{"data":{"prismicReviewarticle":{"uid":"review-naa-saami-ranga","tags":["politics"],"first_publication_date":"2024-01-14T09:59:11+0000","last_publication_date":"2024-01-15T11:24:44+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘నా సామిరంగ’"},"rating":2.75,"datetime":"2024-01-14T18:30:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/8f352155-3013-47f3-8eb0-a444b65d3d9b_Naa+Saami+Rang.JPG?auto=compress,format&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=MbcPCSkIEb4","thumbnail_url":"https://i.ytimg.com/vi/MbcPCSkIEb4/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@jungleemusictelugu","title":"Naa Saami Ranga Trailer | Nagarjuna Akkineni | Allari Naresh | Vijay B | MM Keeravaani | SS Screens"},"content":{"raw":[{"text":"సంక్రాంతి సినిమాల రేసులో ‘నా సామిరంగా’ అంటూ ఈ సారి కింగ్ నాగార్జున కూడా పోటీ పడుతున్నారు. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించడం, పూర్తిగా సంక్రాంతి ఫేవర్, పల్లెటూరి నేపథ్యం ఉన్న కథ కావడంతో ఈ చిత్రంపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ:"},{"text":"తనకంటూ ఎవరూ లేని కిష్టయ్య (నాగార్జున)ను అంజి(అల్లరి నరేష్) తల్లి చిన్నతనంలోనే చేరదీస్తుంది. అప్పటి నుంచి కిష్టయ్య, అంజి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతారు. అంజి తల్లి చనిపోయిన తర్వాత గ్రామ ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) వీరిద్దరి బాగోగులు చూసుకుంటాడు, అందుకే పెద్దయ్య మాట కిష్టయ్య జావదాటడు."},{"text":"కిష్టయ్యకు చిన్నతనం నుంచే వరాలు అలియాస్ వరలక్ష్మి( అషికా రంగనాథ్) అంటే చాలా ఇష్టం. కిష్టయ్య తనను ప్రేమిస్తున్న విషయం తెలిసినా వరాలు పట్టించుకోదు. పై చదువుల కోసం పట్నం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కిష్టయ్య-వరాలు లవ్ ట్రాక్ గాడిలో పడుతుంది. తమ ప్రేమ విషయం పెద్దయ్యకు చెబుదామని వెళ్లే సరికి ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేష్) తన కూతురును పెద్దయ్య కుమారుడు దాసు(షబ్బీర్)కు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాల్లో ఉంటాడు. కిష్టయ్య-వరాలు ప్రేమ విషయం తెలిసిన పెద్దయ్య వారికి ప్రేమకు మద్దతుగా నిలుస్తాడు. అయితే వీరి పెళ్లికి వరదరాజులు ఇందుకు అంగీకరించడు. "},{"text":"ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల ఊరేగింపు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం మొదలవుతుంది. ఇదే అదునుగా కిష్టయ్యతో పాటు అంజిని కూడా చంపేందుకు దాసు ప్లాన్ చేస్తాడు. మరో వైపు భాస్కర్(రాజ్ తరుణ్), కుమారి(రుక్సార్) ప్రేమ వ్యవహారం కూడా కథలో కీలకంగా ఉంటుంది. ఈ సంఘర్షణల మధ్య కథ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథలు ఎలా సుఖాంతం అయ్యాయి అనేది తెరపై చూడాల్సిందే. "},{"text":"సినిమా ఎలా ఉందంటే..."},{"text":"విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథలు, గ్రామల మధ్య పగలు ప్రతీకారాలు ఇలాంటి కథలు కొత్తకాక పోయినా... దీనికి కోనసీమ వాతావరణం, అక్కడి కల్చర్ జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచేలా సినిమాను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కిష్టయ్య, అంజి బాల్యం ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. కిష్టయ్య-వరాలు ప్రేమ కథకు కమర్షియల్ అంశాలు జోడించి ఫోకస్ చేసిన విధానం బావుంది. ఆసక్తికర పాయింటుతో డిజైన్ చేసిన ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. క్లయిమాక్స్ లో నాగార్జున యాక్షన్ ఎపిసోడ్ అభిమానులను మెప్పిస్తుంది. అయితే సినిమాను ఎండ్ చేసిన విధానం మాత్రం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. "},{"text":"ఎవరు ఎలా చేశారంటే....."},{"text":"నాగార్జున ఎమోషనల్, స్టైలిష్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. అషికా రంగనాథ్ అందంతోపాటు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంది. అంజి పాత్రలో అల్లరి నరేష్ తనదైన మార్కు నటనతో మెప్పించాడు. రాజ్ తరుణ్ రోల్ సినిమాలో కీ పాయింటుగా ఉన్నప్పటికీ అతడి పెర్ఫార్మెన్స్ చూపే స్థాయిలో సీన్లు లేవు. "},{"text":"ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య పాత్రలో నాజర్ సహజంగా నటించాడు. జనాలను పీక్కుతినే వడ్డీ వ్యాపారి పాత్రలో, హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ తనదైన మార్క్ చూపించాడు. దాసు పాత్రలో షబ్బీర్ నటన ఓకే. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. "},{"text":" కీరవాణి అందించిన పాటల్లో సంక్రాంతి జోష్ కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. శివేంద్ర సినిమాటోగ్రఫి విలేజ్ వాతావరణాన్ని మంచి ఎలివేట్ చేసే విధంగా ఉంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఓకే కానీ సెకండాఫ్ లో కొన్ని సీన్లలో క్రిస్పీనెస్ ఉంటే బావుండేది అనిపిస్తుంది. "},{"text":"ప్లస్ పాయింట్స్......"},{"text":"నాగార్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్"},{"text":"అల్లరి నరేష్ నటన"},{"text":"ఆక్టుకునే స్క్రీన్ ప్లే"},{"text":"సంక్రాంతి జోష్ ఉన్న పాటలు"},{"text":"మైనస్ పాయింట్స్ "},{"text":"కొత్తదనం లేని కథ"},{"text":"సెకండాఫ్ లో సినిమా స్లోగా రన్ అవ్వడం"},{"text":" చివరగా....."},{"text":"‘నా సామిరంగ’ మాస్ ఆడియన్స్ మెచ్చే మూవీ"},{"text":"దర్శకుడు: విజయ్ బిన్ని"},{"text":"నిర్మాత: శ్రీనివాస చిట్టూరి"},{"text":"సంగీత దర్శకుడు: M. M. కీరవాణి"},{"text":"నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాసర్, రావు రమేష్, మధుసూదన్ రావు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ponnam-sets-condition-for-pawan","data":{"third_party_url":null,"title":{"text":"Ponnam Sets Condition for Pawan"},"img":{"url":"https://images.prismic.io/prad/ah2PnQeQX7-eWfWv_ponnampk.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-06-27T13:00:00+0000"}}},{"node":{"uid":"telangana-cid-busts-illegal-betting-network","data":{"third_party_url":null,"title":{"text":"Telangana CID busts illegal betting network"},"img":{"url":"https://images.prismic.io/prad/Z-Py0XdAxsiBv7HP_betting.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-06-01T11:52:00+0000"}}},{"node":{"uid":"no-coaching-duty-for-gambhir","data":{"third_party_url":null,"title":{"text":"No Coaching Duty for Gambhir!"},"img":{"url":"https://images.prismic.io/prad/Zpa2iB5LeNNTxNil_ghambir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-06-01T06:42:00+0000"}}},{"node":{"uid":"what-was-that-celebration-from-virat","data":{"third_party_url":null,"title":{"text":"‘What was that celebration from Virat?’"},"img":{"url":"https://images.prismic.io/prad/ah0_GweQX7-eWeJr_kohlicelebration.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-05-31T20:13:00+0000"}}},{"node":{"uid":"kavitha-hints-at-a-hidden-game","data":{"third_party_url":null,"title":{"text":"Kavitha Hints at a Hidden Game"},"img":{"url":"https://images.prismic.io/prad/aftFe8BOoF08xrRb_kavitha.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-31T18:32:00+0000"}}},{"node":{"uid":"kohli-masterclass-on-the-dance-floor","data":{"third_party_url":null,"title":{"text":"Kohli ‘masterclass on the dance floor’"},"img":{"url":"https://images.prismic.io/prad/ah0s8QeQX7-eWd9b_kohli.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-06-01T05:56:00+0000"}}},{"node":{"uid":"pk-land-row-truth-or-political-trap","data":{"third_party_url":null,"title":{"text":"PK Land Row: Truth or Political Trap?"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress"},"datetime":"2026-06-01T06:30:00+0000"}}},{"node":{"uid":"next-dalai-lama-beyond-chinas-control-report","data":{"third_party_url":null,"title":{"text":"Next Dalai Lama Beyond China's Control: Report"},"img":{"url":"https://images.prismic.io/prad/1c1f3bd0-6d00-4e08-8a19-62b34557786e_dalailama.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-31T05:42:00+0000"}}},{"node":{"uid":"congress-eyes-sharmila-for-national-politics","data":{"third_party_url":null,"title":{"text":"Congress Eyes Sharmila for National Politics?"},"img":{"url":"https://images.prismic.io/prad/f07e3086-0cf0-4b2d-ba40-b257f2a8a67a_sharmila+merges+YSRTP.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-30T15:07:00+0000"}}},{"node":{"uid":"dawood-planned-to-attack-delhi-mumbai","data":{"third_party_url":null,"title":{"text":"Dawood planned to attack Delhi, Mumbai"},"img":{"url":"https://images.prismic.io/prad/5e1e7812-954c-461e-9f93-fd36c403bd18_dawood.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-30T09:28:00+0000"}}},{"node":{"uid":"hardik-signals-departure-from-mi","data":{"third_party_url":null,"title":{"text":"Hardik Signals Departure from MI?"},"img":{"url":"https://images.prismic.io/prad/ahmtbAeQX7-eWcDu_hardik.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-29T10:15:00+0000"}}},{"node":{"uid":"revanth-declares-ntr-a-national-icon","data":{"third_party_url":null,"title":{"text":"Revanth Declares NTR a National Icon"},"img":{"url":"https://images.prismic.io/prad/ahm2JQeQX7-eWcJL_NTR.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-29T10:52:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-naa-saami-ranga","tags":["politics"]}}