{"data":{"prismicReviewarticle":{"uid":"review-mitramandali---comedy-less","tags":["politics"],"first_publication_date":"2025-10-16T11:31:26+0000","last_publication_date":"2025-10-17T08:38:52+0000","data":{"title":{"text":"'మిత్ర మండలి' రివ్యూ - నవ్వించలేక పోయిన కామెడీ"},"rating":1.5,"datetime":"2025-10-16T09:28:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aPDW4J5xUNkB2C7l_MITHRAMANDALIREVIEW.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=hGXMm4Cx6Po","thumbnail_url":"https://i.ytimg.com/vi/hGXMm4Cx6Po/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@adityamusic","title":"Mithra Mandali TRAILER | Priyadarshi, Niharika NM | Vijayendar S | RR Dhruvan | Bunny Vas"},"content":{"raw":[{"text":"ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మంచి స్పందన లభిస్తుంది, ఆ సినిమాల్లో కామెడీ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే మిత్ర మండలి సినిమా గురించి మొదటి నుంచి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాను బన్నీ వాసు సమర్పించేందుకు ముందుకు రావడంతో ఖచ్చితంగా కంటెంట్‌ ఉన్న సినిమా అనే అభిప్రాయం వ్యక్తం అయింది. కనుక సినిమా చూడాలని చాలా మంది అనుకున్నారు. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":""},{"text":"కథ :"},{"text":"కులం అంటే ప్రాణం ఇవ్వడానికి అయినా, తీయడానికి అయినా రెడీ అన్నంతగా కుల పిచ్చి ఉన్న నారాయణ (వీటీవీ గణేష్‌) కూతురు స్వేఛ్చ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. కులంలో పరువు పోతుందని, రాజకీయ జీవితం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో కూతురు బయటకు వెళ్లిన విషయం రహస్యంగా ఉంచుతాడు. అయితే తన కూతురు వెతకడానికి ఎస్సై సాగర్‌(వెన్నెల కిషోర్‌) కి పని అప్పజెప్పుతాడు. అతడు స్వేచ్చ పారిపోవడానికి నలుగురు కుర్రాళ్లు కారణం అని అనుమానిస్తాడు."},{"text":""},{"text":"ఆ నలుగురు కుర్రాళ్లు స్వేచ్చ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ. ఇంతకు స్వేచ్చ ఎటు వెళ్లి పోయింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే."},{"text":""},{"text":"నటీనటుల నటన :"},{"text":"ఈ సినిమాలో నటీనటులు చాలా మందే ఉన్నారు. వీటీవీ గణేష్‌ తన నటనతో నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్‌ తనదైన శైలిలో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. కానీ ఆయనది ఇందులో ఓవర్‌ యాక్షన్‌ అనిపించింది. వెన్నెల కిషోర్‌ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు."},{"text":""},{"text":"ప్రియదర్శి పాత్ర మెయిన్‌ లీడ్‌లా అనిపించినా కథలో ఆయన ప్రాధాన్యత అంతగా లేదనే చెప్పాలి. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో ఆయన పాత్ర నిరాశను కలిగించింది. పాత్రకు తగ్గట్లుగా నటించాడు."},{"text":""},{"text":"నిహారిక ఎన్‌ ఎం ఈ సినిమాలో కీలకంగా ఉంది. అయితే ఆమె నటన నేచురాలిటీకి దూరంగా ఉంది అనిపించింది. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు."},{"text":""},{"text":"టెక్నికల్‌ :"},{"text":"ఆర్‌ ఆర్ ధ్రువన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఒక పాట పర్వాలేదు, కొన్ని సీన్స్‌ లో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ పేలవంగా ఉండటంతో బోర్‌ అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. కొన్ని సీన్స్‌ సాగతీసినట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్‌ విషయంలో చాలా లోపాలు ఉన్నాయి."},{"text":""},{"text":"దర్శకుడు కథను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కామెడీ పండించడంలో విఫలం అయ్యాడు. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. మాటలు కొన్ని సీన్స్‌లో బాగున్నాయి. కొన్ని సీన్స్‌ లో పరమ రొటీన్‌గా ఉన్నాయి."},{"text":""},{"text":"విశ్లేషణ :"},{"text":"చిన్న సినిమాలకు మంచి ఆధరణ ఉంటుందని, కామెడీ సినిమాలతో వస్తే తప్పకుండా ఆకట్టుకుంటుందని భావించి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. కానీ కామెడీ సినిమాల పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కామెడీ లేకుండా సినిమాలను చేయడం ఏంటని ఈ సినిమాను చూస్తే అనిపిస్తుంది."},{"text":""},{"text":"ఒకటి రెండు సీన్స్‌ తప్ప ఎక్కడా ఆకట్టుకోలేక పోయారు. సినిమా స్టోరీ లైన్ బాగానే ఉంది. కానీ దాన్ని పూర్తి కథగా మార్చిన తీరు మాత్రం బాగాలేదు. ఓవరాల్‌గా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. నటీనటుల నటన బాగాలేదు, కథ ఏమాత్రం బాగాలేదు, అయినా కూడా కామెడీతో నెట్టుకు వస్తారు అనుకుంటే అది కూడా లేదు. కామెడీ లేకుండా కామెడీ సినిమాను చూసినట్లుగా అనిపించింది."},{"text":""},{"text":"ప్లస్‌ పాయింట్స్ :"},{"text":"సత్య కామెడీ తప్ప ఏమీ లేదు"},{"text":""},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"కథ, స్క్రీన్‌ ప్లే,"},{"text":"కామెడీ ఆశించిన స్థాయి లో లేకపోవడం,"},{"text":"సెకండ్‌ హాఫ్‌"},{"text":""},{"text":"చివరగా.."},{"text":"మిత్ర మండలిలో కామెడీ లోపించింది"},{"text":""},{"text":"బ్యానర్ : సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్"},{"text":""},{"text":"నిర్మాత : కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, బన్నీ వాసు"},{"text":""},{"text":"దర్శకత్వం : విజయేందర్‌"},{"text":""},{"text":"సంగీతం : ఆర్‌ ఆర్‌ ధ్రువన్‌"},{"text":""},{"text":"తారాగణం : ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, ప్రసాద్‌ బెహరా, వెన్నెల కిషోర్‌, సత్య, వీటీ గణేష్‌, విష్ణు ఓ ఐ, రాగ్‌ మయూర్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}},{"node":{"uid":"naga-babu-will-work-to-increase-aps-green-cover","data":{"third_party_url":null,"title":{"text":"Naga Babu: Will work to increase AP’s green cover"},"img":{"url":"https://images.prismic.io/prad/Wl2VUgXAO1Aw1-fq_NB.JPG?auto=format,compress&rect=0,60,450,222&w=2028&h=1000"},"datetime":"2026-08-28T09:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-mitramandali---comedy-less","tags":["politics"]}}