{"data":{"prismicReviewarticle":{"uid":"review-guntur-kaarum","tags":["politics"],"first_publication_date":"2024-01-12T10:40:37+0000","last_publication_date":"2024-01-13T09:53:02+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘గుంటూరు కారం’"},"rating":2.5,"datetime":"2024-01-12T19:20:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ebb3c14d-2c08-4d7d-8b2f-90ebf0630187_Guntur+Karam.JPG?auto=compress,format&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=DYLG65xz55U","thumbnail_url":"https://i.ytimg.com/vi/DYLG65xz55U/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@HaarikaHassine","title":"Guntur Kaaram Theatrical Trailer | Mahesh Babu, Sreeleela | Trivikram | Thaman"},"content":{"raw":[{"text":"కథ: వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరామ్) కుమారుడు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు). తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోతారు. తల్లి వసుంధర రెండో పెళ్లి చేసుకుని తెలంగాణలో సెటిలవుతుంది. తండ్రి రాయల్ సత్యం ఓ కేసులో జైలు కెళతాడు. దీంతో రమణ తన మేనత్త (ఈశ్వరీరావు) వద్ద పెరుగుతాడు. గుంటూరులో మిర్చి బిజినెస్ చేసే రమణకు తనను వదిలి వెళ్లిపోయిన తల్లిపై చిన్నతనం నుంచి ద్వేషంతో పెరుగుతాడు. "},{"text":"కట్ చేస్తే వసుంధర తెలంగాణలో న్యాయ శాఖ మంత్రిగా ఎన్నికవుతుంది. ఆమె రాజకీయ జీవితానికి మొదటి భర్త, కొడుకు ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావించిన తాతయ్య వైరా వెంకటస్వామి(ప్రకాష్ రాజ్) వీరితో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి అగ్రిమెంటుపై రమణ సంతకం పెట్టాడా? రమణ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏమిటి? వసుంధర కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? తల్లి, కొడుకుల బంధం చివరకు ఎలాంటి మలుపు తిరిగింది లాంటి అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. "},{"text":"సినిమా ఎలా ఉందంటే... "},{"text":"సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే మనకు తెలిసిన కథలనే, తెలిసిన పాత్రలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తనదైన శైలి స్క్రీన్ ప్లే రైటింగ్, భావోద్వేగాలు, డైలాగులు జోడించి ప్రేక్షుకలకు కొత్త అనుభూతి కలిగిస్తాడు. అయితే ‘గుంటూరు కారం’లో మాత్రం కొత్తదనం మిస్సయిన భావన కలుగుతుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో మూవీలోని షేడ్స్ ఈ చిత్రంలో కనిపించినట్లు అనిపిస్తుంది."},{"text":"త్రివిక్రమ్ స్థాయిలో సినిమాలోని పాత్రలు, భావోద్వేగాలు ఎలివేట్ కాలేదు. కథకు అంతగా అతకని కామోడీ, కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. సినిమాలో మహేష్ బాబు, రమ్యకృష్ణ పాత్రల్లో తప్ప ఇతర పాత్రల్లో బలం ఉన్నట్లు కనిపించదు. "},{"text":"పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.."},{"text":"రమణ పాత్రలో మహేష్ బాబు ఎనర్జిటిక్ గా నటించాడు. మదర్ సెంటిమెంటులో భావోద్వేగాలు పండించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా డాన్స్ అదరగొట్టాడు. మహేష్ బాబు పెర్పార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అనే స్థాయిలో అదరగొట్టాడు. "},{"text":"శ్రీలీల పాత్రను కొన్ని వినోదాత్మక సన్నివేశాలు, డాన్స్ పార్టుకే పరిమితం చేశారు. ఆమె డాన్స్ సూపర్బ్. మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తల్లిగా రమ్యకృష్ణ పాత్ర హుందాగా ఉంది. ప్రకాష్ రాజ్, జయరామ్, వెన్నోల కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్ వారి పాత్రలకు న్యాయం చేశారు. "},{"text":"ప్లస్ పాయింట్స్..."},{"text":"మహేష్ బాబు పాత్రను తీర్చి దిద్దిన విధానం. "},{"text":"మహేష్ బాబు, శ్రీలీల మాస్ డాన్స్ పెర్ఫార్మెన్స్"},{"text":"మైనస్ పాయింట్స్..."},{"text":"కొత్తదనం లేని కథ, ఆకట్టుకోని కథనం"},{"text":"ప్రేక్షుకులు ఊహించే త్రివిక్రమ్ ఔట్ పుట్ లేక పోవడం"},{"text":"చివరగా..."},{"text":"మహేష్-త్రివిక్రమ్ కాంబో స్థాయిని అందుకోలేదు కానీ మహేష్ బాబు అభిమానులను మెప్పించే మాస్ ఎలిమెంట్స్ డాన్సులు, కామెడీ ఉంది. "},{"text":"దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్"},{"text":"నిర్మాత: ఎస్. రాధా కృష్ణ"},{"text":"సంగీత దర్శకుడు: థమన్ ఎస్"},{"text":"నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు. రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-guntur-kaarum","tags":["politics"]}}