కామెడీతో మెప్పించారు. కథ ఏమీ లేకుండా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను సాగించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే సినిమాకు  మంచి వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా హిట్ అయిన సమయంలోనే సీక్వెల్‌ను తీయాలని 'మ్యాడ్‌ స్క్వేర్‌'ను ప్రకటించారు. ఈ సినిమాకు విపరీతంగా పబ్లిసిటీ చేశారు. మరి సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ :"},{"text":"మ్యాడ్‌లో చూపించినట్లుగా అశోక్‌(నార్నె నితిన్‌), డిడి(సంగీత్‌ శోభన్‌), మనోజ్‌(రామ్‌ నితిన్‌)లు స్నేహితులు. కాలేజ్‌ పూర్తి చేసుకున్న ఈ స్నేహితులు మూడు సంవత్సరాల తర్వాత మరో స్నేహితుడు లడ్డు పెళ్లి కోసం కలుస్తారు. ఈ ముగ్గురి తింగరి పనుల వల్ల లడ్డుతో పాటు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చిక్కుల్లో పడుతూ ఉంటారు. చివరకు లడ్డు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచి పోవడంతో పెళ్లి క్యాన్సల్‌ అవుతుంది. "},{"text":"పెళ్లి క్యాన్సల్‌ అయిన తర్వాత స్నేహితులు గోవాకు వెళ్తారు. అక్కడ అనుకోకుండా పెద్ద కేసులో చిక్కుకుంటారు. ఆ కేసు నుంచి వీళ్లు ఎలా బయట పడ్డారు? ఇంతకు లడ్డు పెళ్లి క్యాన్సల్‌ కావడం వెనుక ఉన్నది ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే."},{"text":"నటీనటుల నటన :"},{"text":"నార్నె నితిన్‌ మొదటి పార్ట్‌లో సీరియస్‌ రోల్‌లో కనిపించాడు. అయితే స్క్వేర్‌లో కామెడీతో మెప్పించాడు. కామెడీ టైమింగ్‌తోనూ అలరిస్తానని నిరూపించాడు. ముగ్గురు హీరోల్లో కామెడీ పరంగా డిడి పాత్రలో సంగీత్‌ శోభన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అతడి కోసం అయినా సినిమాకి వెళ్లవచ్చు అనే స్థాయిలో నటించాడు. సినిమాలో రామ్‌ నితిన్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది. ఉన్నంతలో పోటీ పడి నటించాడు అనడంలో సందేహం లేదు. "},{"text":"హీరోలుగా ముగ్గురు తమకు వచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశారు అనడంలో సందేహం లేదు. లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు సైతం హీరోలకు సమానంగా వినోదాన్ని పండించాడు. సునీల్‌ మరోసారి సీరియల్‌ రోల్‌లో మెప్పించాడు. కామెడీ టైమింగ్‌ సైతం బాగుంది."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"సినిమా ప్రమోషన్ సమయంలోనే పెద్దగా కథ గురించి ఎక్స్‌పెక్ట్ చేయవద్దని మేకర్స్‌ చెబుతూ వచ్చారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు. దర్శకుడు కళ్యాణ్‌ శంకర్‌ కేవలం కామెడీపై మాత్రమే ఫోకస్ పెట్టాడు. స్క్రీన్‌ ప్లే విషయంలో కామెడీతో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కథలో ఇంకాస్త స్ట్రాంగ్‌ పాయింట్‌ను తీసుకుని ఉంటే బాగుండేది. మొదటి పార్ట్‌ విషయంలో కథ గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఈసారి మాత్రం కథ గురించి ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉండాల్సింది అనిపిస్తుంది. "},{"text":"మొదటి పార్ట్‌తో పోలిస్తే పాటలు అంతగా అలరించలేక పోయాయి. స్వాతి రెడ్డి కాస్త పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ నాసిరకంగా ఉంది. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. కొన్ని చోట్ల సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి."},{"text":"విశ్లేషణ :"},{"text":"పూర్తి వినోదాత్మకంగా మ్యాడ్‌ స్క్వేర్‌ ఉంటుందని, వినోదం కోరుకునే వారు, రెండు గంటల పాటు నవ్వుతూ రిలాక్స్ కావాలని అనుకునే వారు తమ సినిమాకు రావాలి అంటూ మేకర్స్ మొదటి నుంచే చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంది. అయితే మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌లో వినోదం కాస్త తగ్గింది అనిపించింది. అంతే కాకుండా కొన్ని కామెడీ సీన్స్ అచ్చు గుద్దినట్లు మొదటి పార్ట్‌ నుంచి కాపీ చేశారు. "},{"text":"ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ లేక పోవడం మైనస్‌. ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్స్‌ను మొదటి పార్ట్‌లో పెట్టారు. కానీ ఈ పార్ట్‌లో పెద్దగా లవ్‌ అనే కాన్సెప్ట్‌ లేదు. దాంతో కాస్త బోర్‌ కొట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా వినోదం కోసం చూడాలి అనుకుంటే థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు."},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"కామెడీ,"},{"text":"ముగ్గురు హీరోల సందడి,"},{"text":"స్వాతిరెడ్డి సాంగ్‌."},{"text":"మైనస్‌ పాయింట్స్ :"},{"text":"కథ లేకపోవడం,"},{"text":"హీరోయిన్స్ లేకపోవడం,"},{"text":"ఎడిటింగ్‌లో లోపాలు,"},{"text":"మొదటి పార్ట్‌తో పోలిక"},{"text":"చివరగా..."},{"text":"కామెడీ జర్నీ కోసం కచ్చితంగా చూడవచ్చు"},{"text":"బ్యానర్ : సితార ఎంటర్‌టైన్మెంట్స్‌"},{"text":"నిర్మాత : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య"},{"text":"దర్శకత్వం : కళ్యాణ్ శంకర్‌"},{"text":"సంగీతం : భీమ్స్‌"},{"text":"తారాగణం : నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు, సత్యం రాజేష్‌, సునీల్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}},{"node":{"uid":"naga-babu-will-work-to-increase-aps-green-cover","data":{"third_party_url":null,"title":{"text":"Naga Babu: Will work to increase AP’s green cover"},"img":{"url":"https://images.prismic.io/prad/Wl2VUgXAO1Aw1-fq_NB.JPG?auto=format,compress&rect=0,60,450,222&w=2028&h=1000"},"datetime":"2026-08-28T09:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-mad-square","tags":["politics"]}}