{"data":{"prismicReviewarticle":{"uid":"review-sankranthiki-vasthunnaam--family-entertainer","tags":["politics"],"first_publication_date":"2025-01-14T09:28:16+0000","last_publication_date":"2025-01-15T15:48:47+0000","data":{"title":{"text":"'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌"},"rating":2.75,"datetime":"2025-01-14T19:25:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/Z4YoY5bqstJ99aZC_SVM.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=yCkl2Z3PBs0","thumbnail_url":"https://i.ytimg.com/vi/yCkl2Z3PBs0/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@dilraju","title":"Sankranthiki Vasthunam Trailer - Victory Venkatesh | Anil Ravipudi | Dil Raju | Bheems Ceciroleo"},"content":{"raw":[{"text":"సంక్రాంతి సీజన్‌లో చివరగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు అనిల్‌ రావిపూడి విభిన్నమైన ప్రమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లోకి బాగా ఎక్కించేశాడు. దాంతో బుకింగ్స్ ఏ స్థాయిలో జరిగాయో మనం తెల్సిందే. అనిల్ రావిపూడి వరుస విజయాలతో జోష్ మీద ఉన్నాడు. కనుక ఈ సినిమాతో విజయం ఖాయం అని అంతా అనుకున్నారు. మరి సినిమా పండక్కి హిట్ కొట్టే స్థాయిలో ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన రాజు(వెంకటేష్‌) వరుస సస్పెండ్‌లతో విసిగి పోయి ఉద్యోగాన్ని మానేస్తాడు. ఒక మారుమూల పల్లెటూరుకు వెళ్లి భాగ్యం(ఐశ్వర్య రాజేష్‌)ని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలను కని జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక హై ప్రొఫైల్‌ వ్యక్తి కిడ్నాప్‌ అవుతాడు. కిడ్నాప్ కేసును సీక్రెట్‌గా డీల్ చేసేందుకు గాను పోలీస్‌ ఆఫీసర్‌ మీనాక్షి(మీనాక్షి చౌదరి) రంగంలోకి దిగుతుంది. అయితే ఆమెకు తోడు రాజు ఉంటే కేసు మరింత ఈజీగా సింపుల్‌గా సాల్వ్‌ అవుతుందని ముఖ్యమంత్రి సహా ఉన్నతాధికారులు భావిస్తారు. డ్యూటీ మానేసి ఫ్యామిలీ మ్యాన్‌గా మారిన రాజును ఈ ఆపరేషన్‌లోకి ఎలా తీసుకు వచ్చారు. "},{"text":"మాజీ లవర్‌ అయిన మీనాక్షితో రాజును పంపించేందుకు భాగ్యం ఒప్పుకోదు. ఆపరేషన్‌కి తాను వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? భార్య, మాజీ ప్రియురాలి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు? ఇంతకు ఆ వ్యక్తి కిడ్నాప్‌కి కారణం ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. "},{"text":"నటీనటుల నటన:"},{"text":"వెంకటేష్ ఇలాంటి పాత్రలు గతంలో ఎన్నో చేశారు. ఎఫ్ 2 సినిమాలో ఆయన పోషించిన తరహా పాత్రే ఇది. మరోసారి భర్తగా జీవించేశాడు. కొన్ని సన్నివేశాల్లో ఘర్షణలో కనిపించిన పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేష్ కనిపించారు. తన కామెడీ టైమింగ్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో భార్య, మాజీ ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ నటించి మెప్పించాడు. రాజు పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు అనడంలో సందేహం లేదు. "},{"text":"భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ ఆకట్టుకుంది. అమాయకపు, గడుసు భార్య పాత్రలో ఆమె నటన చాలా నేచురల్‌గా ఉంది. ఆమె లుక్‌ సైతం చక్కగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ నటన సినిమాకు ప్లస్‌గా నిలిచింది. మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా భలే సెట్‌ అయ్యింది. ఒక యాక్షన్‌ సన్నివేశంలోనూ నటించి క్లాప్స్‌ కొట్టించుకుంది. పోలీస్‌ యూనిఫార్మ్‌లో ఫిట్‌గా, పోలీస్‌ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంది.  మొత్తంగా మీను పాత్రలో మీనాక్షి చౌదరి మెప్పించింది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు అంతా నవ్వించారు. ముఖ్యంగా రాజు, భాగ్యం కొడుకు పాత్రలో నటించిన బుడ్డోడికి మంచి ఫ్యూచర్‌ ఉంది. రాబోయే రోజుల్లో ఎక్కువ సినిమాల్లో ఆ బుడ్డోడు కనిపించడం ఖాయం. "},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి పూర్తిగా కామెడీపై ఆధారపడ్డాడు. కథ విషయంలో ఇంకాస్త ఎక్కువ వర్క్ చేయాల్సింది. కథలో బలం లేదు. అయితే స్క్రీన్‌ ప్లేతో కథ గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలోని ప్రతి కామెడీ డైలాగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. "},{"text":"భీమ్స్ అందించిన సంగీతం సినిమాను మరో లెవల్‌కి తీసుకు వెళ్లింది. పాటలు మాత్రమే కాకుండా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సైతం సన్నివేశలకు తగ్గట్లుగా ఉంది. ఓవర్‌గా అనిపించకుండా, నిద్ర పోయినట్లుగా కాకుండా సింపుల్‌గా కామెడీ సన్నివేశాలకు తగ్గట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పల్లెటూరు సన్నివేశాలను కంటికి ఇంపుగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌ లో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో సన్నివేశాల విషయంలో ఇంకాస్త సీరియస్‌నెస్‌ ఉండాల్సింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. "},{"text":"విశ్లేషణ :"},{"text":"సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, తన బ్యానర్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ వంటి పెద్ద సినిమా రాబోతుంది. కనుక విడుదల వాయిదా వేద్దాం అని చెప్పినా దర్శకుడు అనిల్‌ రావిపూడి వినిపించుకోలేదు అనే ప్రచారం జరిగింది. అలా వినిపించుకోకుండా పండుగకి రావడం అది సంక్రాంతి పండుగకి రావడం చాలా ప్లస్ అయ్యే విషయం. సినిమాను ఒక పండుగ అనుకునే వారికి ఈ సినిమా నిజంగానే పండుగ వాతావరణం తెచ్చే విధంగా ఉంది. "},{"text":"సగటు ఫ్యామిలీ ఆడియన్స్‌ యాక్షన్‌, థ్రిల్లర్‌ కాకుండా ఎంటర్‌టైన్మెంట్‌ను కోరుకుంటారు. ఆ వినోదం ఈ సినిమాలో కావాల్సినంత ఉంది. లాజీక్‌లు లేకుండా హాయిగా నవ్వుకోవడం కోసం సినిమాను చూసేందుకు వెళ్తే నూటికి నూరు శాతం సంతృప్తి చెందుతారు. కథ ఏంటి, లాజిక్‌లు లేవు అనుకుంటే నిరుత్సాహం తప్పదు. అంటే కేవలం వినోదం కోసం కథను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర విషయాలను పట్టించుకోకుండా వెళ్లే ప్రేక్షకులకు సంక్రాంతికి వస్తున్నాం బాగానే ఎక్కే అవకాశాలు ఉన్నాయి. "},{"text":"ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు యూత్‌ ఆడియన్స్‌కి అక్కడ అక్కడ కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలు ఉంటాయి. దర్శకుడు అనిల్‌ రావిపూడి కథ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. అలాగే సెకండ్‌ హాఫ్‌లోనూ సినిమాను మరింత వినోదాత్మకంగా తీసుకు వెళ్లాల్సింది. ఫస్ట్‌ హాఫ్‌లో ఆకట్టుకున్న కామెడీ సెకండ్‌ హాఫ్‌కి కాస్త తగ్గింది. మొత్తంగా ఒక మంచి వినోదాల విందును దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాతో అందించాడని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి తగ్గ సినిమా అనడంలో సందేహం లేదు. ఈ సంక్రాంతి విజేత ఎవరు అనేది వసూళ్లను బట్టి మరో వారం రోజుల్లో క్లారిటీ రావచ్చు."},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"కామెడీ సీన్స్‌,"},{"text":"వెంకటేష్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి యాక్టింగ్‌,"},{"text":"పాటలు"},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"వీక్‌ స్టోరీ,"},{"text":"లాజిక్‌ లేని సీన్స్‌."},{"text":"చివరగా..."},{"text":"'సంక్రాంతికి వస్తున్నాం' పండక్కి తగ్గ ఒక మంచి వినోదాత్మక సినిమా. "},{"text":"బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌"},{"text":"నిర్మాత : శిరీష్‌"},{"text":"సమర్పణ : దిల్ రాజు"},{"text":"దర్శకుడు : అనిల్ రావిపూడి"},{"text":"సంగీతం : భీమ్స్ సిసిరోలియో"},{"text":"తారాగణం : వెంకటేష్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, నరేష్‌, ఉపేంద్ర లిమాయే, వీటీ గణేష్‌, శ్రీనివాస్ అవసరాల, సాయి కుమార్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"149-indian-nationals-rescued-in-nepal-after-floods","data":{"third_party_url":null,"title":{"text":"149 Indian nationals rescued in Nepal after floods"},"img":{"url":"https://images.prismic.io/prad/g5C3QQcdGjpS2GX-_nepalfloods.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-08-30T13:32:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-sankranthiki-vasthunnaam--family-entertainer","tags":["politics"]}}