{"data":{"prismicReviewarticle":{"uid":"review-andhra-king-talooka---fans-movie","tags":["politics"],"first_publication_date":"2025-11-27T10:58:55+0000","last_publication_date":"2025-11-28T11:10:09+0000","data":{"title":{"text":"'ఆంధ్రాకింగ్‌ తాలూకా' రివ్యూ... ఫ్యాన్స్‌ మూవీ"},"rating":2.25,"datetime":"2025-11-27T08:30:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aSgr23NYClf9nheC_AKT1.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=oeY828c-AXo","thumbnail_url":"https://i.ytimg.com/vi/oeY828c-AXo/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@MythriMovieMakers","title":"Andhra King Taluka Trailer | Ram Pothineni | Upendra | Mahesh Babu P | Bhagyashri Borse"},"content":{"raw":[{"text":"రామ్‌ వరుస విజయాలతో ఎనర్జిటిక్ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని కెరీర్‌ ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ గత కొంత కాలంగా ఆయన పూర్తిగా గాడి తప్పినట్లుగా కనిపిస్తున్నాడు. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలను, దర్శకులను ఎంపిక చేసుకోవడంతో ఆయనకు వరుస ఫ్లాప్‌లు తప్పలేదు. ఇస్మార్ట్‌ శంకర్ తర్వాత రామ్‌ ఒక మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ హిట్‌ ఈ సినిమాతో వచ్చిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ : "},{"text":"సూర్య(ఉపేంద్ర) తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరో. అభిమానులు ఆయన్ను ఆంధ్రా కింగ్‌ అనే బిరుదుతో పిలుచుకుంటూ ఉంటారు. వరుస విజయాలు దక్కించుకుంటూ వచ్చిన సూర్యకు వందవ సినిమాకు ముందు కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరుస ఫ్లాప్స్‌ పడటంతో సూర్య ను విమర్శించే వారు, తిట్టేవారు ఎక్కువ అవుతారు. ఆయన పనైపోయిందని విమర్శిస్తూ ఉంటారు. ఆ సమయంలో సూర్య 100వ సినిమాను మొదలు పెడతాడు. "},{"text":"సినిమాపై అంచనాలు లేకపోవడం, అసలు సూర్య సినిమాను ఎవరు చూస్తారు అని జనాలు అనుకుంటూ ఉండటంతో ఆ సినిమా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది. సినిమా పూర్తి చేయడానికి రూ.3 కోట్లు అవసరం అవుతుంది. ఆ సమయంలో సూర్యను అమితంగా అభిమానించే సాగర్‌ (రామ్‌) ముందుకు వస్తాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని అమ్మి, ఆ డబ్బును తన అభిమాన హీరో, ఆంధ్రాకింగ్‌ సూర్యకి చేరేలా చేస్తాడు. "},{"text":"తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సూర్య తన అకౌంట్‌లో పడ్డ రూ.3 కోట్లు చూసి షాక్‌ అవుతాడు. ఆ డబ్బును తన అభిమాని అయిన సాగర్‌ పంపించినట్లు తెలిసి షాక్‌ అవుతాడు. తన అభిమానిని కలుసుకునేందుకు సూర్య బయలుజేరుతాడు. ఆ క్రమంలో సాగర్‌ గురించి పలు విషయాలను సూర్య తెలుసుకుంటాడు. ఒక అభిమానిని స్టార్‌ హీరో ఎలా కలుసుకున్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ."},{"text":"నటీనటుల నటన : "},{"text":"రామ్‌ మొత్తం బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు. ఎప్పటిలాగే ఈ సినిమాతో మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. సాగర్‌ పాత్రకి రామ్‌ ఎంత వరకు చేయాలో అంతకు మించి చేసినట్లుగా అనిపించింది. ఒక పాత్రను చాలా నమ్మడం వల్లే రామ్‌ ఈ స్థాయిలో కష్టపడి ఉంటాడు అనిపించింది. అతడి లుక్‌, డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌ సీన్స్ లో ఆయన ప్రజెన్స్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్‌లోనూ రామ్‌ ఆకట్టుకున్నాడు. అందుకే అతడు ఒక ఫ్యాన్  గా సరిగ్గా సెట్‌ అయ్యి, సినిమాను మోశాడు."},{"text":"సూపర్‌ స్టార్‌గా నటించిన ఉపేంద్ర తన పాత్రకు న్యాయం చేశాడు. ఒక అభిమాని కోసం వెతుక్కుంటూ వెళ్తున్న సీన్స్ లో అతడి భావోద్వేగం కనిపించింది. సినిమా కోసం అతడు పడే తపన, అతడు పడే కష్టం తాలూక డిటైల్స్ ను ఉపేంద్ర చక్కగా చూపడం జరిగింది. హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సేకి తన ప్రతిభ మొత్తం చూపించే అవకాశం దక్కలేదు. అయితే ఆమె ఉన్నంతలో అందంగా కనిపించడంతో పాటు, నటనతో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించారు. "},{"text":"టెక్నికల్‌ : "},{"text":"పాటల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. కొత్త సంగీత దర్శకులు కుమ్మేశారు అంటూ అంతా తెగ మాట్లాడారు. కానీ వారి నుంచి వచ్చిన సంగీతం కొత్తగా ఉంది కానీ ఆకట్టుకునే విధంగా మాత్రం లేదు. ఇలాంటి సినిమాలకు పాత సంగీత దర్శకులు అయితే న్యాయం చేసేవారు అనిపిస్తుంది. కాని రామ్‌ కి మాత్రం ఎందుకో వీరు నచ్చారు. ఆయన నిర్ణయం తప్పు అని తేలింది. "},{"text":"ఇక దర్శకుడు మహేష్‌ ఎంపిక చేసుకున్న కథ విషయంలో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా స్టోరీ లైన్ మంచి పాయింట్‌. కానీ దాన్ని మలచిన తీరు బాగాలేదు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే విషయంలో సాగతీసినట్లుగా అనిపించింది. ఎడిటింగ్‌ కి ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎందుకో చాలా సీన్స్‌ను అలాగే వదిలేశాడు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రాఫీ అప్పటి నేటివిటీకి దగ్గరగా ప్రేక్షకులను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. "},{"text":"విశ్లేషణ : "},{"text":"రామ్‌ దాదాపు ఏడాది  గ్యాప్ తీసుకుని, వందల కొద్ది కథలు విని, పదుల కొద్ది కథలు పక్కన పెట్టుకుని, చివరకు ఈ కథను ఎంపిక చేసుకున్నాడు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే ఇలాంటి కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడు అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ లైన్‌ బాగుంటే సరిపోతుందా, కథ, కథనం విషయంలో దీన్ని ఎంత వరకు ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా తీసుకు రాగలరు అనే విషయంను ఆయన చూసుకోలేదు అనిపిస్తుంది. "},{"text":"రామ్‌ సాధారణంగానే ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలోనూ మరోసారి తన సత్తా చాటాడు. కానీ సినిమాలోని ఆయన పాత్ర ఉన్నంత పవర్‌ ఫుల్‌గా స్క్రీన్‌ ప్లే లేదు. గ్రామీన ప్రాంతంలో ఉండే ప్రేమ కథను చూపించే ప్రయత్నం చేశారు. ఆ కథను ఇంకాస్త ఎక్కువ చూపించినా బాగుండేది. హీరో, అభిమాని మధ్య ఉండే సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు ఆశించిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే సినిమా రెగ్యులర్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతుంది. కానీ తమను తాము ఒక హీరోకు అభిమాని అని చెప్పుకునే వారికి మాత్రం తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. "},{"text":"ప్లస్ పాయింట్స్ : "},{"text":"రామ్‌ నటన,"},{"text":"స్టోరీలైన్‌,"},{"text":"కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌"},{"text":"మైనస్ పాయింట్స్ : "},{"text":"ఫస్ట్‌ హాఫ్‌ చాలా స్లోగా సాగింది"},{"text":"స్క్రీన్‌ ప్లే,"},{"text":"ప్రేమ కథ ఇంకాస్త ఉండాల్సింది."},{"text":"చివరగా..."},{"text":"ఫ్యాన్‌గా ఆంధ్రాకింగ్‌ను ఆకట్టుకున్న సాగర్‌, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే."},{"text":"బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్‌"},{"text":"నిర్మాత : నవీన్‌ యెర్నేని, వై రవి శంకర్‌"},{"text":"దర్శకత్వం : మహేష్‌ బాబు పి"},{"text":"సంగీతం : వివేక్‌-మెర్విన్‌"},{"text":"తారాగణం : రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"brs-student-wing-stages-protest-over-mp-suryas-remarks","data":{"third_party_url":null,"title":{"text":"BRS student wing stages protest over MP Surya’s remarks"},"img":{"url":"https://images.prismic.io/prad/aeIG9Z1ZCF7ETSSI_BRSStudentwing.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-17T08:10:00+0000"}}},{"node":{"uid":"gautam-adani-becomes-asias-richest-person","data":{"third_party_url":null,"title":{"text":"Gautam Adani becomes Asia’s richest"},"img":{"url":"https://images.prismic.io/prad/Z02IxpbqstJ978If_adani.JPG?auto=format,compress"},"datetime":"2026-04-17T05:51:00+0000"}}},{"node":{"uid":"amit-shahs-firm-stance-no-religious-reservations-for-muslims-mo2pi22d","data":{"third_party_url":null,"title":{"text":"Amit Shah: No Religious Reservations for Muslims"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9a998da1-ed74-4d1d-bf5c-3ce42a2986be_amit+shah.jpg?auto=format,compress&rect=0,44,1280,631&w=2028&h=1000"},"datetime":"2026-04-16T19:29:00+0000"}}},{"node":{"uid":"bengaluru-businessmans-honeytrap-nightmare-blackmailed-after-instagram-encounter-mo2pi7w3","data":{"third_party_url":null,"title":{"text":"Businessman’s Honeytrap Nightmare"},"img":{"url":"https://images.prismic.io/prad/c8335006-73f0-4db2-9b9f-f9d6f0421a05_love+is+blind.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T18:30:00+0000"}}},{"node":{"uid":"ysr-congress-leader-released-on-bail","data":{"third_party_url":null,"title":{"text":"YSR Congress leader released on bail"},"img":{"url":"https://images.prismic.io/prad%2F7216aea1-016a-4612-8cd4-886237641335_ysrcp.jpg?auto=format%2Ccompress&rect=0%2C5%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:39:00+0000"}}},{"node":{"uid":"tvk-manifesto-welfare-ai-1.5t-goal","data":{"third_party_url":null,"title":{"text":"TVK Manifesto: Welfare, AI, $1.5T Goal"},"img":{"url":"https://images.prismic.io/prad/aeEUw51ZCF7ETQr3_vijaytvk.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T13:15:00+0000"}}},{"node":{"uid":"from-now-onwards-nari-shakti-will-not-be-just-a-slogan","data":{"third_party_url":null,"title":{"text":"From now onwards, Nari Shakti will not be just a slogan"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T07:30:00+0000"}}},{"node":{"uid":"infosys-denies-pune-harassment-claims","data":{"third_party_url":null,"title":{"text":"Infosys Denies Pune Harassment Claims"},"img":{"url":"https://images.prismic.io/prad/7766529c-412f-4d9a-a068-c32a77895fee_infosys.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T06:06:00+0000"}}},{"node":{"uid":"case-filed-against-vijay","data":{"third_party_url":null,"title":{"text":"Case filed against Vijay"},"img":{"url":"https://images.prismic.io/prad/aPPHEJ5xUNkB2HoK_vijay.JPG?auto=format,compress"},"datetime":"2026-04-16T05:30:00+0000"}}},{"node":{"uid":"pichai-ranbir-in-times-100-most-influential-people-of-2026","data":{"third_party_url":null,"title":{"text":"Pichai, Ranbir in TIME's '100 Most Influential'"},"img":{"url":"https://images.prismic.io/prad/aeC5qZ1ZCF7ETPhc_pichairanbir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-16T05:28:00+0000"}}},{"node":{"uid":"madras-hc-orders-i-t-probe-on-udhayanidhi-assets","data":{"third_party_url":null,"title":{"text":"Court Orders Probe on Udhayanidhi Assets"},"img":{"url":"https://images.prismic.io/prad/5eb52f79-f1fb-4224-8660-30b6f9452808_udhanidhi+stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-04-15T08:13:00+0000"}}},{"node":{"uid":"lokesh-elevated-as-national-wp-of-tdp","data":{"third_party_url":null,"title":{"text":"Lokesh elevated as national WP of TDP"},"img":{"url":"https://images.prismic.io/prad/Z4vnQ5bqstJ99mOE_lokesh.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-04-15T07:41:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-andhra-king-talooka---fans-movie","tags":["politics"]}}