{"data":{"prismicReviewarticle":{"uid":"coolie-review---regular-revenge-drama","tags":["politics"],"first_publication_date":"2025-08-14T07:56:46+0000","last_publication_date":"2025-08-15T10:22:45+0000","data":{"title":{"text":"'కూలీ' రివ్యూ... రెగ్యులర్‌ రివేంజ్‌ డ్రామా"},"rating":2.75,"datetime":"2025-08-14T07:20:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aJ2Qj6Tt2nPbaTtw_coolie.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=l8qlUDRSaTU","thumbnail_url":"https://i.ytimg.com/vi/l8qlUDRSaTU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@GeminiTV","title":"Coolie - Official Telugu Trailer | Superstar Rajinikanth | Sun Pictures | Lokesh | Anirudh"},"content":{"raw":[{"text":"లోకేష్ కనగరాజ్‌ తనకంటూ ఒక యూనివర్స్‌ను క్రియేట్‌ చేసుకుని దానిలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌ను అందులో భాగం చేయడం ద్వారా ఎల్‌ సీ యూ యొక్క పరిధి పెరిగి పోతూనే ఉంది. ఖైదీ సినిమా మొదలుకుని లోకేష్ కనగరాజ్ సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు వెయిట్‌ చేసే విధంగా పరిస్థితి మారింది. విక్రమ్‌, లియో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే కూలీ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కూలీ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయం అనే విశ్వాసం అందరిలోనూ ఉంది. మరి ఆ స్థాయిలో కూలీ ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"కూలీ అయిన దేవా(రజనీకాంత్‌) కొన్ని కారణాల వల్ల తన సన్నిహితులతో కలిసి అజ్ఞాతంలో ఉంటాడు. సాదారణ జీవితం సాగిస్తున్న దేవా తన స్నేహితుడు రాజశేఖర్‌(సత్యరాజ్‌) చనిపోవడంతో ఆవేదన చెందుతాడు. "},{"text":"రాజశేఖర్‌ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనే విషయాలను కనుక్కునేందుకు గాను సైమన్‌(నాగార్జున) వద్ద చేరుతాడు. ఈ కథలో సైమన్ పాత్ర ఏంటి? ఇంతకు రాజశేఖర్‌ ను చంపింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోండి."},{"text":"నటీనటుల నటన : "},{"text":"సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు మీద పడుతున్నా కూడా ఆయన స్టైల్‌, యాక్టింగ్‌లో గ్రేస్ తగ్గలేదు. యాక్షన్‌ సీన్స్‌లో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఓవరాల్‌గా యాన మార్క్ మేనరిజంతో కూలీ సినిమాలో మెప్పించాడు. ఆకట్టుకునే స్టైల్‌తో పాటు, ఆయన స్టైల్‌ వాకింగ్‌ ఇలా అన్ని కూడా ఫ్యాన్స్‌ను మెప్పించే విధంగా ఉన్నాయి. సూపర్‌ స్టార్‌ హీరోగా కథను చక్కగా డ్రైవ్‌ చేశారు. "},{"text":"నాగార్జున కెరీర్‌లో మొదటి సారి ఈ తరహా పాత్రలో కనిపించారు. హీరోగా నటించడం కంటే నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అనేది కాస్త ఎక్కువ కష్టం అంటారు. నాగార్జున తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లుగా అనిపించలేదు. విలన్‌గా నటించడంలో నాగ్‌ కష్టపడ్డాడు. అయితే ఇది ఖచ్చితంగా కింగ్‌ ఫ్యాన్స్‌కి సంతృప్తిని కలిగించే పాత్ర అనడంలో సందేహం లేదు. "},{"text":"సౌబిన్ అద్భుతంగా నటించి మెప్పించాడు.  అతడిని తీసుకున్నందుకు నూటికి నూరు శాతం ప్రయోజనం చేకూరింది అనడంలో సందేహం లేదు. ఆయన ముందు ముందు మరిన్ని పెద్ద క్యారెక్టర్‌లను తమిళ్‌, తెలుగులో చేసే స్థాయిలో ఈ సినిమాలో నటించి మెప్పించాడు. "},{"text":"శృతి హాసన్‌ పాత్ర పరిధి తక్కువగానే ఉంది. ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. అమీర్ ఖాన్‌ కొద్ది సమయం ఉన్నప్పటికీ సినిమాపై తనదైన ముద్ర వేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో మెప్పించారు. "},{"text":"టెక్నికల్‌ : "},{"text":"సినిమా మొత్తం టెక్నికల్‌ అంశాల్లో అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆయన ఎప్పుడూ రజనీకాంత్‌ సినిమా అంటే ఊగి పోతాడు. ప్రేక్షకులను సైతం ఊపే విధంగా సినిమాకు సంగీతాన్ని ఇస్తాడు. లోకేష్ సినిమా అంటే కమర్షియల్‌ సాంగ్స్ ఉండవు. కానీ పట్టుబట్టి మోనిక పాట పెట్టించాడు. ఆ పాట సూపర్‌ హిట్‌ కావడంతో అనిరుధ్‌ నిర్ణయంకు వెయిట్‌ పెరిగింది. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రజనీకాంత్‌ సీన్స్‌ మాత్రమే కాకుండా అందరి సీన్స్‌ కి అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎంతో ఆ సీన్‌ స్థాయి రెండు మూడు రెట్లు పెరిగింది. అందుకే సినిమాకు ప్రధాన ఆకర్షణ అనిరుధ్ బీజీఎం అనడంలో సందేహం లేదు. "},{"text":"దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఎప్పటిలాగే సింపుల్‌ కథను తనదైన మార్క్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించిన తీరు బాగుంది. అందుకోసం ఆయన ఎంపిక చేసుకున్న నటీనటులు ఆయా పాత్రలకు మంచి న్యాయం చేశారు. ముఖ్యంగా సౌబిన్‌ ఎంపిక నిర్ణయంను అభినందించాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా స్పీడ్‌గా సినిమాను తీశారు. అయినా కూడా సినిమాటోగ్రపీ టెక్నిక్‌ కారణంగా సినిమా చాలా ఓపికతో తీసినట్లుగా అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. "},{"text":"విశ్లేషణ :"},{"text":"దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఒక రివేంజ్‌ డ్రామాను విభిన్నమైన స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో చూపించాలి అనుకున్నాడు. అయితే ఆ క్రమంలో ఆయన కొన్ని విషయాల పట్ల శ్రద్ద కనబర్చలేదు. ముఖ్యంగా రజనీకాంత్‌ పాత్ర విషయంలో చూపించిన శ్రద్ద ఇతర పాత్రల విషయంలోనూ చూపించాల్సి ఉంది. నాగార్జున ఎంపిక ను అంతా కూడా అభినందిస్తారు అని అనుకున్నారు. కానీ నాగ్‌ నటన కారణంగానో లేదా ఆ పాత్ర కారణంగానో ఆ ప్రశంసలు దక్కడం సాధ్యం కాదు. ఎందుకంటే నాగార్జునను మొదటి సారి నెగటివ్‌ షేడ్స్‌ లో చూపించడం అంటే ఖచ్చితంగా పెద్ద సాహసం. ఆ సాహసం చేసే సమయంలో నాగార్జున పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాముఖ్యత అయితే ఉంది కానీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఆ పాత్ర లేదు అని చెప్పక తప్పదు. సౌబిన్‌ పాత్ర పూర్తిగా డామినేట్‌ చేసే విధంగా ఉంది. "},{"text":"సినిమాలో సౌబిన్‌ పాత్ర బాగుండటంతో పాటు, ఆ పాత్రలో నటించిన సౌబిన్‌ కూడా చక్కగా నటించాడు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రజనీకాంత్‌ సినిమాలకు ప్రాణం పెట్టి పని చేస్తాడు అని మరోసారి నిరూపితం అయింది. మోనికా పాట సినిమాకు ఒక హైప్ ఇచ్చింది. అంతే కాకుండా సౌబిన్ పాత్రను కూడా పెంచే విధంగా ఉంది. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాఫీగా సాగింది. సెకండ్‌ హాఫ్ కాస్త స్లో అయింది. ఓవరాల్‌గా సినిమా చూడదగ్గట్లుగానే ఉంది. "},{"text":"ప్లస్‌ పాయింట్స్ :"},{"text":"అనిరుధ్‌ రవిచంద్రన్‌,"},{"text":"రజనీకాంత్‌, సౌబిన్‌,"},{"text":"లోకేష్ కనగరాజ్‌ స్క్రీన్‌ ప్లే"},{"text":"మైనస్ : "},{"text":"కొన్ని లాజిక్ లేని సీన్స్‌,"},{"text":"తమిళ ఫ్లేవర్‌,"},{"text":"నాగార్జున పాత్ర"},{"text":"చివరగా.."},{"text":"భారీ స్టార్‌ కాస్ట్‌ను వినియోగించుకోలేక పోయిన దర్శకుడు"},{"text":"బ్యానర్ : సన్‌ పిక్చర్స్‌"},{"text":"నిర్మాత : కళానిధి మారన్‌"},{"text":"దర్శకత్వం : లోకేష్ కనగరాజ్‌"},{"text":"సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌"},{"text":"తారాగణం : రజనీకాంత్‌, నాగార్జున, సౌబిన్‌, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌, పూజా హెగ్డే, సత్యరాజ్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-student-wing-stages-protest-over-mp-suryas-remarks","data":{"third_party_url":null,"title":{"text":"BRS student wing stages protest over MP Surya’s remarks"},"img":{"url":"https://images.prismic.io/prad/aeIG9Z1ZCF7ETSSI_BRSStudentwing.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-17T08:10:00+0000"}}},{"node":{"uid":"gautam-adani-becomes-asias-richest-person","data":{"third_party_url":null,"title":{"text":"Gautam Adani becomes Asia’s richest"},"img":{"url":"https://images.prismic.io/prad/Z02IxpbqstJ978If_adani.JPG?auto=format,compress"},"datetime":"2026-04-17T05:51:00+0000"}}},{"node":{"uid":"amit-shahs-firm-stance-no-religious-reservations-for-muslims-mo2pi22d","data":{"third_party_url":null,"title":{"text":"Amit Shah: No Religious Reservations for Muslims"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9a998da1-ed74-4d1d-bf5c-3ce42a2986be_amit+shah.jpg?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-04-16T19:29:00+0000"}}},{"node":{"uid":"bengaluru-businessmans-honeytrap-nightmare-blackmailed-after-instagram-encounter-mo2pi7w3","data":{"third_party_url":null,"title":{"text":"Businessman’s Honeytrap Nightmare"},"img":{"url":"https://images.prismic.io/prad/c8335006-73f0-4db2-9b9f-f9d6f0421a05_love+is+blind.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T18:30:00+0000"}}},{"node":{"uid":"ysr-congress-leader-released-on-bail","data":{"third_party_url":null,"title":{"text":"YSR Congress leader released on bail"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7216aea1-016a-4612-8cd4-886237641335_ysrcp.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:39:00+0000"}}},{"node":{"uid":"tvk-manifesto-welfare-ai-1.5t-goal","data":{"third_party_url":null,"title":{"text":"TVK Manifesto: Welfare, AI, $1.5T Goal"},"img":{"url":"https://images.prismic.io/prad/aeEUw51ZCF7ETQr3_vijaytvk.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:15:00+0000"}}},{"node":{"uid":"from-now-onwards-nari-shakti-will-not-be-just-a-slogan","data":{"third_party_url":null,"title":{"text":"From now onwards, Nari Shakti will not be just a slogan"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T07:30:00+0000"}}},{"node":{"uid":"infosys-denies-pune-harassment-claims","data":{"third_party_url":null,"title":{"text":"Infosys Denies Pune Harassment Claims"},"img":{"url":"https://images.prismic.io/prad/7766529c-412f-4d9a-a068-c32a77895fee_infosys.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T06:06:00+0000"}}},{"node":{"uid":"case-filed-against-vijay","data":{"third_party_url":null,"title":{"text":"Case filed against Vijay"},"img":{"url":"https://images.prismic.io/prad/aPPHEJ5xUNkB2HoK_vijay.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T05:30:00+0000"}}},{"node":{"uid":"pichai-ranbir-in-times-100-most-influential-people-of-2026","data":{"third_party_url":null,"title":{"text":"Pichai, Ranbir in TIME's '100 Most Influential'"},"img":{"url":"https://images.prismic.io/prad/aeC5qZ1ZCF7ETPhc_pichairanbir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T05:28:00+0000"}}},{"node":{"uid":"madras-hc-orders-i-t-probe-on-udhayanidhi-assets","data":{"third_party_url":null,"title":{"text":"Court Orders Probe on Udhayanidhi Assets"},"img":{"url":"https://images.prismic.io/prad/5eb52f79-f1fb-4224-8660-30b6f9452808_udhanidhi+stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-04-15T08:13:00+0000"}}},{"node":{"uid":"lokesh-elevated-as-national-wp-of-tdp","data":{"third_party_url":null,"title":{"text":"Lokesh elevated as national WP of TDP"},"img":{"url":"https://images.prismic.io/prad/Z4vnQ5bqstJ99mOE_lokesh.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-15T07:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"coolie-review---regular-revenge-drama","tags":["politics"]}}