{"data":{"prismicReviewarticle":{"uid":"review-double-ismart","tags":["politics"],"first_publication_date":"2024-08-15T08:49:57+0000","last_publication_date":"2024-08-17T13:02:14+0000","data":{"title":{"text":"రివ్యూ: డబుల్ ఇస్మార్ట్"},"rating":2,"datetime":"2024-08-15T07:21:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/ZrUTsUaF0TcGIzNi_DoubleIsmart.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=xPx1v4wMiPU","thumbnail_url":"https://i.ytimg.com/vi/xPx1v4wMiPU/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@adityamusic","title":"Double ISMART Trailer (Telugu) | Ram Pothineni | Sanjay Dutt | Kavya Thapar | Puri Jagannadh"},"content":{"raw":[{"text":"పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సీఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో డైరెక్టర్ పూరి... హీరో రామ్ ను సరికొత్తగా చూపించి మెప్పించడమే కాదు, తనదైన మార్క్ మేకింగ్ చూపించి హిట్టు కొట్టాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఈ ఇద్దరి కాంబినేసన్లో వచ్చిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. మరి టైటిల్ లో చెప్పినట్లు డబుల్ ఎంటర్టెన్మెంట్ ఉంటుందా? ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ:"},{"text":" భారత దేశాన్ని నాశనం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ బిగ్ బుల్ (సంజయ్ దత్) పెద్ద స్కెచ్ వేస్తాడు. అతడిని పట్టుకునేందుకు ఇండియన్ ‘రా’ అధికారులు ప్రయత్నిస్తుంటాడు. అయితే అంతలోనే అతడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో ఎలాగైనా బ్రతికేందుకు బిగ్ బుల్ దారులు వెతుకుతూ ఉంటాడు. అయితే ఒక సైంటిస్ట్ ద్వారా తన బ్రెయిన్ లోని మెమొరీ మరొకరి బ్రెయిన్లోకి ట్రాన్ఫర్ చేయవచ్చని, అలా ఇంకొక వ్యక్తి శరీరంలోకి మారుతూ ఇమ్మోర్టల్(చావులేని) వ్యక్తిగా బ్రతకడం సాధ్యమే అని తెలుసుకుని ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే ఈ ప్రయోగం ఎంత మంది మీద చేసిన ఫెయిల్ అవుతూ ఉంటుంది. "},{"text":"దీనికి సూటయ్యే ఒకే ఒక వ్యక్తి... ఆల్రెడీ బ్రెయిన్లో చిప్ కలిగిన ఇస్మార్ట్ శంకర్ హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకుని అతడి పట్టుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. తాను అనుకున్నట్లే తన మెమొరీ మొత్తం శంకర్ బ్రెయిన్లోకి ట్రాన్ఫర్ చేస్తాడు. అయితే మెమొరీ ట్రాన్ఫర్ తర్వాత శంకర్ కనిపించకుండా పోతాడు. తన మైండ్లోకి ఎక్కిన మెమొరీ ద్వారా బిగ్ బుల్ స్విస్ బ్యాంక్ అంకౌట్ కూడా యాక్సెస్ చేసి పాస్వర్డ్ మార్చేస్తాడు శంకర్. "},{"text":"ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? దేశాన్ని నాశనం చేయడానికి బిగ్ బుల్ ఏం ప్లాన్ చేశాడు? అసలు శంకర్, బిగ్ బుల్ మధ్య సంబంధం ఏమిటి? శంకర్ ప్రియురాలు జన్నత్(కావ్య థాపర్) ఈ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయింది? అనేది మిగతా కథ. "},{"text":"పెర్ఫార్మెన్స్:"},{"text":"ఇస్మార్ట్ శంకర్ పాత్రలో తనదైన మాస్ మ్యానరిజంతో రామ్ పోతినేని ఆకట్టుకున్నాడు. అతడి ప్రియురాలు జన్నత్ పాత్రలో కావ్య థాపర్ బాగా సూటయింది. తన పెర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది. "},{"text":"విలన్ బిగ్ బుల్ పాత్రలో సంజయ్ దత్ లుక్ స్టైలిష్ గా ఉంది. అడవి మనిషి బోకా పాత్రలో అలీ నవ్వించలేక పోయాడు. ఇతర నటీనటులు వారి వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. "},{"text":"సినిమా, పూరి పని తీరు ఎలా ఉందంటే..."},{"text":"‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను రీచ్ కావడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే, అందులోని పాత్రలు డిజైన్ చేసిన తీరు డిసప్పాయింట్ చేసింది. "},{"text":"ఈ సినిమాలో విలన్ పాత్ర, అందుకు ఎంచుకున్న నేపథ్యం లాజిక్ లేకుండా ఉంది. పోనీ లాజిక్స్ వదిలేద్దామన్నా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ స్థాయికి తగిన విధంగా అతడి పాత్రను డిజైన్ చేయలేక పోయాడు. పూరి సినిమాల్లో అలీకి ఏదో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది, అది కూడా ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉంటుంది. అయితే ఇందులో బోకా పేరుతో అలీని చూపించారు. అతడి పాత్ర అస్సలు నవ్వించకపోగా ఆ పాత్ర డిజైన్ చేసిన విధానం జుగుప్సాకరంగా ఉంది. "},{"text":"పూరి మార్క్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ కనిపించవు. మొదటి పార్టుతో పోలిస్తే ఇస్మార్ట్ శంకర్ పాత్ర కూడా అంత పవర్ ఫుల్ అనిపించదు. "},{"text":"టెక్నికల్ అంశాలు: "},{"text":"మణిశర్మ మ్యూజిక్ ఓకే. రాజ్ తోట ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.  ఛార్మి, పూరి జగన్నాథ్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. "},{"text":"చివరగా..."},{"text":"‘డబుల్ ఇస్మార్ట్’ చూసేందుకు వెళితే  ‘డల్ ఇస్మార్ట్’ కనిపిస్తాడు."},{"text":"బ్యానర్ : పూరి కనెక్ట్స్"},{"text":"దర్శకుడు: పూరి జగన్నాథ్"},{"text":"నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి"},{"text":"సంగీత దర్శకుడు: మణిశర్మ"},{"text":"నటీనటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, ఝాన్సీ, ప్రగతి, ఆలీ, గెటప్ శ్రీను తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-double-ismart","tags":["politics"]}}