{"data":{"prismicReviewarticle":{"uid":"review-saripoda-sanivaaram","tags":["politics"],"first_publication_date":"2024-08-29T09:30:56+0000","last_publication_date":"2024-08-30T13:03:40+0000","data":{"title":{"text":"రివ్యూ: 'సరిపోదా శనివారం'"},"rating":2.75,"datetime":"2024-08-29T19:25:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZtE39EaF0TcGJi6y_saripoda.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=dkx07ZvjKE4","thumbnail_url":"https://i.ytimg.com/vi/dkx07ZvjKE4/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@DVVMovies","title":"SARIPODHAA SANIVAARAM Trailer - Nani | Priyanka | SJ Suryah | Vivek Athreya | DVV Danayya"},"content":{"raw":[{"text":"'హాయ్‌ నాన్న' సినిమాతో హిట్ కొట్టిన నాని ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని ఇంతకు ముందు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో మరోసారి వివేక్ ఆత్రేయ పై నమ్మకంతో నాని ఈ సినిమాను చేశాడు. నాని ప్రమోషన్ సమయంలో కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పాడు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? నాని కి మరో హిట్‌ పడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"చిన్నతనం నుంచి సూర్య(నాని) కి కోపం ఎక్కువ. అతడు తన కోపంను వారం మొత్తంలో ఒక్క రోజు మాత్రమే అది శనివారం మాత్రమే చూపించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల పెద్ద అయిన తర్వాత కూడా శనివారం మాత్రమే సూర్య కోపాన్ని ప్రదర్శించడం, మిగిలిన రోజుల్లో నార్మల్‌ గా ఉండాల్సి ఉంటుంది. "},{"text":"సూర్య జీవితం శనివారం కోపంతో సాఫీగా సాగిపోతూ ఉండగా కానిస్టేబుల్‌ చారులత(ప్రియాంక అరుల్‌ మోహన్‌) తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉండగా పోలీస్‌ ఆఫీసర్ దయా(ఎస్‌ జే సూర్య) బదిలీ పై వస్తాడు. అత్యంత క్రూరుడు అయిన దయ వల్ల చారులత తో పాటు అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. "},{"text":"అప్పుడు సూర్య ఏం చేస్తాడు? అసలు సూర్య కి శనివారం తో లింక్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. "},{"text":"నటీనటుల నటన :"},{"text":"నేచురల్‌ స్టార్‌ నాని మరోసారి తన నటన ప్రతిభ కనబర్చాడు. సూర్య పాత్ర కి నాని ప్రాణం పోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్‌ సన్నివేశాల్లో నాని గతంలో కొన్ని సార్లు తేలిపోయాడు. కానీ ఈసారి అన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా నాని కుమ్మేశాడు. నాని లుక్ పరంగా కూడా ఈ సినిమాలో మెప్పించాడు. నానిని ఇలా చూడటం చాలా బాగుంది. ఎమోషన్‌ సన్నివేశాలు, కామెడీ టైమింగ్‌, యాక్షన్ ఇలా అన్ని సన్నివేశాల్లో నాని కి మంచి మార్కులు పడ్డాయి. "},{"text":"కానిస్టేబుల్‌ చారులత పాత్రలో కనిపించిన ప్రియాంక అరుల్‌ మోహన్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్ పరంగా సింపుల్‌ అండ్ స్వీట్ గా కనిపించి, పక్కింటి అమ్మాయిలా ఉంది అనిపించుకుంది. అంతే కాకుండా నటన పరంగా కూడా ఆకట్టుకుంది. గతంలోనే నానితో ఈమె నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా నానితో తన పెయిర్‌ హిట్‌ పెయిర్ అంటూ చెప్పే విధంగా నటించి మెప్పించింది. "},{"text":"ఈ మధ్య కాలంలో ఎస్‌ జే సూర్య ను విలన్ పాత్రలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ సినిమాలో ఆయన పోషించిన క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నాని కి ఏమాత్రం తగ్గకుండా నటనతో సినిమా వెయిట్‌ ను సూర్య పెంచాడు. "},{"text":"టెక్నికల్‌ : "},{"text":"దర్శకుడు వివేక్ ఆత్రేయ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలాంటి ఒక కథను తీసి కమర్షియల్‌ హిట్‌ కొట్టవచ్చు అంటూ ఆయన నమ్మిన తీరు అభినందనీయం. కథ విషయంలో ఆయన ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఇంకాస్త ఆసక్తికరంగా స్క్రీన్‌ ప్లే ని నడిపించి ఉంటే బాగుండేది. హీరో ను చూపించడంలో కూడా కొత్తదనం అనుసరించిన తీరు బాగుంది. విలన్‌ ను కూడా చాలా విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. "},{"text":"సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. పాటలు అంతంత మాత్రమే ఉన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ చాలా బాగుంది. ఫస్ట్‌ సీన్‌ నుంచి కూడా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ సినిమా స్థాయిని పెంచుతూ వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. "},{"text":"యాక్షన్‌ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ పనితనం నెక్ట్స్ లెవల్‌. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీ గా ఉంటే బాగుండేది. "},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"నాని, ఎస్‌జే సూర్య నటన"},{"text":"బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌"},{"text":"విభిన్నమైన కథ"},{"text":"కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్ "},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"సెకండ్‌ హాఫ్‌ లో కొన్ని సన్నివేశాలు"},{"text":"ఎడిటింగ్‌"},{"text":"పాటలు"},{"text":"విశ్లేషణ :"},{"text":"అంటే సుందరానికి సినిమా తో ప్రేక్షకులు వినోదాన్ని ఆశించారు. కానీ మేము వారు కోరుకున్న స్థాయిలో వినోదాన్ని అందించడంలో విఫలం అయ్యాం. కానీ ఈసారి అలా జరగదు అంటూ నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో, దర్శకుడు ఏదైతే అనుకున్నాడో అదే చూపించారు. "},{"text":"విభిన్నమైన కథను ఎంపిక చేసుకుని, నానిని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒప్పించడంతోనే మొదటి విజయం దక్కించుకున్నాడు. కథ కు తగ్గట్లుగా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకోవడం మొదలుకుని ప్రతి విషయంలో కూడా దర్శకుడు పెర్ఫెక్ట్‌ గా అడుగులు వేసినట్లుగా సినిమా ఉంది. విలన్ పాత్ర కు గాను ఎస్‌జే సూర్య ను తీసుకోవడం మంచి నిర్ణయం. "},{"text":"ఇలాంటి ఒక సినిమాను చేసేందుకు దర్శకుడికి, నటించేందుకు హీరో కు, అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతకు ఘట్స్ ఉండాలి. ఇలాంటి ఒక ప్రయత్నం అభినందనీయం. "},{"text":"చివరగా... "},{"text":"సరిపోదా శనివారం అంటే.. సరిపోయింది శశనివారం"},{"text":"బ్యానర్‌ : డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌"},{"text":"నిర్మాత : డివివి దానయ్య"},{"text":"దర్శకుడు : వివేక్ ఆత్రేయ"},{"text":"సంగీత దర్శకుడు : జేక్స్ బిజోయ్"},{"text":"తారాగణం : నాని, ప్రియాంక మోహన్‌, ఎస్‌జే సూర్య, సాయి కుమార్‌, అభిరామి, మురళి శర్మ, అజయ్‌"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}},{"node":{"uid":"naga-babu-will-work-to-increase-aps-green-cover","data":{"third_party_url":null,"title":{"text":"Naga Babu: Will work to increase AP’s green cover"},"img":{"url":"https://images.prismic.io/prad/Wl2VUgXAO1Aw1-fq_NB.JPG?auto=format,compress&rect=0,60,450,222&w=2028&h=1000"},"datetime":"2026-08-28T09:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-saripoda-sanivaaram","tags":["politics"]}}