{"data":{"prismicReviewarticle":{"uid":"review-hit-3---nani-blood-shed","tags":["politics"],"first_publication_date":"2025-05-01T08:55:56+0000","last_publication_date":"2025-05-02T09:17:23+0000","data":{"title":{"text":"'హిట్‌ 3' రివ్యూ... నేచురల్ స్టార్‌ రక్తపాతం"},"rating":2.5,"datetime":"2025-05-01T08:37:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aBM0hfIqRLdaByBa_hitreview.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=kAtfaaUgDRU","thumbnail_url":"https://i.ytimg.com/vi/kAtfaaUgDRU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@WallPosterCinemaOfficial","title":"HIT 3 Telugu Trailer | Nani | Sailesh Kolanu | Srinidhi Shetty | In Cinemas May 1st"},"content":{"raw":[{"text":"హిట్‌ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. పైగా మొదటి రెండు సినిమాలతో పోల్చితే స్టార్‌ కాస్ట్‌ పెరగడంతో పాటు బడ్జెట్‌ను పెంచారు. నాని హిట్‌ 3 లో జాయిన్‌ అవుతున్నాడనే ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే టీజర్‌, పోస్టర్స్‌ ఉన్నాయి. ప్రమోషన్స్‌ ను సైతం చాలా యాక్టివ్‌గా చేయడంతో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ :"},{"text":"అర్జున్‌ సర్కార్‌(నాని) పోలీస్ ఆఫీసర్‌. ఆయన విధులు నిర్వర్తిస్తున్న ఏరియాలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య చాలా విభిన్నంగా జరుగుతుంది. మనిషిని తలకిందులుగా వేలాడదీసి, అత్యంత క్రూరంగా, కిరాతకంగా హత్య చేస్తారు. అలాంటి హత్యలే దేశంలో చాలా జరిగినట్లు అర్జున్ గుర్తిస్తాడు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఒకరికొకరు సంబంధం లేకుండా అంతా ఒకేలా ఎలా హత్యలు చేస్తున్నారని తెలుసుకునేందుకు అర్జున్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తాడు. "},{"text":"ఆ క్రమంలో దాని వెనుక చాలా సైకో టీం కి సంబంధించి పెద్ద వ్యవహారం నడుస్తుందని అర్జున్‌కి తెలుస్తుంది. ఈ సైకో కిల్లింగ్స్‌ను ఎలా అర్జున్‌ సర్కార్‌ ఆపుతాడు? అందుకోసం అతడు ఎంపిక చేసుకున్న మార్గం ఏంటి? అనేది సినిమా కథ."},{"text":"నటినటుల నటన :"},{"text":"నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు. క్లాస్ నటుడు అనే ట్యాగ్‌ లైన్‌ నుంచి నాని మరోసారి ఈ సినిమాతో బయటకు వచ్చినట్లు అనిపించింది. దసరా సినిమాలో నాని నటన బాబోయ్ అనిపిస్తే ఈ సినిమాలో అంతకు మించి ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో, అగ్రెసివ్‌ యాక్టింగ్‌తో మెప్పించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోశాడు. సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా బాగుంది."},{"text":"శ్రీనిధి శెట్టి స్క్రీన్‌ ప్రజెన్స్‌ కొంతే ఉన్నా కూడా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించడంతో ఆకట్టుకుంది. ఆమె లుక్స్ పరంగా మెప్పించింది. పోలీస్ ఆఫీసర్‌గానూ మెప్పించింది. మొత్తానికి నానికి జోడీగా, తెలుగులో మరో మంచి హీరోయిన్‌గా శ్రీనిధి నిలిచింది. "},{"text":"అర్జున్‌ సర్కార్‌ తండ్రి పాత్రలో సముద్ర ఖని పాత్ర పరిమిత స్థాయిలో ఉంది. ఉన్నంతలో ఆయన పర్వాలేదు అనిపించాడు. సినిమాలో విలన్‌ పాత్రకు ఇంకాస్త బెటర్‌ నటుడిని తీసుకుని ఉంటే బాగుండేది. అడవి శేష్‌, కార్తీల గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు శైలేష్‌ కొలను మరో సీరియస్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత రెండు కేసులతో పోల్చితే ఈ కేసు పరిధి మరింత పెద్దగా ఉంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త నిరాశ పరిచాడు. ఫస్ట్‌ హాఫ్ కథ చాలా స్లోగా సాగుతుంది. అంతే కాకుండా సెకండ్‌ హాఫ్‌లోనూ స్క్రీన్‌ ప్లే విషయంలో లూప్ హోల్స్‌ ఉన్నాయి. దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్‌ పై మరింత పట్టు సారించి ఉంటే బాగుండేది. "},{"text":"మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. యాక్షన్‌ సీన్స్‌తో పాటు, పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో నటించి మెప్పించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. పలు ఛేజింగ్‌ సీన్స్‌కి సంబంధించిన డ్రోన్ షాట్స్ బాగున్నాయి. మొత్తంగా సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి."},{"text":"విశ్లేషణ :"},{"text":"ఏదైనా ఒక క్రైమ్‌ జరిగినప్పుడు దాన్ని సాల్వ్‌ చేయడాన్ని ఎంత ఆసక్తికరంగా చూపించినప్పటికీ, ఆ క్రైమ్‌ వెనుక ఉద్దేశంను కన్విన్స్ చేసే విధంగా చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలోని క్రైమ్‌ ఉద్దేశంను ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా దర్శకుడు చెప్పడం లో విఫలం అయ్యారు. యాక్షన్ సీన్స్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పలు అంశాలు ఆకట్టుకున్నాయి. కానీ మెయిన్‌ స్టోరీ లైన్‌, స్క్రీన్‌ ప్లే విషయంలో కాస్త అసంతృప్తి తప్పదు. "},{"text":"నాని మొత్తంగా బాధ్యత తన మీద వేసుకుని కథను ముందుకు తీసుకు వచ్చాడు. ఆయన నటన, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నాని ని చూశారు. నాని ఎఫర్ట్‌కి తగ్గట్లుగా స్క్రీన్‌ ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉండి, క్రైమ్‌ ను ఇంకాస్త విభిన్నంగా చూపించి ఉంటే కచ్చితంగా మరో లెవల్‌లో ఉండేది. యాక్షన్‌ సీన్స్ శృతి మించినప్పటికీ వాటిని ఇష్టపడే వారికి నచ్చుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వైల్డ్‌ యాక్షన్ సినిమాలకు హిట్‌ 3 ఏమాత్రం తీసిపోదు."},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"నాని,"},{"text":"మ్యూజిక్‌,"},{"text":"శ్రీనిధి శెట్టి."},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"స్క్రీన్‌ ప్లే,"},{"text":"స్లో కథనం,"},{"text":"శృతి మించిన రక్తపాతం."},{"text":"చివరగా.."},{"text":"నాని ఫ్యాన్స్‌కి 'హిట్‌' కానీ, రెగ్యులర్‌ ఆడియన్స్‌ బేజారు."},{"text":"బ్యానర్ : వాల్‌ పోస్టర్‌ సినిమా"},{"text":"నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని"},{"text":"దర్శకత్వం : శైలేష్ కొలను"},{"text":"సంగీతం : మిక్కీ జె. మేయర్"},{"text":"తారాగణం : నాని, శ్రీనిధి శెట్టి, సముద్రఖని, రావు రమేష్‌, అడవి శేష్‌, కార్తీ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-student-wing-stages-protest-over-mp-suryas-remarks","data":{"third_party_url":null,"title":{"text":"BRS student wing stages protest over MP Surya’s remarks"},"img":{"url":"https://images.prismic.io/prad/aeIG9Z1ZCF7ETSSI_BRSStudentwing.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-17T08:10:00+0000"}}},{"node":{"uid":"gautam-adani-becomes-asias-richest-person","data":{"third_party_url":null,"title":{"text":"Gautam Adani becomes Asia’s richest"},"img":{"url":"https://images.prismic.io/prad/Z02IxpbqstJ978If_adani.JPG?auto=format,compress"},"datetime":"2026-04-17T05:51:00+0000"}}},{"node":{"uid":"amit-shahs-firm-stance-no-religious-reservations-for-muslims-mo2pi22d","data":{"third_party_url":null,"title":{"text":"Amit Shah: No Religious Reservations for Muslims"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9a998da1-ed74-4d1d-bf5c-3ce42a2986be_amit+shah.jpg?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-04-16T19:29:00+0000"}}},{"node":{"uid":"bengaluru-businessmans-honeytrap-nightmare-blackmailed-after-instagram-encounter-mo2pi7w3","data":{"third_party_url":null,"title":{"text":"Businessman’s Honeytrap Nightmare"},"img":{"url":"https://images.prismic.io/prad/c8335006-73f0-4db2-9b9f-f9d6f0421a05_love+is+blind.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T18:30:00+0000"}}},{"node":{"uid":"ysr-congress-leader-released-on-bail","data":{"third_party_url":null,"title":{"text":"YSR Congress leader released on bail"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7216aea1-016a-4612-8cd4-886237641335_ysrcp.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:39:00+0000"}}},{"node":{"uid":"tvk-manifesto-welfare-ai-1.5t-goal","data":{"third_party_url":null,"title":{"text":"TVK Manifesto: Welfare, AI, $1.5T Goal"},"img":{"url":"https://images.prismic.io/prad/aeEUw51ZCF7ETQr3_vijaytvk.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:15:00+0000"}}},{"node":{"uid":"from-now-onwards-nari-shakti-will-not-be-just-a-slogan","data":{"third_party_url":null,"title":{"text":"From now onwards, Nari Shakti will not be just a slogan"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T07:30:00+0000"}}},{"node":{"uid":"infosys-denies-pune-harassment-claims","data":{"third_party_url":null,"title":{"text":"Infosys Denies Pune Harassment Claims"},"img":{"url":"https://images.prismic.io/prad/7766529c-412f-4d9a-a068-c32a77895fee_infosys.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T06:06:00+0000"}}},{"node":{"uid":"case-filed-against-vijay","data":{"third_party_url":null,"title":{"text":"Case filed against Vijay"},"img":{"url":"https://images.prismic.io/prad/aPPHEJ5xUNkB2HoK_vijay.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T05:30:00+0000"}}},{"node":{"uid":"pichai-ranbir-in-times-100-most-influential-people-of-2026","data":{"third_party_url":null,"title":{"text":"Pichai, Ranbir in TIME's '100 Most Influential'"},"img":{"url":"https://images.prismic.io/prad/aeC5qZ1ZCF7ETPhc_pichairanbir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T05:28:00+0000"}}},{"node":{"uid":"madras-hc-orders-i-t-probe-on-udhayanidhi-assets","data":{"third_party_url":null,"title":{"text":"Court Orders Probe on Udhayanidhi Assets"},"img":{"url":"https://images.prismic.io/prad/5eb52f79-f1fb-4224-8660-30b6f9452808_udhanidhi+stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-04-15T08:13:00+0000"}}},{"node":{"uid":"lokesh-elevated-as-national-wp-of-tdp","data":{"third_party_url":null,"title":{"text":"Lokesh elevated as national WP of TDP"},"img":{"url":"https://images.prismic.io/prad/Z4vnQ5bqstJ99mOE_lokesh.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-15T07:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-hit-3---nani-blood-shed","tags":["politics"]}}