{"data":{"prismicReviewarticle":{"uid":"mass-jathara-review-routine-action-entertainer","tags":["politics"],"first_publication_date":"2025-10-31T16:23:36+0000","last_publication_date":"2025-11-02T09:53:07+0000","data":{"title":{"text":"'మాస్‌ జాతర' రివ్యూ... రొటీన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌"},"rating":2.25,"datetime":"2025-10-31T19:30:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aQThSLpReVYa35Yx_massjathara.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=Qm-wNxOcEL4","thumbnail_url":"https://i.ytimg.com/vi/Qm-wNxOcEL4/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@SitharaEntertainments","title":"Mass Jathara - TRAILER | Ravi Teja, Sreeleela | Bhanu Bhogavarapu | Bheems Ceciroleo | S Naga Vamsi"},"content":{"raw":[{"text":"రవితేజ ఏదైనా సినిమా ప్రారంభిస్తే ఆరు నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా అనేక కారణాల వల్ల చాలా ఆలస్యం అయింది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఏడాది చివర్లో దీపావళి అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన సినిమా కావడంతో పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది, అంతే కాకుండా రవితేజ ఈ సినిమాపై చాలా అంచనాలు పెంచే విధంగా ప్రచారం చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":""},{"text":"కథ :"},{"text":"రైల్వే ఎస్‌ఐ అయిన లక్ష్మణ్‌(రవితేజ) ఎక్కడ ఉంటే అక్కడ రైల్వే విధులు మాత్రమే కాకుండా అన్ని రకాల కేసులను పరిస్కరిస్తూ ఉంటాడు. అలాంటి లక్ష్మణ్‌కి డ్రగ్స్‌ ఇష్టానుసారంగా పండిస్తూ, అదే జీవనాధారంగా జనాలు జీవిస్తున్న ఒక ప్రాంతంకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ శివుడు(నవీన్ చంద్ర) బలవంతంగా రైతులతో గంజాయి సాగు చేయిస్తూ దాన్ని కోల్‌కత్తాకు ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తూ ఉంటాడు. శివుడు గంజాయి వ్యాపారంను నాశనం చేసేందుకు లక్ష్మణ్‌ సిద్దం అవుతాడు. శివుడు పెద్ద మొత్తంలో గంజాయిని కోల్‌కత్తా తరలించేందుకు సిద్ధం అయిన సమయంలో లక్ష్మణ్‌ దాన్ని దాచేస్తాడు. ఆ సరుకు కోసం శివుడు పిచ్చెక్కి పోతాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. చివరకు ఏం జరిగింది అనేది సినిమా కథ."},{"text":""},{"text":"నటీనటులు :"},{"text":"రవితేజ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆయన లుక్‌ విషయంలో మాత్రం కాస్త వయసు ఎక్కువ అయినట్లుగా అనిపించింది. వింటేజ్ రవితేజను చూస్తారు అంటూ పబ్లిసిటీ సమయంలో మేకర్స్ చెప్పారు. కానీ వింటేజ్ సీన్స్ పెద్దగా ఏమీ లేవు. ఒకటి రెండు నిమిషాలకే పరిమితం చేశారు. యాక్షన్‌ సీన్స్‌లో రవితేజ ఎనర్జీ కనిపించింది. అయితే డాన్స్‌ ల్లో శ్రీలీల ముందు రవితేజ ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాడు అని చెప్పుకోక తప్పదు. ఓవరాల్‌గా మాస్‌ మహారాజా రవితేజ మాస్‌ జాతర తన భుజాలపై వేసుకుని నడిపించే ప్రయత్నం చేశాడు."},{"text":""},{"text":"శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఫస్ట్‌ హాఫ్‌ లో కొంత సమయం కనిపించినా, సెకండ్‌ హాఫ్‌ లో కొన్ని నిమిషాలు మాత్రమే ఆమె కనిపించింది. పాటలకు మాత్రమే పరిమితం అయిన పాత్ర అనిపించింది. ఉన్నంతలో మెప్పించింది. డాన్స్‌ల్లో తన ప్రతిభతో ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హైపర్ ఆది తన రొటీన్‌ పంచ్‌ డైలాగ్స్ తో పర్వాలేదు అనిపించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు."},{"text":""},{"text":"టెక్నికల్‌:"},{"text":"దర్శకుడు భాను కథ విషయంలో ఇంకాస్త వర్కౌట్‌ చేస్తే బాగుండేది. రైల్వే పోలీస్‌ అనే లైన్‌ బాగానే ఉంది, కానీ గంజాయి చుట్టూ సాగే కథలు చాలానే ఉన్నాయి. ఇంకాస్త విభిన్నంగా కథను రాసుకుని ఉంటే బాగుండేది. కనీసం స్క్రీన్‌ప్లేతో అయినా మ్యాజిక్ చేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ కొన్ని యాప్ట్‌ కాలేదు. భీమ్స్ అందించిన పాటలు ఒకటి రెండు వింటూ ఉంటే బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్‌ ప్లే కు బ్రేక్‌లు వేసినట్లుగా అనిపించాయి."},{"text":""},{"text":"ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే పాటల ప్లేస్‌మెంట్‌ ఏమాత్రం సెట్‌ కాలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ తో రవితేజ ఫ్యాన్స్‌కి, ఆయన ఎలివేషన్ సీన్స్‌ కి మంచి హైప్‌ వచ్చే విధంగా భీమ్స్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ లో సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడుతాయి. యాక్షన్ సీన్స్ నేచురాలిటీకి దగ్గరగా ఉండే విధంగా ప్లాన్‌ చేశారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌లో జర్క్‌ లు ఉన్నాయి. కాస్త క్రిస్పీగా ఉండాల్సింది."},{"text":""},{"text":"విశ్లేషణ :"},{"text":"రవితేజ సినిమా అనగానే మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా అప్పట్లో ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు రవితేజ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈసారి అయినా రవితేజ హిట్‌ కొట్టేనా అని నీరసంగా, నిరుత్సాహంగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అయినా కూడా రవితేజలో ఎనర్జీ మాత్రం తగ్గలేదు. తన సినిమాల ఫలితంతో సబంధం లేదు అన్నట్లుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు."},{"text":""},{"text":"సితార వారి బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. అది కూడా ఈ మధ్య కాలంలో మెల్ల మెల్లగా పోతుంది. ఇలాంటి సమయంలో వచ్చిన మాస్‌ జాతర రవితేజ స్టార్‌డంను నిలబెట్టేనా, సితార వారి పరువు నిలుపుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆ పని చేయలేదు అని చెప్పక తప్పదు. రవితేజ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ సాఫీగా సాగింది. కానీ సెకండ్‌ హాఫ్‌ విషయంలో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఒకటి రెండు యాక్షన్ సీన్స్‌ తప్ప సెకండ్‌ హాఫ్‌ లో చెప్పుకోవడానికి ఏమీ లేవు."},{"text":""},{"text":"కథలో ట్విస్ట్‌లు లేవు, స్క్రీన్‌ ప్లే మొత్తం ముందే ఊహించేదిగా ఉంది. ఎక్కడా ఆసక్తికరంగా స్క్రీన్‌ ప్లే సాగిందే లేదు. ఆది కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. మొత్తంగా మాస్ జాతర ఆకట్టుకోలేక పోయిన యాక్షన్‌ జాతర."},{"text":""},{"text":"ప్లస్‌ పాయింట్స్‌ :"},{"text":"రవితేజ,"},{"text":"ఫస్ట్‌ హాఫ్‌ కొన్ని సీన్స్‌."},{"text":""},{"text":"మైనస్ పాయింట్స్ :"},{"text":"కథ, కథనం,"},{"text":"రొటీన్‌ కామెడీ, యాక్షన్‌,"},{"text":"పాటల ప్లేస్‌మెంట్‌,"},{"text":"రొటీన్‌ క్లైమాక్స్‌."},{"text":""},{"text":"చివరగా..."},{"text":"వింటేజ్‌ రవితేజను చూపిస్తారనుకుంటే రొటీన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ను చూపించాడు."},{"text":""},{"text":"బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌"},{"text":""},{"text":"నిర్మాత : నాగవంశీ"},{"text":""},{"text":"దర్శకత్వం : భాను భోగవరపు"},{"text":""},{"text":"సంగీతం : భీమ్స్‌ సిసిరోలియో"},{"text":""},{"text":"తారాగణం : రవితేజ, శ్రీలీల, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, హైపర్‌ ఆది తదితరులు"}]}}},"relatedReviews":{"edges":[{"node":{"uid":"review-comrade-kalyan-","data":{"title":{"text":"Review: 'Comrade Kalyan' "},"img":{"url":"https://images.prismic.io/prad/bc2LuntcOi-ChERR_ck.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}},{"node":{"uid":"review-dont-trouble-the-trouble","data":{"title":{"text":"Review: ‘Don’t Trouble the Trouble’"},"img":{"url":"https://images.prismic.io/prad/bqNucWhmNWKKQiVy_DTTT.JPG?auto=format,compress"},"rating":1.75}}},{"node":{"uid":"review-the-paradise","data":{"title":{"text":"Review: 'The Paradise'"},"img":{"url":"https://images.prismic.io/prad/gykUOtmdxL0XVM2y_TheParadise.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2.25}}},{"node":{"uid":"review-epic","data":{"title":{"text":"Review: 'Epic'"},"img":{"url":"https://images.prismic.io/prad/i5tpcCyZXxZGstkc_EPICreview.jpg?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"rating":2}}}]},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ysrcp-every-seat-must-see-a-fight","data":{"third_party_url":null,"title":{"text":"YSRCP: Every Seat Must See a Fight"},"img":{"url":"https://images.prismic.io/prad/Gk_IYoGJA83EfjZs_jagan.JPG?auto=format%2Ccompress&rect=0%2C22%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-14T14:47:00+0000"}}},{"node":{"uid":"ed-seizes-reliance-power-assets-worth-2032-cr","data":{"third_party_url":null,"title":{"text":"ED seizes Reliance Power assets worth 2,032 cr"},"img":{"url":"https://images.prismic.io/prad/aIz4r6Tt2nPbZrgR_anilambani.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T12:45:00+0000"}}},{"node":{"uid":"ed-attaches-129-cr-in-ttd-ghee-case","data":{"third_party_url":null,"title":{"text":"ED Attaches 129 Cr in TTD Ghee Case"},"img":{"url":"https://images.prismic.io/prad/ZuxhHbVsGrYSvmU3_tirumalaladdu.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T15:42:00+0000"}}},{"node":{"uid":"trump-promises-5k-if-gop-wins","data":{"third_party_url":null,"title":{"text":"Trump Promises $5K if GOP Wins"},"img":{"url":"https://images.prismic.io/prad%2F297f16fa-5103-4b35-813b-76f5f9ba4215_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C13%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-14T03:29:00+0000"}}},{"node":{"uid":"mp-avinash-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"MP Avinash Reddy appears before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/7c2a5caa-1f8e-40d0-b5ff-c3a80775b6a7_avinash+reddy.JPG?auto=format,compress"},"datetime":"2026-10-14T07:30:00+0000"}}},{"node":{"uid":"andhra-nda-haggles-over-local-poll-seats","data":{"third_party_url":null,"title":{"text":"Andhra NDA Haggles Over Local Poll Seats"},"img":{"url":"https://images.prismic.io/prad/Lx247yLX8ZRXWkFC_apndapartners.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:30:00+0000"}}},{"node":{"uid":"rahul-casts-for-protest-battle","data":{"third_party_url":null,"title":{"text":"Rahul Casts for Protest Battle!"},"img":{"url":"https://images.prismic.io/prad/zYKLUmbsWJagQskr_rahulprotest.JPG?auto=format%2Ccompress&rect=0%2C32%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T12:15:00+0000"}}},{"node":{"uid":"democratic-house-would-test-trumps-india-agenda","data":{"third_party_url":null,"title":{"text":"Democratic House would test Trump’s India agenda"},"img":{"url":"https://images.prismic.io/prad/15m8SwaCDnQQJ7yn_USwashington.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-13T05:55:00+0000"}}},{"node":{"uid":"tirupati-eyes-global-glory","data":{"third_party_url":null,"title":{"text":"Tirupati Eyes Global Glory"},"img":{"url":"https://images.prismic.io/prad%2F754a7b33-759c-4ae5-bc2b-ef7d792c592f_tirupati.jpg?auto=format%2Ccompress&rect=0%2C207%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-12T18:39:00+0000"}}},{"node":{"uid":"viveka-case-bhaskar-reddy-appears-before-ed","data":{"third_party_url":null,"title":{"text":"Viveka Case: Bhaskar Reddy Appears Before ED"},"img":{"url":"https://images.prismic.io/prad/c8ea4321-db22-4d42-871c-556bf38ae249_YS+Bhaskar+Reddy.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-13T08:00:00+0000"}}},{"node":{"uid":"andhra-ias-officer-booked-for-pub-slap","data":{"third_party_url":null,"title":{"text":"Andhra IAS Officer Booked for Pub Slap"},"img":{"url":"https://images.prismic.io/prad/ykacwyBERrHahPse_slappedIAS.JPG?auto=format%2Ccompress&rect=0%2C116%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-13T07:15:00+0000"}}},{"node":{"uid":"4-burnt-alive-as-car-catches-fire-in-vijayawada","data":{"third_party_url":null,"title":{"text":"4 burnt alive as car catches fire in Vijayawada"},"img":{"url":"https://images.prismic.io/prad/aSQZ82GnmrmGqKTy_carcharred.JPG?auto=format,compress"},"datetime":"2026-10-12T15:49:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"mass-jathara-review-routine-action-entertainer","tags":["politics"]}}