{"data":{"prismicReviewarticle":{"uid":"review-operation-valentine","tags":["politics"],"first_publication_date":"2024-03-01T05:08:27+0000","last_publication_date":"2024-03-02T14:28:26+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘ఆపరేషన్ వాలెంటైన్’ "},"rating":null,"datetime":"2024-03-01T04:45:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/65e15d5227237c2bb829b24a_OperationVaalentines.JPG?auto=format%2Ccompress&rect=0%2C0%2C2028%2C1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=nls7AradbRw","thumbnail_url":"https://i.ytimg.com/vi/nls7AradbRw/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@sonypicturesfilmsindia","title":"Operation Valentine | Official Telugu Trailer | Varun Tej, Manushi Chhillar| 1st March 2024"},"content":{"raw":[{"text":"రెగ్యులర్ చిత్రాలతో పాటు అంతరిక్షం లాంటి భిన్నమైన జోనర్ చిత్రాలు చేస్తూ మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా తెగులో తొలిసారి రూపొందిన ఏరియల్ యాక్షన్ జోనర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీలో రూపొందిన ఈ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. "},{"text":"కథ: అర్జున్ రుద్ర దేవ్(వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసే ధైర్య సాహసాలతో కూడిన స్వాడ్రన్ లీడర్. తన టీంతో కలిసి శత్రు సైన్యంపై దాడి చేసే వజ్ర మిషన్ పూర్తి చేయడంలో రుద్ర విఫలం అవుతాడు. దీంతో అతడిపై ఆంక్షలు విధిస్తారు. దీని వల్ల కాస్త డిస్ట్రబ్ అయి కోలుకుంటున్న సమయంలో ఆపరేషన్ వాలంటైన్ మిషన్ ను లీడ్ చేసే బాధ్యతలు రుద్రకు అప్పగిస్తారు. "},{"text":"ఆపరేషన్ వాలైంటైన్ వెనక ఉన్న కథేంటి? దాన్ని ఏ విధంగా ఫినిష్ చేశాడు? వజ్ర మిషన్ లో రుద్ర ఫెయిల్ కావడానికి కారణం ఏమిటి? ఆ మిషన్ వెనక ఉన్న లక్ష్యం ఏమిటి? తన ప్రియురాలు మరియు ఎయిర్ ఫోర్స్ రాడార్ ఆఫీసర్ అహానా గిల్(మాను చిల్లర్)తో అతడికి ఎందుకు విబేధాలు వచ్చాయి లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే. "},{"text":"పెర్ఫార్మెన్స్.."},{"text":"ఎయిర్ ఫోర్స్ ఫైటర్ అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ బాగా సూట్ అవ్వడమే కాదు ప్రేక్షకులను మెప్పించేలా నటించాడు. "},{"text":"రాడార్ ఆఫీసర్ మానుషీ చిల్లర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. అయితే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ చర్చించుకునే స్థాయిలో లేదు. ఇతర నటీనటుల పరితమైన పాత్రల్లో కనిపించారు. "},{"text":"సాంకేతికంగా..."},{"text":"సోనీ పిక్చర్స్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సంగీతం, విఎఫ్ఎక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాలు బాగా పని చేశాయి "},{"text":"సినిమా ఎలా ఉందంటే..."},{"text":"భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. పుల్వామా ఎటాక్, అందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ లోని బాలాకోట్ మీద చేసిన సర్జికల్ స్టైక్స్ లాంటి సంఘటనలు కళ్లకు కట్టేలా చూపించిన చిత్రం ఇది. అయితే మొదటి భాగంలో కథనం గొప్పగా లేక పోవడం, భావోద్వేగాలు కొరవడటంతో సినిమా సింపుల్ గా సాగినట్లు ఉంటుంది. అయితే వైమానిక దాడులు చిత్రీకరించిన తీరు, శత్రు స్థావరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడుతున్న తీరు ఆకట్టుకుంటాయి. "},{"text":"దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరపై వైమానిక దళాన్ని, వారు చేసే ఆపరేషన్లు, దాడులు లాంటి సన్నివేశాలను రియలిస్టిక్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. విజువల్ ఔట్ పుట్ పర్ఫెక్టుగా వచ్చేలా చూసుకున్నాడు. అయితే దర్శకుడు ఇలాంటి చిత్రాలకు చాలా ముఖ్యమైన డ్రామాను, భావోద్వేగాలను బిల్డ్ చేయడం విఫలం అయ్యాడనే చెప్పొచ్చు. రుద్ర, అహాన మధ్య నడిచే లవ్ ట్రాక్ లో సంఘర్షన లోపించడంతో సాధారణంగా సాగినట్లు ఉంటుంది. దర్శకుడు కథనం మీద మరింత ఫోకస్ పెడితే బావుండేది. "},{"text":"ప్లస్ పాయింట్స్.."},{"text":"-ఈ కథ కోసం ఎంచుకున్న సంఘటనలు"},{"text":"-వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ నటన"},{"text":"-విజువల్ ఎఫెక్ట్స్"},{"text":"మైనస్ పాయింట్స్.."},{"text":"-ఇలాంటి చిత్రాలకు అవసరమైన భావోద్వేగాలు కొరవడటం"},{"text":"-కథనం సాదా సీదాగా ఉండటం"},{"text":"ఫైనల్ గా..."},{"text":"దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది."}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"149-indian-nationals-rescued-in-nepal-after-floods","data":{"third_party_url":null,"title":{"text":"149 Indian nationals rescued in Nepal after floods"},"img":{"url":"https://images.prismic.io/prad/g5C3QQcdGjpS2GX-_nepalfloods.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-08-30T13:32:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-operation-valentine","tags":["politics"]}}