{"data":{"prismicReviewarticle":{"uid":"review-mirai--strong-story-stunning-vfx","tags":["politics"],"first_publication_date":"2025-09-11T17:20:47+0000","last_publication_date":"2025-09-13T11:11:42+0000","data":{"title":{"text":"'మిరాయ్‌' రివ్యూ... విజువల్‌ వండర్‌"},"rating":3,"datetime":"2025-09-12T08:41:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aMQDT2GNHVfTPFfp_mirai.JPG?auto=format,compress"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=ggJg6CcKtZE","thumbnail_url":"https://i.ytimg.com/vi/ggJg6CcKtZE/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@PeopleMediaFactory","title":"Mirai Trailer Telugu | Teja Sajja | Manchu Manoj | Karthik Gattamneni | PMF | 12th Sept"},"content":{"raw":[{"text":"బాల నటుడిగా 50కి పైగా సినిమాలు చేసిన తేజ సజ్జా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. హనుమాన్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న తేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా కాస్త ఓపికతో కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. మిరాయ్‌ తో తాజాగా తేజ వచ్చాడు. ఈ సినిమా పై దాదాపుగా రెండేళ్ల పాటు వర్క్‌ చేశారట. కొత్త హీరో, కొత్త దర్శకుడు ఒక్క సినిమాపై అంత సమయం వర్క్ చేయడం మామూలు విషయం కాదు. విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ :"},{"text":"అత్యంత శక్తివంతుడు అయిన అశోకుడు తన చివరి యుద్దం అయిన కళింగ యుద్దం తర్వాత చాలా ఫీల్‌ అవుతాడు. తన వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో నష్టం జరుగుతుందని పశ్చాతాపం వ్యక్తం చేస్తాడు. మళ్లీ తన వల్ల అలాంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో తన శక్తిని 9 భాగాలుగా విభజించి ఒక్కో భాగంను ఒక్కో గ్రంధంగా తయారు చేస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రంధాలను అక్కడక్కడ ఉంచుతాడు. ఆ గ్రంథాలకు రక్షకులను ఉంచుతాడు."},{"text":"అశోకుని శక్తి పొందాలంటే ఆ 9 గ్రంథాలను ఒక్క చోట చేర్చాలని తెలుసుకున్న మహావీర్‌(మంచు మనోజ్‌) అందుకు ప్రయత్నాలు మొదలు పెడుతాడు. అతడు చివరి గ్రంథం వద్దకు వచ్చిన సమయంలో అంభిక(శ్రియ) వద్ద ఉంటుంది. ఆమె కొడుకు అయిన వేద(తేజ) ఆ గ్రంథంను కాపాడే బాధ్యత తన భుజాలపై వేసుకుంటాడు. మిరాయ్‌ అనే పవర్‌ ఫుల్‌ అస్త్ర సాయంతో ఆ గ్రంథాలను మహావీర్‌కి అందుకుండా ఎలా వేద చేశాడు అనేది సినిమా కథ."},{"text":"ఇంతకు మహా వీర్‌ ఎవరు? వేదకు అంభికకు ఉన్న సంబంధం ఏంటి? అంబిక ఎందుకు ఆ గ్రంథంను సంరక్షిస్తూ ఉంటుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే."},{"text":"నటీనటుల నటన :"},{"text":"తేజ సజ్జా మరో పవర్‌ ఫుల్‌ పాత్రతో మెప్పించాడు. ఇతడి గత చిత్రాల్లో మాదిరిగానే నటనతో మెప్పించేందుకు చాలా కష్టపడ్డాడు. ముందు నుంచి చెబుతున్నట్లుగా చాలా సన్నివేశాలు చాలా రిస్క్‌ తో కూడుకున్నవి. అయినప్పటికీ తేజ చాలా కష్టపడి సొంతంగానే చేశాడు. ఆ ఇంపాక్ట్‌ చాలా క్లీయర్‌గా కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో క్లోజప్‌ షాట్స్ ను చూస్తే అతడు ఏ స్థాయిలో సినిమా కోసం కష్టపడ్డాడు అనేది అర్థం అవుతుంది. సినిమాలోని ప్రతి సీన్‌ లో తేజ సజ్జా కష్టం కనిపిస్తుంది. అతడికి ఇది కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ మూవీగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు."},{"text":"హీరోయిన్‌ రితిక నాయక్‌ కి నటించేందుకు స్కోప్ దక్కింది. అందంగా కనిపించిన రితిక నటన విషయంలో కాస్త నిరుత్సాహ పరిచింది అనక తప్పదు. కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం వల్ల ముందు ముందు రితిక ఖచ్చితంగా పెద్ద సినిమాల్లో, స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విలన్ పాత్రలో మంచు మనోజ్‌ ఆకట్టుకున్నాడు. మహావీర్‌ పాత్రకు అతడు తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేక పోవచ్చు అన్నట్లుగా మంచు మనోజ్‌ నటించాడు. సాధారణంగా మనోజ్‌ ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తాడు అనే విమర్శలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో పాత్రకు ఎంత కావాలో అంతే ఇచ్చాడు. కెరీర్‌ బెస్ట్‌ అన్నట్లుగా ఉంది. విలన్‌గా మనోజ్‌ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయవచ్చు. జగపతిబాబు పాత్ర బాగుంది. నటుడిగా జగపతిబాబుకు ఇలాంటి పాత్రలు వెన్నతో పెట్టిన విద్య అనడంలో సందేహం లేదు. అన్నట్లుగానే చాలా ఈజీగా ఆ పాత్రను చేశాడు. జైరాం కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర నటీనటులు ఆకట్టుకున్నారు."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాను నడిపించిన తీరు చాలా బాగుంది. ఆయన స్వయంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసుకోవడం వల్ల చాలా వరకు కలిసి వచ్చింది అనాలి. అంటే దర్శకుడు ఏం అనుకుంటాడో సినిమాటోగ్రాఫర్‌ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఒక్కరే కనుక కమ్యూనికేషన్ గ్యాప్‌ అనేది లేదు. కనుక విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాలోని ఎక్కువగా సీన్స్ ఒరిజినల్‌ లొకేషన్స్‌లో తీశారు. అద్భుతంగా సినిమాటోగ్రఫీ ఉంది. సంగీతం చాలా బాగుంది. గౌర హరి సంగీతం ముందు ముందు గట్టిగానే వినిపించడం ఖాయం అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న జర్క్‌ లు తప్ప పెద్దగా తప్పిదాలు ఏమీ లేవు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ వంద కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా అద్భుతంగా ఉంది."},{"text":"విశ్లేషణ :"},{"text":"తెలుగులో మొదటి సూపర్‌ హీరో సినిమా అంటూ హనుమాన్ తో వచ్చిన తేజ సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి పట్టుదలకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా చాలా విభిన్నంగా ఉంది. మిరాయ్‌ కోసం దాదాపుగా రెండేళ్ల సమయం ఇవ్వడంతో తేజను చాలా మంది విమర్శించారు."},{"text":"కెరీర్‌ ఆరంభంలోనే ఏడాదికి ఒకటి కూడా సినిమాను విడుదల చేయకుంటే ఖచ్చితంగా ఇతడు నిలదొక్కుకోవడం కష్టం అన్నట్లుగా విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ తేజ మిరాయ్‌ కథను నమ్మాడు. దర్శకుడు కథ చెప్పిన సమయంలోనే తేజ నమ్మడం వల్ల రెండేళ్లు అయినా వెయిట్‌ చేసి మరీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు."},{"text":"అన్నీ తానై ప్రమోషన్స్ చేసిన తేజ పూర్తి స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన యొక్క పట్టుదలకు మంచి ఫలితం దక్కించుకున్నట్లే అంటూ మిరాయ్‌ నిరూపించింది."},{"text":"ప్లస్ పాయింట్స్ :"},{"text":"కథ,"},{"text":"హీరో, విలన్‌ పాత్రలు,"},{"text":"విజువల్స్‌,"},{"text":"క్లైమాక్స్‌"},{"text":"మైనస్ పాయింట్స్‌ :"},{"text":"స్లో కథనం,"},{"text":"అనవసరపు కామెడీ,"},{"text":"హీరో ఎలివేషన్ తగ్గింది"},{"text":"చివరగా..."},{"text":"హనుమాన్‌కి ఏమాత్రం తగ్గని సూపర్‌ హీరో మూవీ 'మిరాయ్‌'"},{"text":"బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ"},{"text":"నిర్మాత : టీజీ విశ్వప్రసాద్‌"},{"text":"దర్శకత్వం : ఘట్టమనేని కార్తీక్‌"},{"text":"సంగీతం : గౌర హరి"},{"text":"తారాగణం : తేజ సజ్జా, రితిక నాయక్‌, మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రియా శరన్‌, జైరాం తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-mirai--strong-story-stunning-vfx","tags":["politics"]}}