{"data":{"prismicReviewarticle":{"uid":"review-thug-life---routine-gangster-drama","tags":["politics"],"first_publication_date":"2025-06-05T10:18:16+0000","last_publication_date":"2025-06-06T10:19:19+0000","data":{"title":{"text":"'థగ్‌ లైఫ్‌' రివ్యూ... రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా"},"rating":2,"datetime":"2025-06-06T10:12:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/aEFtdLh8WN-LVpF1_thuglife.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=BOZaRvNIdCw","thumbnail_url":"https://i.ytimg.com/vi/BOZaRvNIdCw/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@saregamasouth","title":"Thug Life - Telugu Trailer | Kamal Haasan | Mani Ratnam | STR | AR Rahman | RKFI | MT | RG"},"content":{"raw":[{"text":"కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం 'నాయగన్‌' సినిమా వచ్చింది. ఆ సినిమా క్లాసిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచి పోయే సినిమా అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి కాంబోలో మూవీ రాలేదు. ఇన్నాళ్ల ఎదురు చూపులకు తెర దించుతూ మరో గ్యాంగ్‌స్టర్‌ స్టోరీతో మణిరత్నం వచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా నాయగన్ సినిమాను మరపిస్తుంది అంటూ మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం."},{"text":"కథ :"},{"text":"ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌ అయిన శక్తి రాజు(కమల్‌ హాసన్‌) ఒక గ్యాంగ్‌ వార్‌ సమయంలో చిన్న బాలుడు అయిన అమర్‌(శింబు)ను అడ్డు పెట్టుకుని ప్రాణాలను కాపాడుకుంటాడు. తన ప్రాణాలకు అండగా నిలిచిన అమర్‌ను అప్పటి నుంచి తన కొడుకుగా శక్తి రాజు చూసుకుంటూ ఉంటాడు. అమర్‌ పెరిగి పెద్ద వాడు అయిన తర్వాత శక్తి రాజుకు గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. శక్తి రాజుపై ఒకసారి జరిగిన దాడికి అమర్‌ కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. అదే సమయంలో తన తండ్రిని శక్తిరాజు చంపాడని తెలుసుకున్న అమర్‌ పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. "},{"text":"అందుకోసం శక్తి రాజును ఒక లోయలోకి అమర్‌ తోచి చనిపోయాడు అనుకుని అక్కడ నుంచి వెళ్తాడు. అయితే రెండేళ్ల తర్వాత శక్తిరాజు తిరిగి వస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇంతకు అమర్‌ ఎవరు? ఎందుకు అమర్‌ తండ్రిని శక్తిరాజు చంపాల్సి వచ్చింది? అనే విషయాలతో కథ సాగుతుంది."},{"text":"నటీనటుల నటన :"},{"text":"యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శక్తిరాజు పాత్రలో అద్భుతమైన నటన కనబర్చిన కమల్‌ హాసన్‌ కొన్ని ఎమోషన్ సీన్స్‌లో అదరగొట్టాడు. యంగ్‌ ఏజ్‌ కమల్‌ లుక్‌ బాగుంది. ఆ వింటేజ్ లుక్‌ కచ్చితంగా అభిమానులను అలరిస్తుంది. ఇక ఓల్డ్‌ ఏజ్‌ లుక్‌లో కూడా కమల్‌ హాసన్‌ మెప్పించే విధంగా ఉన్నాడు. హీరోయిన్స్‌తో ఆయన రొమాంటిక్‌ సీన్స్‌ సైతం బాగుంటాయి. ఈ వయసులోనూ ఆ సీన్స్‌లో మెప్పించడం మామూలు విషయం కాదు."},{"text":"శింబు పోషించిన పాత్ర సినిమాకు అత్యంత కీలకం. కమల్‌ వంటి స్టార్‌తో నటించిన సమయంలో చిన్న హీరోలకు నటించే స్కోప్ పెద్దగా ఉండదు. కానీ ఈ సినిమాలో శింబు పాత్రకు చాలా స్కోప్ దక్కింది. ఆయన ఎమోషన్స్‌ కనబర్చే విధంగా నటించే ఆస్కారం దక్కింది. అందుకు తగ్గట్లుగానే శింబు నటించి మెప్పించాడు. ఆకట్టుకునే విధంగా యాక్షన్‌ సన్నివేశాలను చేశాడు. హీరోయిన్‌ త్రిష లుక్‌ బాగుంది. అయితే ఆమె ఎక్కువ సీన్స్‌ లో లేకపోవడం కాస్త వెలితిగా అనిపించింది. అభిరామి నటనతో మెప్పించింది. ఈమెకు సైతం ఎక్కువ సీన్స్‌ దక్కలేదు. ఓవరాల్‌గా నటీనటుల నటన కథానుసారంగా పర్వాలేదు అన్నట్లుగా ఉంది. అయితే కొందరి పాత్రలకు అసలు ప్రాముఖ్యత దక్కలేదు."},{"text":"టెక్నికల్‌ :"},{"text":"దర్శకుడు మణిరత్నం పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసి ఇచ్చినట్లుగా ఈ సినిమాను రూపొందించాడు. మూస కథ, కథనంను ఈ సినిమాలో చూపించాడు. కాలంతో పాటు మనం మారాలి అంటారు. అలా మరకుంటే ఈ సినిమాకు ఎదురైన పరిస్థితి తప్పదు. కమల్‌ హాసన్‌ ను చూపించడంలో పెట్టిన శ్రద్ద కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో మణిరత్నం పెట్టినట్లుగా అనిపించలేదు. అందుకే స్క్రీన్‌ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు. "},{"text":"డైలాగ్స్ సైతం మూసగా ఉన్నాయి. రెగ్యులర్‌ మాఫియా సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది. సినిమాటోగ్రఫీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. రెహమాన్‌ సంగీతం అభిమానులు ఆశించే స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదు కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి."},{"text":"విశ్లేషణ :"},{"text":"సాధారణంగా హిట్‌ కాంబోలో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఫలితం తారు మారు అవుతుంది. థగ్‌ లైఫ్‌ విషయంలో అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో దర్శకుడు మణిరత్నం విఫలం అయ్యాడు. ఒకటి రెండు సన్నివేశాలు మినహా నాయగన్‌ సినిమాను ఎక్కడ కూడా మ్యాచ్ చేసే పరిస్థితి కాదు కదా.. కనీసం ఆ సినిమా వైపు కూడా వెళ్లలేక పోయింది. నాయగన్‌ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది, ఆ సినిమాను మరిపిస్తుంది అంటే చాలా మంది చాలా ఊహించుకున్నారు. కానీ ఫలితం మాత్రం రివర్స్ ఉంది. "},{"text":"చిన్న హీరోలు, కొత్త దర్శకులు చేసిన మాఫియా సినిమాలు చాలా వరకు దీని కంటే నయం అన్నట్లుగా ఉంది. రొటీన్‌, రెగ్యులర్‌ కథ, అదే రొటీన్‌, రెగ్యులర్‌ స్క్రీన్‌ ప్లే కారణంగా థగ్‌ లైఫ్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష. కమల్‌ కోసం చూడవచ్చు అనుకుంటే కొన్ని సన్నివేశాల్లో బాబోయ్‌ అవసరమా అనిపించింది. "},{"text":"ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగినా సెకండ్‌ హాఫ్‌ లో పూర్తిగా ఢొల్లగా స్క్రీన్‌ ప్లే నడిచింది. ప్రతి సీన్‌ ముందే ఊహించే విధంగా ఉంది. క్లైమాక్స్ చాలా నాసిరకంగా తీశారు. ఈ సినిమాకు ఎలా రూ.300 కోట్ల బడ్జెట్‌ అయిందో నిర్మాతలే చెప్పాలి. ఈ సినిమా చుట్టూ ఇంత వివాదం సాగిందా.. అంత సీన్‌ లేదు అంటూ కొందరు కామెంట్‌ చేసే విధంగా ఉంది. మొత్తంగా థగ్‌ లైఫ్‌ కమల్‌ అభిమానులకు కాస్త పర్వాలేదు అనిపించినా, ఇతరులకు మాత్రం అక్కర్లేదు అనిపించింది."},{"text":"ప్లస్‌ పాయింట్స్ :"},{"text":"కమల్‌ హాసన్‌,"},{"text":"ఫస్ట్‌హాఫ్‌లోని కొన్ని సీన్స్‌,"},{"text":"కమల్‌, శింబు కాంబో సీన్స్‌,"},{"text":"మైనస్ పాయింట్స్‌ :"},{"text":"సెకండ్‌ హాఫ్‌,"},{"text":"కథ, కథనం,"},{"text":"సంగీతం,"},{"text":"హీరోయిన్స్‌కు ప్రాముఖ్యత దక్కలేదు,"},{"text":"ఎడిటింగ్‌."},{"text":"చివరగా..."},{"text":"కమల్‌ కోసం తప్ప థగ్‌ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేయడం సాధ్యం కాదు."},{"text":"బ్యానర్ : రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌, మద్రాస్ టాకీస్‌"},{"text":"నిర్మాత : కమల్‌ హాసన్‌, మణిరత్నం"},{"text":"దర్శకత్వం : మణిరత్నం"},{"text":"సంగీతం : ఏ ఆర్ రెహమాన్‌"},{"text":"తారాగణం : కమల్‌ హాసన్‌, శింబు, నాజర్‌, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, మహేష్‌ మంజ్రేకర్‌ తదితరులు"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"jagans-parliament-game-plan","data":{"third_party_url":null,"title":{"text":"Jagan's Parliament Game Plan"},"img":{"url":"https://images.prismic.io/prad/810d1863-6597-42fe-a381-561dedc41fcd_Jagan+Padayatra.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T12:39:00+0000"}}},{"node":{"uid":"brs-mlcs-son-allegedly-caught-consuming-drugs","data":{"third_party_url":null,"title":{"text":"BRS MLC’s son allegedly caught consuming drugs"},"img":{"url":"https://images.prismic.io/prad/abaY9bbci2UF6Ba0_drugs.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T11:20:00+0000"}}},{"node":{"uid":"19-year-old-gangraped-in-moving-car","data":{"third_party_url":null,"title":{"text":"19-year-old gangraped in moving car!"},"img":{"url":"https://images.prismic.io/prad/0ff7b792-4bed-4ff7-a224-a113b9458a11_rape+in+car.JPG?auto=format,compress"},"datetime":"2026-07-16T05:30:00+0000"}}},{"node":{"uid":"ambati-booked-for-pushing-cops","data":{"third_party_url":null,"title":{"text":"Ambati booked for pushing cops"},"img":{"url":"https://images.prismic.io/prad/qRuFEiDbJVubW1tS_protest.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:05:00+0000"}}},{"node":{"uid":"hindu-student-of-hyd-school-asked-to-read-kalma","data":{"third_party_url":null,"title":{"text":"Hindu student of Hyd school asked to read ‘Kalma’"},"img":{"url":"https://images.prismic.io/prad/NdwjrZdbqXzMnDzj_kalmaread.JPG?auto=format%2Ccompress&rect=0%2C56%2C1600%2C789&w=2028&h=1000"},"datetime":"2026-07-16T06:49:00+0000"}}},{"node":{"uid":"tvk-functionary-caught-in-bribery-row","data":{"third_party_url":null,"title":{"text":"TVK functionary caught in bribery row"},"img":{"url":"https://images.prismic.io/prad/dca4c7f3-786c-4df0-b6d0-279fab09fe63_bribe.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T12:30:00+0000"}}},{"node":{"uid":"pk-discharged-from-mumbai-hospital","data":{"third_party_url":null,"title":{"text":"PK discharged from Mumbai hospital"},"img":{"url":"https://images.prismic.io/prad/kcQhZtu-3r-qGq13_pawandischarged.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T10:15:00+0000"}}},{"node":{"uid":"ncp-hit-by-twin-battles","data":{"third_party_url":null,"title":{"text":"NCP Hit by Twin Battles"},"img":{"url":"https://images.prismic.io/prad/ZTgqZZcbiHezVnzi_NCPbattle.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-07-15T06:25:00+0000"}}},{"node":{"uid":"mudragada-house-sees-family-drama","data":{"third_party_url":null,"title":{"text":"Mudragada House Sees Family Drama"},"img":{"url":"https://images.prismic.io/prad/_iPohczf0DK_uQIm_mudradaughter.JPG?auto=format,compress"},"datetime":"2026-07-15T06:36:00+0000"}}},{"node":{"uid":"rr-has-no-dual-voter-entry-clarifies-election-offi","data":{"third_party_url":null,"title":{"text":"RR has no dual voter entry, clarifies election officer"},"img":{"url":"https://images.prismic.io/prad/ZgVSPst2UUcvBP-2_rrcastvote.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T18:30:00+0000"}}},{"node":{"uid":"adani-group-fastest-to-enter-indias-top-10-brands","data":{"third_party_url":null,"title":{"text":"Adani Group fastest to enter India’s top 10 brands"},"img":{"url":"https://images.prismic.io/prad/555a0227-209b-4628-87ee-813af49bbab8_adani.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-07-14T12:45:00+0000"}}},{"node":{"uid":"vijayashanti-targets-own-government","data":{"third_party_url":null,"title":{"text":"Vijayashanti targets own government"},"img":{"url":"https://images.prismic.io/prad/EFT5umefvzEmspg7_vijayashanthi.JPG?auto=format,compress"},"datetime":"2026-07-14T11:11:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-thug-life---routine-gangster-drama","tags":["politics"]}}